ప్రకృతి ప్రకోపిస్తే ఎంతగొప్ప నాయకులైన మటాష్..

• దేశంలో జీవ నదులు కలుషితమవుతున్నాయి • జీవానిచ్చే నది… జీవనాన్ని ఇచ్చే నుడిని కాపాడుకోవడం అందరి బాధ్యత • ‘మన నది – మన నుడి’ ప్రారంభోత్సవంలో జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు శనివారం సాయంత్రం ధవళేశ్వరం సమీపంలోని శ్రీరామ పాదాల రేవులో మన నది – మన నుడి కార్యక్రమం ప్రారంభించిన అనంతరం జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ… మనకు జీవం ఇచ్చే జలాలకు… జీవనాన్ని ఇచ్చిన […]

Written By: Neelambaram, Updated On : March 15, 2020 1:48 pm
Follow us on

• దేశంలో జీవ నదులు కలుషితమవుతున్నాయి
• జీవానిచ్చే నది… జీవనాన్ని ఇచ్చే నుడిని కాపాడుకోవడం అందరి బాధ్యత
• ‘మన నది – మన నుడి’ ప్రారంభోత్సవంలో జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు

శనివారం సాయంత్రం ధవళేశ్వరం సమీపంలోని శ్రీరామ పాదాల రేవులో మన నది – మన నుడి కార్యక్రమం ప్రారంభించిన అనంతరం జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ… మనకు జీవం ఇచ్చే జలాలకు… జీవనాన్ని ఇచ్చిన నుడికి గౌరవం తెలపడానికే ‘మన నది – మన నుడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని వెల్లడించారు. అంతరించిపోతున్న విలువలను కాపాడుకోవడానికి, కాలుష్య కాషారంగా మారుతున్న నదులను పరిరక్షించుకోవడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. సంధ్యాసమయంలో ఇంత చక్కని కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం ఆనందంగా ఉందని చెప్పారు.  “గురువుకి నమస్కరించి ఎలాంటి కార్యక్రమం చేపట్టినా అది విజయవంతం అవుతుంది. ఇవాళ నా గురువు స్థానంలో ఉన్న సుబ్బరాయుడు శర్మగారి పాదాలకు నమస్కరించి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను. ప్రకృతి ప్రకోపిస్తే ప్రపంచాన్ని శాసించే గొప్ప గొప్ప నాయకులను కూడా ఇంట్లో కూర్చోపెడుతుంది. ఇవాళ కరోనా వైరస్ కూడా ప్రపంచాన్ని వణికించే నాయకులను ఇంట్లో కూర్చొబెట్టింది. అందుకే ప్రకృతిని స్వార్ధ ప్రయోజనాల కోసం ఉపయోగించరాదు.

• సత్యం కోసం ప్రాణాలు ఇస్తాం

భారతదేశం వేదభూమి. ఎవరు ఎన్ని దాడులు చేసినా మన సంస్కృతి నశించదు. అన్ని మతాలు, కులాలు, ప్రాంతాలను సమానంగా గౌరవించడం భారతదేశ జీవన విధానం. అలాంటి దేశంలో జీవనాడులైన నదులు కలుషితమవుతున్నాయి. వాటిని పరిరక్షించుకోవడం అందరి బాధ్యత. అందుకే గోదావరమ్మ ఒడ్డున ఇవాళ ఇంతటి గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము. కొంతమంది నాయకులు మన భాషను ఉపయోగించి వేలకోట్లు, వేల ఎకరాలు సంపాదించారు. ఇప్పుడు ఆ భాషనే చంపేయాలని చూస్తున్నారు. భాషను కాపాడుకోవడానికి ఈ సమాజంలో ఇంకా కొంతమంది మిగిలే ఉన్నారు. సంస్కృతిని కాపాడుకోవడానికి, ధర్మాన్ని నిలబెట్టడానికి, సత్యం కోసం ప్రాణాలైన అర్పిస్తాం.
పెద్ద బాలశిక్ష సంపూర్ణమైన జ్ఞానం ఇస్తుంది. అందుకే బాలబాలికలకు పెద్ద బాలశిక్షను కానుకగా ఇచ్చాను. నదులను కాపాడుకోవడానికి ఎలాంటి చర్యలు చేపట్టాలి, భవిష్యత్తులో అధికారంలోకి వస్తే ఎలాంటి విధానాలు అవలంబించాలి అనేది తెలుసుకోవడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది. నదులు, భాషను రక్షించుకోవడానికి ఎవరి స్థాయిలో వారు కృషి చేయాల”ని కోరారు.