Pawan Kalyan: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఏపీలో అధికార పార్టీ తో పాటు ప్రతిపక్ష పార్తీ నేత పవన్ కల్యాణ్ ను కలవడం చర్చనీయాంశంగా మారింది. ఐఎన్ఎస్ చోళలో అడుగుపెట్టిన వెంటనే ముందుగా పవన్ కల్యాణ్ ను కలుసుకున్నాడు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ పవన్ తో మాట్లాడిన తీరు అందరినీ ఆకర్షించింది. ఆ తరువాత పవన్ మోదీతో మాట్లాడిన విషయాలు మీడియాకు వివరించారు. అయితే మోదీ వెళ్లిన తరువాత పవన్ ప్రస్తుతం హైదరాబాద్ కు వెళ్లారు. ఈ సందర్భంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.

పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన మోదీ తెలంగాణకు వెళ్లారు. ఇక పవన్ మోదీతో మీటింగ్ తరువాత విజయనగరం వెళ్లారు. గుంకలాంలో ఉన్న జగనన్న కాలనీలను పరిశీలించి.. ఇవి జగన్ కాలనీలు కాదు.. పేదలందరికీ కన్నీళ్లు అంటూ పార్టీ తరుపున నిర్వహించిన ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై కూడా విమర్శలు చేశారు. ఇక్కడి కార్యక్రమం ముగిసిన తరువాత హైదరాబాద్ కు వెళ్లారు.
ఈ సందర్భంగా పవన్ ప్రధానిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్లోని అన అధికారిక మైక్రో బ్లాగింగ్ ప్లాట్ ఫాంలో ఓ మెసేజ్ పెట్టారు. ‘ ఈ కఠిన ధరిత్రి మీద మనిషి ఎంత ఎత్తుకు ఎదుగుతాడో.. అంత దీర్ఘంగా అతని నీడ చరిత్రలో పడుతుతుంది’ అని శేషేంద్ర కు చెందిన కవితను ప్రస్తావించారు. అలాగే దేశం చాలా క్లిష్ట సమయంలో ఉన్నప్పుడు ప్రధాని సరైన నిర్ణయాలు తీసుకున్నాడని అన్నారు. దేశ పౌరుల్లో ప్రతి ఒక్కరు తాము భారతీయులమనే భావన కలిగించేలా మోదీ ప్రవర్తించాడని అన్నారు. ఇలా పవన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

జనసేన పార్టీ అధినేత అయిన మోదీ ఏపీ బీజేపీకి సపోర్టుగానే ఉంటున్నారు. కొన్ని కార్యక్రమాలను ఆ పార్టీ నాయకులతో కలిసి నిర్వహిస్తున్నారు. అయితే తాజాగా మోదీ ఏపీలో పర్యటించిన సందర్భంగా స్థానిక బీజేపీ నాయకులకంటే పవన్ కే ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వడంపై సర్వత్రా చర్చ సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో పవన్ కీలకంగా మారే అవకాశం ఉందని చర్చించుకుంటున్నారు. మరి ఈసారి జనసేన అధినేత ఎలాంటి నిర్ణయాలు తీసుకొని ప్రజల్లోకి వెళుతాడో చూడాలి.