
Pawan Kalyan: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న పవన్ కళ్యాణ్, రాజకీయాల్లో త్వరలో వెయ్యబోతున్న అడుగులు మన రాష్ట్ర భవిష్యత్తుని నిర్ణయించే విధంగా ఉండబోతుంది.అలాంటి స్థానం లో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఉన్నాడు.ఆయన వోట్ షేర్ 2019 ఎన్నికలతో పోలిస్తే మూడింతలు పెరిగిందని లేటెస్ట్ గా వచ్చిన సర్వేలు చెప్తున్నాయి.అందుకే పవన్ కళ్యాణ్ తో పొత్తు పెట్టుకోవడానికి తెలుగు దేశం పార్టీ అంతలా పరితపిస్తుంది.
ఇదంతా పక్కన పెడితే పవన్ కళ్యాణ్ పోటీ చెయ్యబొయ్యే స్థానాలు దాదాపుగా ఫిక్స్ అయ్యిపోయినట్టే అని జనసేన సన్నిహిత వర్గాల నుండి అందుతున్న సమాచారం.2019 ఎన్నికలలో గాజువాక మరియు భీమవరం ప్రాంతాలలో పోటీ చేసి ఓటమిని చవిచూసిన పవన్ కళ్యాణ్ ఈసారి వెయ్యబోయే అడుగులు ఆచి తూచి వెయ్యబోతున్నాడు.గతం లో లాగానే ఈసారి కూడా ఆయన రెండు స్థానాల నుండి పోటీ చేయబోతున్నాడట.ఇందుకు సంబందించిన గ్రౌండ్ వర్క్ కూడా ప్రారంభం అయ్యినట్టు సమాచారం.
అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈసారి ఆయన తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడ రూరల్ నుండి పోటీ చెయ్యబోతున్నట్టు సమాచారం.వైసీపీ మాజీ మంత్రి కురసాల కన్నబాబు ప్రస్తుతం ఈ స్థానం లో సిట్టింగ్ MLA గా ఉన్నాడు.2024 ఎన్నికలలో కూడా ఆయన ఇక్కడి నుండే పోటీ చెయ్యబోతున్నాడు.పవన్ కళ్యాణ్ ఒంటరిగా వచ్చిన ఈ స్థానం నుండి ఈసారి అవలీల గా గెలుస్తాడని, ఒకవేళ పొత్తు ద్వారా వస్తే కనీవినీ ఎరుగని రేంజ్ మెజారిటీ తో గెలుస్తాడని రిపోర్ట్స్ అందాయట.ఇక పవన్ కళ్యాణ్ పోటీ చెయ్యబొయ్యే రెండవ స్థానం పిఠాపురం.

ఈ స్థానం నుండి పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు, జనసేన పార్టీ నుండి ఎవరు పోటీ చేసిన గెలిచేస్తారని సర్వే రిపోర్ట్స్ చెప్తున్నాయి.ప్రస్తుతం ఈ స్థానం లో వైసీపీ MLA పెండెం దొరబాబు సిట్టింగ్ MLA గా ఉంటున్నాడు.ఈ రెండు స్థానాల్లో కూడా పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీ తో గెలుస్తాడని అంటున్నారు.మార్చి 14 వ తేదీన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పవన్ కళ్యాణ్ స్వయంగా తాను పోటీ చెయ్యబొయ్యే స్థానాల గురించి అధికారిక ప్రకటన చేస్తాడట.