Pawan Kalyan-Junior NTR: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పార్టీల్లో పెను మార్పులు వస్తున్నాయి. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న క్రమంలో అధికారం కోసం తమ వ్యూహాలు ఖరారు చేసుకుంటున్నాయి. ఇందులో భాగంగా సినీ గ్లామర్ ను ఉపయోగించుకోవాలని భావిస్తున్నారు. ఈ మేరకు మెగా-నందమూరి కుటుంబాలు కలిసి ఒకే వేదికపై రానున్నట్లు సమాచారం. కేంద్ర మంత్రి అమిత్ షా తో జూనియర్ ఎన్టీఆర్ భేటీ తరువాత బీజేపీకి ప్రచారం చేస్తారనే వార్తలు వచ్చినా అది నిజం కాకపోవచ్చు. తనలో ప్రాణం ఉన్నంత వరకు టీడీపీని వీడనని ఎన్టీఆర్ చెప్పిన నేపథ్యంలో బీజేపీకి ప్రచారం చేస్తారనే వార్తలో నిజం లేదనే ప్రచారం సాగుతోంది.

రాష్ర్టంలో చోటుచేసుకున్న నేపథ్యంలో బీజేపీతో జనసేన పొత్తు విడిపోయే అవకాశాలు లేవు. మరోవైపు వైసీపీని ఎదుర్కోవాలంటే బీజేపీ, జనసేనతో పాటు టీడీపీ కూడా తోడు కావాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. దీంతో భవిష్యత్ లో ఈ మూడు పార్టీలు కలిసి పని చేస్తాయని పలువురు ఎదురు చూస్తున్నారు. మూడు పార్టీలు కలిస్తే పవన్ కల్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ ఒకే వేదికపై వచ్చే వీలుంటుంది. ప్రచారంలో భాగంగా టీడీపీ కోసం ఎన్టీఆర్ పనిచేస్తారని నేతలు ఆశపడుతున్నారు.
ఇంకా టీడీపీని తెలంగాణలో వ్యాప్తి చేసే ఉద్దేశంతో జూనియర్ ఎన్టీఆర్, పవన్ కల్యాణ్ తో ప్రచారం చేయించాలని బీజేపీ ఆలోచిస్తోంది. ఇందులో భాగంగానే హీరోలు ఎన్టీఆర్, నితిన్ తో అమిత్ షా భేటీ అయింది అందుకేనన్న వాదనలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ లో చక్రం తిప్పాలని చూస్తున్నట్లు చెబుతున్నారు. దీని కోసమే సర్వశక్తులు ఒడ్డాలని ప్రయత్నిస్తోంది. తెలంగాణలో పవన్ కల్యాణ్ చరిష్మాను ఉపయోగించుకుని లబ్ధిపొందాలని బీజేపీ యోచిస్తోంది.
తెలంగాణలో ఉన్న ఓటు బ్యాంకును ఉపయోగించుకోవాలని తాపత్రయ పడుతోంది. టీడీపీతో పొత్తు తో తెలంగాణలో 12 నుంచి 15 నియోజకవర్గాల్లో బలం పెంచుకునే అవకాశం కలుగుతుంది. అమిత్ షా తో జూనియర్ ఎన్టీఆర్ భేటీలో ఈ విషయం ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. ఎన్టీఆర్, పవన్ కల్యాణ్ ఇద్దరు కలిస్తే మరింత ప్రయోజనం కలుగుతుందనే ఉద్దేశంతో వారి సేవలు వినియోగించుకోవాలని చూస్తోంది. వీరితో ప్రచారం చేయించాలని బీజేపీ కల తీరుతుందో లేదో తెలియడం లేదు.

టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఎన్టీఆర్ ప్రచారం చేస్తారా? లేదా? అనే అనుమానాలు వస్తున్నాయి. పొత్తులు ఖరారైతే కచ్చితంగా చేయాల్సి వస్తోంది. కానీ పొత్తుల విషయంలో ఇంకా సందిగ్దత నెలకొంది. పవన్, తారక్ కూటమి ప్రచారం చేస్తే తిరుగే ఉండదనే వాదనలు కూడా వస్తున్నాయి. దీంతో వీరిద్దరు ఒకే వేదిక మీదికి రానున్నట్లు సమాచారం. 2024లో జరిగే ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేయడానికి ఒప్పుకుంటారా? తనకు సినిమాలే ప్రధానమని ఇదివరకే చెప్పడంతో ఆయన రాకపై సందేహాలు వస్తున్నాయి. మొత్తానికి బీజేపీ మాత్రం ఇద్దరు అగ్ర హీరోలతో ప్రచారం చేయించి ఎన్నికల్లో విజయం సాధించాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం.