Pawan Kalyan- Navratri Pooja: రాజకీయ నేతలకు భక్తి ఎక్కువే. దైవాన్ని నమ్ముతారు. దేవుడి దయతోనే తమకు ఈ భాగ్యం పట్టించదని భావిస్తుంటారు. ఇందులో భాగంగానే పూజలు చేస్తుంటారు. దీనికి గాను ఎంతటి కఠోర నియమాలైనా పాటిస్తారు. ఈ నేపథ్యంలో జనసేన అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సైతం ప్రజల సంక్షేమం కోసం దీక్షలు చేపట్టడం ఇదివరకే చేశారు. గతంలో నాలుగు నెలలు ఆషాఢం, శ్రావణం, భాద్రపద, అశ్వీజ మాసాలు దీక్ష చేపట్టారు. రోజు ఒంటిపూట భోజనం, నేల మీద నిద్ర పోయి నిష్టగా ఉన్నారు. రాష్ట్రంలో సుభిక్ష వాతావరణం ఉండాలని, ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని ఈ మేరకు పవన్ దీక్ష చేపట్టినట్లు ప్రకటించారు. సెప్టెంబర్ 2 పవన్ కల్యాణ్ పుట్టిన రోజున దీక్ష విరమించారు. దైవభక్తి పవన్ కల్యాణ్ కు ఎక్కువే. భగవంతుని నామస్మరణలో గడిపేందుకు నిర్ణయించుకోవడం ఆయనకు అలవాటుగా మారింది.

నేడు హైదరాబాద్ నగరంలోని జనసేన కేంద్ర పార్టీ కార్యాలయంలో సరస్వతి అమ్మవారికి పూజలు చేశారు. దేవత దయ వల్ల రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకున్నారు. దేవుళ్లకు పూజలు చేస్తూ దీక్షలు చేపట్టడం కొత్తేమీ కాదు. తెలుగు ప్రజల సంక్షేమం దృష్ట్యా ఆయన పలుమార్లు మొక్కులు తీర్చుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఆయన సరస్వతికి పూజ చేసినట్లు చెబుతున్నారు. దుర్గాదేవి నవరాత్రోత్సవాల్లో భాగంగా రోజుకో అవతారంలో అమ్మవారు దర్శనం ఇవ్వడం చూస్తున్నాం.
పవన్ కల్యాణ్ ఆధ్యాత్మికతకు పెద్దపీట వేస్తారు. అన్ని మతాలను గౌరవిస్తారు. అందరితో కలివిడిగా ఉంటారు. ఈ నేపథ్యంలో ఆయన నగరంలో సరస్వతి పూజ చేసి మరోమారు ప్రజల కోసం ఎలాంటి త్యాగం చేయడానికైనా సిద్ధమేనని చెప్పడానికే నిర్ణయించుకున్నారు. అటు రాజకీయాల్లో, ఇటు సినిమాల్లో బిజీగా ఉంటున్నారు. తమ ప్రజల కోసం పలు రకాల పూజలు చేయడం పరిపాటే. దీంతో ఆయన సరస్వతి పూజ చేసి మొక్కులు తీర్చుకున్నారు. ప్రత్యేకంగా సరస్వతి పూజ చేసి తెలుగు సుభిక్షంగా ఉండాలని ప్రార్థించారు.

పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని చూస్తున్నారు. 2019 ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసినా ఒక్క స్థానంలో కూడా విజయం సాధించకపోవడంతో నిరాశ చెందలేదు. కసితో ఈసారైనా విజయం సాధించి వైసీపీని అధికారానికి దూరం చేయాలని భావిస్తున్నారు. దీని కోసమే జనంలో పట్టు సాధించాలని ప్రణాళికలు రచిస్తున్నారు. పూజలు కూడా చేస్తున్నారు. దీంతో రాబోయే ఎన్నికల్లో జనసేన తప్పకుండా విజయం సాధిస్తుందనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీని కోసం ఎన్ని పూజలైనా చేయడానికే నిర్ణయించుకున్నారు.