
ఎన్నాకెన్నాళ్లకు.. పవన్ కళ్యాణ్ వేచేస్తున్నారు. ఏపీ గడ్డపై అడుగుపెట్టబోతున్నాడు. జనసేన కార్యకర్తల కళ్లు కాయలు కాసి పండ్లు అయిపోయాయి.. అయినా పవన్ రాడేమీ అని ఎదురుచూసిన వారి కల నెరవేరింది. ఎట్టకేలకు మన జనసేనాని హైదరాబాద్ వీడి ఏపీకి వస్తున్నారు. కరోనా లాక్ డౌన్ తో ఏపీలో అడుగుపెట్టని పవన్ ఎట్టకేలకు వస్తుండడంతో జనసైనికుల్లో ‘బర్రె ఈనినంత’ పండుగ వచ్చేసిందట..
Also Read: రాజాధిరాజా: జగన్ ఆస్థానంలో రాజగురువు!?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ మొత్తానికి ఏపీలో అడుగుపెడుతున్నాడు. గత కొంత కాలంగా కరోనా, ఇతర కారణాలో హైదరాబాద్ లోనే ఉంటున్న పవన్ ట్విట్టర్ ద్వారానే అందుబాటులో ఉంటున్నారు. రాజకీయాల నుంచి మళ్లీ సినిమాల బాట పట్టిన పవన్ షూటింగ్ లతో బీజీ అయిపోయారు. దీంతో ఆంధ్రప్రదేశ్ వైపు చూడలేదు. అమరావతి రైతుల ఆందోళన, అంతర్వేది ఘటనల్లో ఆ పార్టీ తరుపున నాయకులు పాల్గొంటున్న పవన్ మాత్రం ప్రత్యక్షంగా పాల్గొనలేదు. దీంతో జనసేన నాయకులు తమ అధినేత లేక పట్టు కోల్పోతున్నారు.
కరోనా కారణంగా జనసేన అధినేత హైదరాబాద్ కే పరిమితమయ్యారు. దీంతో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలను పట్టించుకోవడం లేదని ఇతర పార్టీలు విమర్శిస్తున్నాయి.. దీంతో అప్పుడప్పుడు ట్విట్టర్ ద్వారా పవన్ స్పందించారు. అయితే ప్రతిపక్ష నాయకుడు ప్రజల్లో ఉంటేనే ఆదరణ లభిస్తుందని, ట్విట్టర్ ద్వారా ప్రజలకు చేరువ కాలేరని ఇతర పార్టీల నాయకులు విమర్శించారు.
రాజధాని తరలింపుపై అమరావతిలో గత సంవత్సరకాలంలో రైతులు ఆందోళన చేస్తున్నారు. వీరికి టీడీపీ మద్దతు ఇస్తోంది. ఇటీవల బీజేపీ నాయకులు, పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు సైతం ఆందోళనలో పాలు పంచుకున్నారు. పవన్ ట్విట్టర్ ద్వారానే ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని, ప్రతక్షంగా ఆందోళనలో పాల్గొంటే బాగుండునని ఆ పార్టీ నాయకులు మథనపడ్డారు.
Also Read: చీఫ్ జస్టిస్ కు జగన్ లేఖపై విచారణ.. నేడు ఏం జరుగనుంది?
ఈ విమర్శల నేపథ్యంలో పవన్ కల్యాణ్ ఈనెల 17న ఏపీలో అడుగుపెడుతున్నట్లు ఆ పార్టీ నాయకలు ప్రకటించారు. 17న ఇచ్చాపురం, రాజోలు, మంగళగిరి, నెల్లూరు రూరల్ నియోజకవర్గాల పార్టీ నాయకులతో సమావేశం కానున్నారు. అదేరోజు మధ్యాహ్నం ఉభయ గోదావరి జిల్లాలు, గుంటూరు జిల్లాల నాయకులతో భేటీ కానున్నట్లు జనసేన తెలిపింది.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్
ఇక 18న అమరావతి పోరాట సమితి నేతలతో, మహిళా రైతలుతో సమావేశమవుతారని తెలిపారు. మరి పవన్ పర్యటనతో జనసేనలో ఎలాంటి మార్పులు జరుగుతాయో చూడాలి.