Pawan Kalyan America Tour: ఈ దసరా నుంచి ఏపీ వ్యాప్తంగా బస్సు యాత్ర మొదలుపెడుతానని ప్రకటించిన పవన్ కళ్యాణ్ నిన్న జనసేన మీటింగ్ తర్వాత అనూహ్యంగా తన యాత్రను వాయిదా వేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల వేళ.. చివరి ఏడాదిలో ఈ బస్సు యాత్ర చేపట్టడానికి రంగం సిద్ధం చేశారు. ఏపీ మొత్తం కవర్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. చివరి 6 నెలలు ప్రజల్లోనే ఉండాలని డిసైడ్ అయ్యారు. ఈసారి ఎలాగైనా ఎన్నికల్లో గెలవాలని.. జగన్ ను ఓడించడమే ధ్యేయంగా పవన్ ముందుకెళుతున్నారు.

పవన్ బస్సు యాత్రతో ఆయన ఒప్పుకున్న మూడు నాలుగు చిత్ర పరిస్థితి అగమ్య గోచరంగా ఇన్నాళ్లు తయారైంది.కానీ ఇప్పుడు బస్సు యాత్ర వాయిదాతో నిర్మాతలు ఊపిరి పీల్చుకున్నారు. పవన్ అంగీకరించిన సినిమాలను వేగంగా పూర్తి చేసేందుకు చూస్తున్నారు.
Also Read:Ram Charan- Jr NTR Enter Politics: రాజకీయాల్లోకి ఎన్టీఆర్, రామ్‌చరణ్.. పోటీ ఎక్కడి నుంచంటే?
బస్సు యాత్రకు విరామం ప్రకటించడంతో ఇప్పుడు పెండింగ్ సినిమాలు త్వరగా పూర్తిచేసే పనిలో పవన్ పడ్డారు. ముందుగా చాలా రోజులుగా పవన్ కోసం పెండింగ్ లో పడ్డ ‘హరిహర వీరమల్లు’ సినిమాను ఇప్పుడు పూర్తి చేసే పనిలో పవన్ పడ్డారు. ఈ భారీ బడ్జెట్ ప్యాన్ ఇండియా మూవీని పూర్తి చేసి నిర్మాతలు, దర్శకుడికి ఊరటనిచ్చేందుకు రెడీ అయ్యారు. తన యాత్రలతో ఈ సినిమా ఆగకూడదని పవన్ డిసైడ్ అయ్యారు.

ఇక తాజా సమాచారం ప్రకారం.. పవన్ కళ్యాణ్ అర్జంట్ గా అమెరికాకు వెళ్లినట్లు సమాచారం. అక్కడ కొంతమంది ప్రముఖులను కలవాల్సి ఉందని.. దానికోసమే ఇంత అర్జంటుగా అమెరికాకు పవన్ వెళ్లినట్లు తెలిసింది. మరో రెండు మూడు రోజుల వరకూ పవన్ అమెరికాలోనే ఉండనున్నట్టు సమాచారం. ఇది రాజకీయ భేటీలా? లేక సినిమాలపై భేటిలా? ఆర్థిక అవసరాలా? అన్నది తెలియాల్సి ఉంది.
Also videos: KCR- ST Reservations: ఆ జీవో వస్తే నోటిఫికేషన్లకు బ్రేక్.. కేసీఆర్ నిర్ణయం నిరుద్యోగులకు శాపం!
ప్రస్తుతం పవన్ చేతిలో హరిహర వీరమల్లు చిత్రం చివరి దశలో ఉంది. ఆ తర్వాత హరీష్ శంకర్ తో ‘భవదీయుడు భగత్ సింగ్’, వినోదయా సీతం రిమేక్ సెట్స్ మీద ఉన్నాయి. సురేందర్ రెడ్డి సినిమా ఒకటి అనుకుంటున్నారు. బస్సు యాత్ర లేకుంటే ఇదీ పూర్తి అవుతుంది.
Recommended videos:

[…] […]