Pawan Kalyan: జనసేనాని పవన్ కల్యాణ్ ఏపీలోచనిపోయిన కౌలు రైతు కుటుంబాలను ఆదుకునేందుకు తన సొంత డబ్బులు వెచ్చిస్తున్న వైనంపై ప్రశంసలు కురుస్తున్నాయి. తను సినిమాల్లో సంపాదించిన రూ.5 కోట్లను కౌలు రైతుల కుటుంబాలకు పంచుతున్న పవన్ కళ్యాన్ సేవా నిరతికి చాలా మంది అండగా నిలుస్తున్నారు.
ఇప్పటికే పవన్ కళ్యాణ్ సోదరుడు, సోదరీ మణులు నాగబాబు తదితరులు 35 లక్షల వరకూ కౌలు రైతుల కోసం జనసేనకు విరాళంగా ఇచ్చి మంచి మనసు చాటుకున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ ను ఆయన అమ్మ అంజనాదేవి ఆశ్చర్యపరిచారు.
పవన్ కళ్యాణ్ తండ్రి కొణిదెల వెంకట్రావు గారి జయంతి సందర్భంగా తల్లి అంజనాదేవి కౌలు రైతులను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. కౌలు రైతు భరోసా యాత్రకు ప్రత్యేక నిధికి రూ. లక్షన్నర విరాళం అందజేశారు. పార్టీకి మరో రూ.లక్ష అందజేశారు. హైదరాబాద్ లోని జనసేన కార్యాలయంలో పవన్ కళ్యాణ్ ను స్వయంగా కలిసి అంజనాదేవి వీటిని అందజేశారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఏమోషనల్ అయ్యారు. ఏపీ ప్రభుత్వంలో మా తండ్రి ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించి రిటైర్ అయ్యారని.. పెన్షన్ డబ్బులను ఇంటి పెద్ద దిక్కును కోల్పోయి ఆర్థిక ఇబ్బందులు పడుతున్న కౌలు రైతు కుటుంబాలను ఆదుకోవడానికి మా ‘అమ్మ’ ఇవ్వడం చాలా ఆనందంగా ఉందన్నారు. మా నాన్న జీతంతోనే మేం పెరిగామని.. 2007లో ఆయన చనిపోయారని.. అప్పటి నుంచి అమ్మకు పెన్షన్ వస్తోందని.. ఆ పెన్షన్ డబ్బులను దాచి సహాయ కార్యక్రమాలకు ఇవ్వడం అమ్మకు అలవాటు అని పవన్ తెలిపారు. అందులో భాగంగానే ఈరోజు కౌలు రైతులకు విరాళం ఇచ్చిన అమ్మ పెద్దమనసుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు పవన్ ఉద్వేగానికి గురయ్యారు.
ఇలా చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు పెన్షన్ అనేది ఎంత కీలకమో తెలుస్తుందని.. సీపీఎస్ ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్నే కొనసాగించాలని తాము అందుకే డిమాండ్ చేస్తున్నామని పవన్ అన్నారు. అది మా ఫ్యామిలీకి భావోద్వేగంతో కూడుకున్నదన్నారు. పాత పెన్షన్ కోసం మా వంతు ప్రయత్నం చేస్తామన్నారు. ఉద్యోగులకు అండగా ఉంటామన్నారు.
Recommended Videos