పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు రెచ్చిపోయారు. ఇప్పటికే పవన్ ను ప్రెస్ మీట్ పెట్టి తీవ్ర విమర్శలు చేసిన పోసాని.. ఈరోజు తాజాగా సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు వచ్చి మరోసారి ప్రెస్ మీట్ పెట్టి దుమ్మెత్తిపోశాడు. పోసాని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు వచ్చాడన్న సమాచారం తెలుసుకున్న పవన్ అభిమానులు అక్కడికి భారీగా చేసుకున్నారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
పోసాని విలేకరుల సమావేశం ముగించుకొని బయటకు రాగా.. పోసానిపై దాడికి పవన్ అభిమానులు ప్రయత్నించారు. దీంతో పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు. పోసానికి వ్యతిరేకంగా పవన్ అభిమానులు నినాదాలు చేస్తూ హోరెత్తించారు. కొందరైతే విలేకరులను దాటుకొని పోసానిపై దాడి చేయడానికి దగ్గరగా రాగా జర్నలిస్టులు, పోలీసులు కలిసి అడ్డుకున్నారు.
ఈ క్రమంలోనే పవన్ ఫ్యాన్స్ ను అరెస్ట్ చేసిన పోలీసులు వారిని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు తరలించారు. పోసానిని సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లిన పోలీసులు అనంతరం పోలీస్ వాహనంలో ఆయనను ఇంటికి సేఫ్ గా తరలించారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన పోసాని సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ అభిమానుల నుంచి తనకు ప్రాణహాని ఉందని.. నేను చనిపోతే అందుకు పవన్ కళ్యాణ్ యే కారణం అన్నారు. పవన్ ఫ్యాన్స్ సైకోలో ఉన్నారని.. తనను చంపడానికి చూస్తున్నారని.. ఈ క్రమంలోనే పవన్ పై రేపు పోలీసులకు ఫిర్యాదు చేయబోతున్నానని పోసాని తెలిపారు. కేసు పెడుతానని స్పష్టం చేశారు.
-పోసానిపై పవన్ ఫ్యాన్స్ దాడికి యత్నించిన వీడియో ఇదే..