Unstoppable with NBK -Pawan : అన్నయ్య చిరంజీవిలో నాకు నచ్చనివి ఇవే.. పవన్ కళ్యాణ్ షాకింగ్ కామెంట్స్

unstoppable with NBK -Pawan  : అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ ఎపిసోడ్ పార్ట్ – 1 ఇటీవలే విడుదలై సెన్సేషనల్ రెస్పాన్స్ ని దక్కించుకున్న సంగతి మన అందరికీ.. ఓటీటీ హిస్టరీ లోనే ఈ ఎపిసోడ్ ఆల్ టైం రికార్డ్స్ ని నెలకొల్పింది. కానీ మొదటి ఎపిసోడ్ లో అభిమానులు కోరుకున్న ప్రశ్నలు బాలయ్య అడగకపోవడంతో కాస్త నిరుత్సాహానికి గురయ్యారు అభిమానులు. కానీ రెండవ భాగం లో మాత్రం మొత్తం […]

Written By: NARESH, Updated On : February 9, 2023 10:28 pm
Follow us on

unstoppable with NBK -Pawan  : అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ ఎపిసోడ్ పార్ట్ – 1 ఇటీవలే విడుదలై సెన్సేషనల్ రెస్పాన్స్ ని దక్కించుకున్న సంగతి మన అందరికీ.. ఓటీటీ హిస్టరీ లోనే ఈ ఎపిసోడ్ ఆల్ టైం రికార్డ్స్ ని నెలకొల్పింది. కానీ మొదటి ఎపిసోడ్ లో అభిమానులు కోరుకున్న ప్రశ్నలు బాలయ్య అడగకపోవడంతో కాస్త నిరుత్సాహానికి గురయ్యారు అభిమానులు. కానీ రెండవ భాగం లో మాత్రం మొత్తం అభిమానులు కోరుకున్న విధంగా పాలిటిక్స్ గురించే ఉంటుందని మొన్న విడుదల చేసిన ప్రోమోతోనే అందరికి అర్థమైంది.

అభిమానులతో పాటుగా ప్రేక్షకులు , రాజకీయ నాయకులూ కూడా ఈ ఎపిసోడ్ కోసం ఎంతగానో ఎదురు చూసారు.. మొత్తానికి వాళ్ళ ఎదురు చూపులకు తెరపడింది. ఈ ఎపిసోడ్ నేడు టెలికాస్ట్ అయ్యింది, ఫ్యాన్స్ నుండి మొదటి భాగం కంటే అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.. ఇందులో బాలయ్య పవన్ కళ్యాణ్ ని అడిగిన కొన్ని ప్రశ్నలకు పవన్ ఇచ్చిన సమాధానాలు వైరల్ అయ్యాయి.

ముందుగా ఎపిసోడ్ ప్రారంభంలోనే బాలయ్య బాబు ఒక ఆసక్తికరమైన ప్రశ్న అడిగాడు. ‘నాకు మా నాన్న గారు దైవం, ఆయన నుండి చాలా నేర్చుకున్నాను, అలా నీకు మీ అన్నయ్య గారు దైవం.. ఆయన నుండి నువ్వు నేర్చుకున్నది ఏమిటి, వదిలేసింది ఏమిటి’ అని అడుగుతాడు బాలయ్య.

అప్పుడు పవన్ కళ్యాణ్ దానికి సమాధానం చెప్తూ ‘చిన్నప్పటి నుండి మా అన్నయ్య గారి దగ్గర నుండి నేర్చుకున్నది కష్టపడే తత్త్వం, అలాగే కుటుంబం మొత్తం ఎలా కలిసి ఉండాలి అనేది కూడా ఆయన నుండే నేర్చుకున్నాను.. ఆయన నుండి నేర్చుకోకుంటే బాగుంటుంది అని అనిపించింది ఆయన మొహమాటం, అది రాజకీయాలకు పనికిరాదు కాబట్టి నేను దానికి దూరంగా ఉంటాను.. అన్నయ్య అతి మంచితనం కూడా నాకు నచ్చదు.. దాని వల్ల ఆయన చాలా నష్టాలను చూడాల్సి వచ్చింది.. అలాంటి పరిస్థితులకు నేను దూరంగా ఉంటాను’ అని చెప్పుకొచ్చాడు పవన్ కళ్యాణ్.

మొత్తంగా అన్నయ్య మంచితనం, మొహమాటం నష్టం చేకూర్చుతుందన్న సంచలన నిజాన్ని పవన్ కళ్యాణ్ బయటపెట్టారు.