Senior NTR- Pawan Kalyan: ఈ దసరా నుంచి జనసేనాని పవన్ కళ్యాణ్ బస్సు యాత్రతో ప్రజల్లోకి వెళ్లిపోతున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. పవన్ కోసం ప్రత్యేక ఒక బస్ ను తయారు చేస్తుండడం విశేషం. హైదరాబాద్ లో తయారు చేస్తున్న ఈ బస్సు ఎన్టీఆర్ చైతన్య రథాన్ని పోలి ఉంది. ఇప్పటివరకూ బస్ యాత్ర చేసిన వివిధ పార్టీలు నేతలు వాడిన బస్సులకు భిన్నంగా ఈ బస్సును డిజైన్ చేయడం విశేషం.

చైతన్య రథం.. తెలుగునాట ఈ వాహనానికి ప్రత్యేక గుర్తింపు, చరిత్ర ఉంది. ఒక విధంగా చెప్పాలంటే ప్రజా క్షేత్రంలో అడుగుపెట్టిన నాయకులు చైతన్య రథం స్పూర్తిగా వాహనాల రూపొందించుకునే వారంటే అతిశయోక్తి కాదు. నాడు ఎన్టీఆర్ చైతన్యరథంపై ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో గడగడపకూ తిరిగారు. తెలుగువారిలో స్ఫూర్తిని రగిలించారు. అటు తరువాత ఎంతో మంది నాయకులు ప్రజల మధ్యకు వచ్చేటప్పుడు చైతన్యరథం మాదిరిగా ప్రత్యేక వాహనాలు రూపొందించుకున్నారు. అంతలా ట్రెండ్ స్రుష్టించింది చైతన్యరథం.
ఇప్పుడు అచ్చం పవన్ కళ్యాణ్ కూడా ఏపీలో బస్సు యాత్రకు ఎన్టీఆర్ మోడల్ ను అనుసరిస్తున్నారు. ఎన్టీఆర్ వాడిన చైతన్య రథాన్ని పోలిన బస్ ను తయారు చేయిస్తున్నారు. తాజాగా విడుదలైన ఫొటోలు వైరల్ గా మారాయి. పవన్ తయారు చేసే చైతన్య రథానికి రెగ్యులర్ బస్ లు, లారీలకు వాడే పెద్ద టైర్లు దీనికి వాడారు. వర్క్ షాప్ లో స్పెషల్ గా తయారు చేస్తున్న ఈ బస్ ఎక్స్ క్లూజివ్ ఫొటోలు మీడియాకు దొరికాయి. తుది దశ హంగులు అద్దుకుంటున్న ఈ బస్సును ఈ నెల 26 వరకూ పూర్తి స్థాయిలో రెడీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఈ బస్సుపైన పవన్ ప్రసంగించడానికి వీలుగా చుట్టూ రక్షణ రెయిలింగ్ లు.. బస్సులో పవన్ బస చేసేలా.. ఆయన కాలకృత్యాలకు ఏర్పాట్లు. బెడ్. మాట్లాడడానికి సరిపిడా స్థలం.. టీవీ ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇక బస్ కు ప్రత్యేకంగా సౌండ్ సిస్టం కూడా ఏర్పాటు చేశారు. ఎంత దూరంలో ఉన్న వారికి కూడా పవన్ కనిపించేలా బస్ టాప్ లో ఏర్పాట్లు చేస్తున్నారు.

ఎన్టీఆర్ ఎలాగైతే చైతన్య రథంపై యాత్రచేపట్టారో అచ్చం అలాగే చేయాలని.. వచ్చే ఎన్నికల్లో గెలుపునకు బాటలు వేసుకోవాలని పవన్ కళ్యాణ్ డిసైడ్ అయ్యారు. ఈ యాత్ర జరిగినన్నీ నాళ్లు పవన్ నాడు ఎన్టీఆర్ తరహాలోనే ఈ బస్ లోనే ఉంటారు. ఆయన అలవాట్లు, అవసరాలకు తగినట్లుగా ఇందులో అన్ని సదుపాయాలు అందుబాటులో ఉంచుతున్నారు. 18న మంగళగిరిలో యాత్రపై కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. యాత్ర ఎక్కడి నుంచి ప్రారంభించాలి..? రూట్ మ్యాప్ సిద్ధం చేస్తారు. వైసీపీని ఓడించడం.. జనసేనను అధికారంలోకి తేవడమే లక్ష్యంగా పవన్ ఈ యాత్ర చేపట్టబోతున్నారు.
[…] […]