Pawan Kalyan- Chandrababu: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు జోరుగా సాగుతున్న చర్చ జనసేన మరియు తెలుగు దేశం పార్టీలు కలుస్తున్నాయా లేదా..ఒకవేళ కలిస్తే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి..ఎన్ని సీట్స్ వస్తాయి..ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు?, ఇత్యాది ప్రశ్నలు మరియు సందేహాలు అందరిలో ఉన్నాయి..రాజకీయ విశ్లేషకులు మాత్రం వీళ్లిద్దరు కలవబోతున్నారనే చెప్తున్నారు..ఒకవేళ ఈ రెండు పార్టీలు కలిస్తే కోస్తాంధ్ర లో వైసీపీ పార్టీ మట్టికరుస్తుందని..ఉభయగోదావరి జిల్లాలలో వైసీపీ కి ఒక్క స్థానం కూడా వచ్చే అవకాశం లేదని చెప్తున్నారు.

ఇక ఇటీవల కాలం లో పవన్ కళ్యాణ్ మరియు చంద్ర బాబు నాయుడు రెండు సార్లు కలుసుకోవడం తో తెలుగు దేశం పార్టీ – జనసేన కూటమి ఖరారు అంటూ ప్రచారం సాగింది..అయితే వీటిపై పవన్ కళ్యాణ్ నేడు శ్రీకాకుళం జిల్లాలోని రణస్థలం లో ఏర్పాటు చేసిన ‘యువ శక్తి’ అనే ప్రోగ్రాం లో అభిమానులకు ఒక క్లారిటీ అయితే ఇచ్చేసాడు.
ఆయన మాట్లాడుతూ ‘మొన్న నేను తెలుగు దేశం పార్టీ నాయకులు..మాజీ ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు గారిని కలిస్తే సన్నాసులు ఏవేవో రాసేశారు..బేరం కుదిరింది అని, ప్యాకేజి అని ఇలా ఎన్నో మాట్లాడడం నేను గమనించాను..అరేయ్ సన్నాసుల్లారా నాకు ఆ అవసరం లేదు రా..నేను అలాంటి వ్యక్తిని కాదు..ఏడాది కి పాతిక కోట్ల రూపాయిలు టాక్స్ కట్టుకునే సత్తా ఉన్నవాడిని నేను..మొన్న మాకు ఉత్తరాంధ్ర లో జరిగిన సంఘటనకి సంఘీభావం గా విజయవాడ కి వచ్చి నన్ను కలిశారు.

ఇప్పుడు ఆయనకీ అలాంటి సంఘటనే ఎదురైతే నా తరుపున సంఘీభావం వ్యక్తం చెయ్యడానికి వెళ్ళాను..అది నా సంస్కారం..ఇక పొత్తు గురించి అంటారా..మనకి అనుకూలంగా అన్ని కలిసి వస్తే వెళ్తాము..లేదా ఒంటరిగానే పోటీ చేస్తాము..ఏది జరిగిన మనం డిమాండ్ చెయ్యాల్సి వాటిల్లో తగ్గేదే లేదు..అభిమానుల గౌరవాన్ని తగ్గించే సమస్యే లేదు’ అంటూ పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చాడు.