Green Tax: జగన్ సర్కార్ గ్రీన్ టాక్స్ దోపిడీ చూసి పవన్ షాక్

ఏపీ సర్కార్ గ్రీన్ టాక్స్ పై చెబుతున్న మాట పర్యావరణ పరిరక్షణ. మోటార్ సైకిళ్లు,ఆటో రిక్షాలు మినహా అన్ని వాహనాలపై గ్రీన్ టాక్స్ విధిస్తున్నారు. 2021 నుంచే దీనిని అమలు చేస్తున్నారు. దీనికోసం స్లాబ్ విధానం అమల్లోకి తెచ్చారు. ఒక్కో స్లాబ్ కు రెట్టింపు వసూలు చేస్తున్నారు.

Written By: Dharma, Updated On : August 12, 2023 5:46 pm

Green Tax

Follow us on

Green Tax: ఏపీలో పన్నుల బాదుడు గురించి అందరికీ తెలిసిందే. చార్జీలను ఒకవైపు పెంచుతూనే.. మరోవైపు పన్నులను బాదేస్తున్నారు. చివరికి చెత్తపై కూడా పన్నులు వేసిన ఘనత జగన్ సర్కార్ దే. విపక్షంలో ఉన్నప్పుడు బాదుడే బాదుడు అంటూ జగన్ నినాదం చేశారు. ఇప్పుడు అదే బాదుడును కొనసాగిస్తున్నారు. ప్రజల నుంచి ముక్కు పిండి మరి వసూలు చేస్తున్నారు. ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే పన్నులు అమాంతం కొన్ని వందల రెట్లు అధికంగా ఉన్నాయి. ముఖ్యంగా వాహనాలపై విధించే గ్రీన్ టాక్స్ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఉన్నాయి. తాజాగా వాహన రంగ కార్మికులు జనసేన అధినేత పవన్ ను కలిశారు. గ్రీన్ టాక్స్ పై నివేదించగా జనసేనాని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

ఏపీ సర్కార్ గ్రీన్ టాక్స్ పై చెబుతున్న మాట పర్యావరణ పరిరక్షణ. మోటార్ సైకిళ్లు,ఆటో రిక్షాలు మినహా అన్ని వాహనాలపై గ్రీన్ టాక్స్ విధిస్తున్నారు. 2021 నుంచే దీనిని అమలు చేస్తున్నారు. దీనికోసం స్లాబ్ విధానం అమల్లోకి తెచ్చారు. ఒక్కో స్లాబ్ కు రెట్టింపు వసూలు చేస్తున్నారు.

రిజిస్ట్రేషన్ సమయం నుంచి పది సంవత్సరాలలోపు రవాణా వాహనాలు విషయంలో గ్రీన్ టాక్స్ రూ.4 వేలు. అదే వాహనం వయస్సు 10 నుంచి 12 సంవత్సరాల మధ్య ఉంటే రూ.5 వేలు. 12 సంవత్సరాలకు మించితే రూ.6 వేలు. ఇక పన్ను లు భారమైతే చెప్పనక్కర్లేదు. ఏకంగా 18 శాతం పన్ను విధిస్తోంది.

ప్రస్తుతం విశాఖలో పవన్ వారాహి యాత్ర చేపడుతున్నారు. కొంతమంది వాహన రంగ కార్మికులు పవన్ ను కలిశారు. గ్రీన్ ట్యాక్స్ గురించి వివరించారు. ఓ డ్రైవర్ పవన్ తో మాట్లాడుతూ తమిళనాడులో గ్రీన్ టాక్స్ 200 రూపాయలు ఉండగా, తెలంగాణలో 500 రూపాయలు ఉందని చెప్పుకొచ్చారు. ఏపీలో మాత్రం 6600 ఉందని చెప్పడంతో పవన్ షాక్ కి గురయ్యారు. ఈ విషయం తనకు తెలియదని.. తప్పకుండా ఈ అంశంపై ఫోకస్ చేస్తానని వారికి హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గ్రీన్ టాక్స్ పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఏపీలో ఈ స్థాయిలో గ్రీన్ టాక్స్ వసూలు చేస్తున్నారా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. జగన్ సర్కార్ తీరుపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. పవన్ తన యాత్రలో దీనిపైనే గట్టిగా మాట్లాడే అవకాశాలు కనిపిస్తున్నాయి.