మెగాస్టార్ చిరంజీవి.. రాజకీయాల్లోంచి ఎప్పుడో రిటైర్‌మెంట్ తీసుకున్నారు. మరోసారి టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం సినిమాల్లో బిజీ అయిపోయారు. అయితే.. ఆయన సోదరుడు పవన్ కల్యాణ్‌కు సడన్‌గా చిరంజీవి రాజకీయాలను మరొక్కసారిగా నెమరేసుకున్నారు. అంతేకాదు.. మెగాస్టార్ రాజకీయాల్లో ఉంటే ఆయన భవిష్యత్ ఇలా ఉండేది అంటూ చెప్పుకొచ్చారు.
Also Read అసెంబ్లీమే సవాల్.. జగన్ పై తొడగొట్టిన బాబు!
తన అన్న, మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికీ రాజకీయాల్లో ఉండి ఉంటే.. ముఖ్యమంత్రి అయి ఉండేవారని అంటున్నారు పవన్. నివర్ తుఫాను నేపథ్యంలో బాధితులను పరామర్శించేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ చిత్తూరు జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంలో తిరుపతిలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఆశయబలం ఉన్నవాళ్లకు ఓటమి కుంగుబాటును ఇవ్వదని సూక్తులు చెప్పుకొచ్చారు. అధికారం మనకు బాధ్యతే తప్ప అలంకారం కాదన్నారు. అజమాయిషీ చేయడానికే అధికారమనే భావన ఇప్పుడు పలువురిలో ఉందని తెలిపారు. వైసీపీకి ఓటు వేసిన ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని పవన్ కోరారు.
అలాంటి పొరపాట్లకు తావివ్వకుండా చూసుకోవాలని పిలుపునిచ్చారు. సిమెంటు ఫ్యాక్టరీ కోసమో, ఇసుక అమ్ముకోవటానికో, మద్యం అమ్ముకోవటానికో తాను సీఎం కావాలని అనుకోవడం లేదన్నారు. ఏపీ మంత్రుల చరిత్ర తనకు బాగా తెలుసని.. హెచ్చరిక చేశారు. తాను ప్రజల కోసం వచ్చానని, తన పని తనను చేసుకోనివ్వాలని కోరారు. మిగిలిన నాయకులు 25 కేజీలు బియ్యం ఇవ్వాలని చూస్తున్నారని, తాను 25 సంవత్సరాల భవిష్యత్తును ఇవ్వాలని ఆలోచిస్తున్నానని పవన్ చెప్పుకొచ్చారు.
Also Read: జీహెచ్ఎంసీ ఎన్నికలు.. స్వస్తిక్ ఓట్లను మాత్రమే లెక్కించాలని హైకోర్టు ఆదేశం..!
మరోవైపు.. రైతు, రౌలు రైతుల కోసం జై కిసాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ప్రకటించారు. కార్యాచరణను త్వరలో ప్రకటిస్తామన్నారు. అందరి రాజకీయ నేతల్లా తనకు సిమెంట్ ఫ్యాక్టరీలు, మీడియా సంస్థలు లేవని చెప్పుకొచ్చారు. అందుకే సినిమాల్లో నటిస్తున్నట్టు పవన్ స్పష్టం చేశారు. ఏది ఏమైనా ఎప్పుడో జరిగే ఎన్నికల కోసం పవన్ ఇప్పటి నుంచే సంసిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు.. జమిలి ఎన్నికల అంశం తెరపైకి రావడంతో.. తన దూకుడును పెంచాలని కూడా చూస్తున్నారు.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్