Pawan Kalyan- Pulivendula: 2019 ఎన్నికలలో ఘోరపరాజయం పొందినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ని కొనసాగిస్తూ సామాన్య జనం కోసం పోరాటం చేస్తూ వస్తున్నా సంగతి మన అందరికి తెలిసిందే..2019 తో పోలిస్తే ఇప్పుడు జనసేన గ్రాఫ్ మూడింతలు పెరిగింది..లోకల్ బాడీ ఎన్నికలలో సత్తా చాటడమే కాకుండా,కోస్తాంధ్ర జిల్లా మొత్తం క్షేత్ర స్థాయి లో కమిటీలను వేసి రెండవ స్థాయి నాయకత్వం ని బాగా అభివృద్ధి చేసాడు.

ఇప్పుడు ఎంత పవన్ కళ్యాణ్ దురాభిమాని అయినా జనసేన పార్టీ బాగా పుంజుకుంది అని చెప్పక తప్పదు..ఎందుకంటే అది నిజం కాబట్టి..ఇక ఇటీవల జరిగిన సంఘటనలు జనసేన పార్టీ ని మరియు పవన్ కళ్యాణ్ ని తరుచు వార్తల్లో ఉండేలా చేస్తుంది..కోస్తాంధ్ర లో పఠిష్టంగా తయారైన జనసేన పార్టీ, మొదటి నుండి రాయలసీమ ప్రాంతం లో వీక్ గా ఉంటూ వస్తుంది..ఇక్కడ క్షేత్ర స్థాయిలో జనసేన పార్టీ కి బలమైన క్యాడర్ లేదు..ఇప్పటికి రాయలసీమ రాజకీయాలను చూస్తే టీడీపీ మరియు వైసీపీ మధ్యనే పోరు ఉంటుంది కానీ జనసేన ప్రస్తావన ఈ ప్రాంతం లో కనిపించదు.
అందుకే ఈ ప్రాంతం పై పవన్ కళ్యాణ్ చాలా ప్రత్యేకమైన దృష్టిని సారించారట..బస్సు యాత్ర ప్రారంభించడానికి ముందే రాయలసీమ ప్రాంతం లో జనసేన పార్టీ ని బలోపేతం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడట..నవంబర్ నెలలో ఎట్టిపరిస్థితిలో క్షేత్రస్థాయి నుండి బలమైన క్యాడర్ ని ఏర్పాటు చేసేందుకు సిద్ధం అవుతున్నాడు..ఇందుకు ప్రారంభం గా త్వరలోనే ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి సొంత స్థానమైన పులివెందుల లో కౌలు రైతుల భరోసా యాత్ర ని చేయబోతున్నారట..అందులో భాగంగా పులివెందుల లో ఒక భారీ బహిరంగ సభ ని కూడా ఏర్పాటు చెయ్యబోతున్నట్టు తెలుస్తుంది.

ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా నాదెండ్ల మనోహర్ మరియు నాగబాబు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు..రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు రేపే విధంగా ఈ బహిరంగ సభ ఉండబోతుందట..ఇక్కడి నుండి జనసేన పార్టీ రాయలసీమ రాజకీయాలను ఘనంగా ప్రారంభించాలని చూస్తుంది..దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అతి త్వరలోనే సోషల్ మీడియా లో ఉన్న జనసేన పార్టీ అకౌంట్స్ నుండి తెలియచేయనున్నారు.