https://oktelugu.com/

Pawan Kalyan: సినిమా టికెట్ల వ్యవహారం: జగన్ ను ఆ ఒక్కమాటతో కడిగేసిన పవన్ కళ్యాణ్

Pawan Kalyan: సినిమా టికెట్ల వ్యవహారాన్ని బయటకు తీసి మరీ ఏపీ సీఎం జగన్ ను కడిగిపారేశారు పవన్ కళ్యాణ్. సీఎం జగన్ కు ఇగో ఉందని.. ఆ ఇగోను సాటిస్ ఫై చేయాలంటే ఎంత పెద్ద వ్యక్తులైనా ఆయనను కలిసి శరణు వేడాలని.. అప్పుడే సమస్యలు తీరుస్తాడని పవన్ నిప్పులు చెరిగారు. అలా చేయకుంటే సమస్యలు సృష్టిస్తారని ఆడిపోసుకున్నారు. ఇది రాజరికం కాదని.. ప్రజాస్వామ్యం అని.. అందరూ వచ్చి మీకు సలాం కొట్టాల్సిన అవసరం లేదని […]

Written By:
  • NARESH
  • , Updated On : February 20, 2022 / 08:57 PM IST
    Follow us on

    Pawan Kalyan: సినిమా టికెట్ల వ్యవహారాన్ని బయటకు తీసి మరీ ఏపీ సీఎం జగన్ ను కడిగిపారేశారు పవన్ కళ్యాణ్. సీఎం జగన్ కు ఇగో ఉందని.. ఆ ఇగోను సాటిస్ ఫై చేయాలంటే ఎంత పెద్ద వ్యక్తులైనా ఆయనను కలిసి శరణు వేడాలని.. అప్పుడే సమస్యలు తీరుస్తాడని పవన్ నిప్పులు చెరిగారు. అలా చేయకుంటే సమస్యలు సృష్టిస్తారని ఆడిపోసుకున్నారు. ఇది రాజరికం కాదని.. ప్రజాస్వామ్యం అని.. అందరూ వచ్చి మీకు సలాం కొట్టాల్సిన అవసరం లేదని పవన్ నిప్పులు చెరిగారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో జనసేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మత్స్యకార అభ్యున్నతి సభలో పవన్ నిప్పులు చెరిగారు.

    పవన్ వ్యాఖ్యలను బట్టి చిరంజీవి లాంటి ఇండస్ట్రీ పెద్ద మనిషి సైతం వచ్చి జగన్ ను సినీ ఇండస్ట్రీ సమస్యలపై వేడుకోవడాన్ని పవన్ ప్రశ్నించినట్టు తెలుస్తోంది. సినీ ఇండస్ట్రీ మొత్తం వచ్చినా సినీ సమస్యలను పరిష్కరించలేని జగన్ తీరును పవన్ ఎండగట్టారు. లేని సమస్యలు సృష్టించడంలో వైసీపీ నేతలు ఉద్దండులని పవన్ అన్నారు.

    మత్స్యకారుల పొట్టకొట్టే జీవో 217 కోసం చట్టాలు ఉల్లంగించాలని.. దోపిడీ చేసే చట్టాలను ఉల్లంఘించాలని పవన్ పిలుపునిచ్చారు. ప్రభుత్వ జీవో కాపీలు చించేశానని.. అవసరమైతే కేసులు పెట్టుకోండని సవాల్ చేశారు.లేని సమస్యలు సృష్టించడంలో వైసీపీ నేతలు ఉద్దండులు అని.. మత్స్యకారుల పొట్ట కొట్టారని పవన్ నిప్పులు చెరిగారు.

    జగన్ పాదయాత్రలో ఏం చెప్పారు.? ఏం చేస్తున్నారని జగన్ నిలదీశారు. వంగివంగి దండాలు పెట్టేందుకు రాజకీయాల్లోకి రాలేదని.. మద్యం అమ్ముకుంటున్నారని.. రేపు మటన్, చికెన్ షాపులు పెట్టడానికా? అని ప్రశ్నించారు. సమస్యలు పరిష్కరించాలని దండాలు పెడితేనే సమస్యలు పరిష్కరిస్తారా? ఇదేమైనా రాచరికమా? ప్రజాస్వామ్య సమాజంలో ఉన్నామా? ఫ్యూడల్ భావాలు ఏంటని జగన్ సర్కార్ పై పవన్ నిప్పులు చెరిగారు.

    మార్చి 14న జనసేన ఆవిర్భావ సభతో ప్రజల్లోకి వస్తానని.. మన రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎలా యుద్ధం చేయాలో ప్రజలు నిర్ణయించుకోవాలని.. 2024 ఎన్నికలకు ఎలా సంసిద్ధులు కావాలనే దానిపై చర్చించుకోవాలని పవన్ సంచలన పిలుపునిచ్చారు.