Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ 7 ఐదో వారం ఈ సీజన్ సంబందించి మొట్ట మొదటి కెప్టెన్సీ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్ . టాస్క్ లో భాగంగా కంటెస్టెంట్స్ తమ బెస్ట్ ఫ్రెండ్ ని ఒకరిని సెలెక్ట్ చేసుకుని వారం మొత్తం జంటగా ఆడాల్సి ఉంటుంది . ఏ బడ్డీ జంట గెలుస్తుందో వారు కెప్టెన్సీ కంటెండర్స్ గా నిలుస్తారు , చివరి కెప్టెన్సీ టాస్క్ గెలిచి ఎవరైతే కెప్టెన్ అవుతారో వారు ఇంటి ఫస్ట్ కెప్టెన్ అవ్వడంతో పాటు రెండు వారాల సూపర్ ఇమ్యూనిటీ పొందుతారు అని చెప్పాడు బిగ్ బాస్ .
కంటెస్టెంట్స్ అందరూ చర్చించుకుని శివాజీ -ప్రశాంత్ ,శుభశ్రీ -గౌతమ్ ,అమర్ -సందీప్ ,యావర్ -తేజ ,శోభా -ప్రియాంక బడ్డీ జంటలుగా ఏర్పడ్డారు. బిగ్ బాస్ ఒక స్మైల్ బోర్డు ఇచ్చి అందులో కొన్ని పళ్ళని మిస్ చేసి వాటిని పాకుతూ వెళ్లి యాక్టివిటీ ఏరియా నుంచి తీసుకొచ్చి వాటిని స్మైల్ బోర్డు లో ఫిక్స్ చేసి ముందుగా బెల్ కొట్టాలని చెప్పాడు. అందరికంటే ఫస్ట్ బెల్ కొట్టిన వారికి .మూడు స్టార్స్ ,సెకండ్ ప్లేస్ లో ఉన్నవారికి రెండు స్టార్స్ మూడో స్థానంలో ఉన్నవారికి ఒక్క స్టార్ లభిస్తుంది చెప్పాడు బిగ్ బాస్ .
శోభా ,ప్రిన్స్ ఒక పక్క గేమ్ ఆడుతూ ,సంచాలకులు గా వ్యవహరించాలి అంటూ కండిషన్ పెట్టాడు బిగ్ బాస్ . ఆట పూర్తయింది కానీ, ఇప్పుడే అసలైన ఆట మొదలైంది. కంటెస్టెంట్స్ తమ స్థానాల కోసం గొడవ పడుతూ ఒకరినొకరు తిట్టుకున్నారు . శోభా ఇంకా యావర్ సంచాలకులుగా వారి నిర్ణయం చెప్పలేక బిగ్ బాస్ ని చెప్పమని కోరారు ,కానీ బిగ్ బాస్ వాళ్లనే డిసైడ్ చేయమని అన్నారు . గంటలు తరబడి చర్చించి ఒక డెసిషన్ చెప్పారు. దానికి ఎవరు అంగీకరించకపోవడంతో . మళ్ళీ కాసేపు మాట్లాడుకుని ,తెగ ఆలోచించేసి ఫస్ట్ ప్లేస్ శుభ శ్రీ -గౌతమ్ ,సెకండ్ అమర్ -సందీప్ ,థర్డ్ ప్లేస్ శివాజీ- ప్రశాంత్,నాలుగో స్థానంలో ప్రియాంక -శోభా ,లాస్ట్ లో యావర్ -తేజ ఇంకా ఇదే ఫైనల్ అని చెప్పేశారు
ఈ నిర్ణయం సరైనది కాదు నేను ఒప్పుకోను బిగ్ బాస్ అంటూ ప్రియాంక వాదించింది . ఇది సరైన నిర్ణయం కాదు యావర్ అంటూ ప్రిన్స్ తో గొడవ పెట్టుకున్నాడు శివాజీ .” బైయాస్డ్ నేను కాదు మీరు ”. ఇది బయాస్డ్ డెషిషన్ అని శివాజీ ఫైర్ అయ్యాడు . కంటెస్టెంట్స్ అందరూ సంచాలకులు శోభా, యావర్ ని ఏకిపారేశారు . యావర్ ,శోభా ఏమి చెయ్యలేక కన్నీళ్లు పెట్టుకున్నారు .