Pawan Kalyan- Jagan: ఏపీలో అసలు కౌలు రైతులు ఎంతమంది? భూమిని కౌలుకు తీసుకుని సాగు చేస్తున్న వారి సంఖ్య ఎంత? వారికోసం ఏమైనా ప్రత్యేక పథకాలు రూపొందించారా? వారికి బ్యాంకు రుణాలు, రాయితీలు అందుతున్నాయా? అంటే లేదనే సమాధానం వినిపిస్తోంది. గత ఎన్నికల్లో కౌలు రైతుల సమస్యలు పరిష్కరిస్తానని విపక్ష నేతగా ఉన్న జగన్ ప్రకటించారు. కౌలు రైతు ధ్రువీకరణ పత్రాలు అందించి.. వారికి రాయితీ రుణాలు, సాగు పెట్టుబడి, ఇన్పుట్ సబ్సిడీ వంటివి అందిస్తానని నమ్మబలికారు. దీంతో కౌలు రైతులు ఏకపక్షంగా జగన్ కు మద్దతు తెలిపారు. అయితే జగన్ అధికారంలోకి వచ్చి నాలుగున్నర ఏళ్ళు దాటుతున్నా కౌలు రైతులకు స్వాంతన చేకూర్చలేదు.
గత కొన్నేళ్లుగా కౌలు రైతుల సమస్యలపై జనసేన అధినేత పవన్ పోరాడుతున్నారు. వారికి అండగా నిలుస్తూ వచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా కౌలు భరోసా యాత్ర చేపట్టారు. ఆత్మహత్య చేసుకున్న 3000 మంది కౌలు రైతుల కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున సాయం అందించారు. ఒక విధంగా చెప్పాలంటే జగన్ సర్కార్ను కదిలించగలిగారు. కౌలు రైతుల విషయంలో పవన్ దూకుడును చూసిన జగన్ సర్కార్ ప్రత్యేకంగా దృష్టి సారించాల్సి వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా కౌలు రైతులను గుర్తించే ప్రక్రియ ప్రారంభమైంది. కానీ పూర్తిస్థాయిలో కౌలు రైతులను గుర్తించడంలో జగన్ సర్కార్ ఫెయిల్యూర్ అయింది.
రాష్ట్రవ్యాప్తంగా 50 లక్షల మందికి పైగానే కౌలు రైతులు ఉంటారని తెలుస్తోంది. కానీ జగన్ సర్కార్ మాత్రం కేవలం ఎనిమిది లక్షల మంది వరకు కౌలు రైతులను గుర్తించడం విశేషం. అయితే దీనికి వైసీపీ సర్కార్ చెబుతున్న కారణం.. భూ యజమానులు కౌలు రైతులకు సాగు హక్కు పత్రాలు ఇవ్వడానికి విముఖత చూపడమే. అయితే గత నాలుగున్నర ఏళ్లుగా కౌలు రైతుల విషయంలో వైసీపీ సర్కార్ ప్రచారానికి పరిమితమైన అపవాదు ఉంది. భూ యజమానులకు సాగు హక్కు పత్రాల జారీ విషయంలో ఎటువంటి ఇబ్బంది ఉండదని అవగాహన కల్పించడంలో ప్రభుత్వం విఫలం అయింది. ఆ కారణంగానే తాము కానీ సాగు హక్కు పత్రాలు ఇస్తే.. ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవడం ఖాయమని భూ యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకే కవులు రైతులకు సాగు హక్కు పత్రాల జారీ ప్రక్రియ ఆలస్యం అవుతూ వచ్చింది.
ఇటువంటి పరిస్థితుల్లోనే పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కౌలు రైతుల సమస్యలపై పోరాటం చేయాలని డిసైడ్ అయ్యారు. కౌలు రైతుల ఆత్మహత్యలపై ఫోకస్ పెంచారు. వారి కుటుంబాల్లో భరోసాt నింపే ప్రయత్నం చేశారు. అయితే ఇది రాజకీయంగా తమకు ప్రతికూల అంశం గా మారుతుందని సీఎం జగన్ భావించారు. అందుకే కౌలు రైతు ధ్రువీకరణ పత్రాలు అందించేందుకు సిద్ధపడ్డారు. అందుకే రైతు భరోసా పోర్టల్ ను సైతం రూపొందించారు. కానీ దాదాపు 50 లక్షల వరకు కౌలు రైతులు ఉంటే.. ఎనిమిది లక్షల మంది మాత్రమే ఉన్నట్లు చూపడం మాత్రం లోప భూయిష్టమే. అయితే జగన్ సర్కార్ కౌలు రైతులు విషయంలో ఈమాత్రపు చర్యల కైనా దిగిందంటే అది ముమ్మాటికీ పవన్ పుణ్యమే.