Pawan Kalyan Konaseema: నాయకుడంటే ముందుండి నడిపించాలి. తన సేనలను కాపాడుకోవాలి. ఆపదలో ఉంటే ఆదుకోవాలి. వారి కోసం యుద్ధ రంగంలోకి దిగాలి. స్ఫూర్తిని నింపాలి. ఇప్పుడు కోనసీమ అల్లర్లలో అమాయకులైన జనసైనికులను అరెస్ట్ చేయడాన్ని.. అక్రమ కేసులు బనాయించడాన్ని జనసేనాని పవన్ కళ్యాణ్ ఖండించారు. అసలు సంబంధం లేదని తన పార్టీ కార్యకర్తలపై ఈకేసులు మోపడాన్ని సహించలేకపోతున్నారు. అందుకే కోనసీమ అక్రమ కేసులోపై పోరుబాటకు శ్రీకారం చుట్టారు. వైసీపీ ప్రభుత్వంతో తేల్చుకోవడానికే రెడీ అయ్యారు.
జనసేన నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించడం.. వేధింపులకు గురిచేస్తున్న తీరుపై పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని బృందం ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డితో చర్చించాలని డిసైడ్ అయ్యింది. ఇందుకోసం డీజీపీ అపాయింట్ మెంట్ కోరారు. ఈ మేరకు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ స్వయంగా డీజీపీకి లేఖ రాశారు. రాష్ట్రంలోని శాంతిభద్రతల పరిస్థితులపై తెలియజేస్తానని లేఖలో పేర్కొన్నారు. తేదీ, సమయం ఇవ్వాలని డీజీపీని కోరారు.
Also Read: Hardik Pandya: టీమిండియాకు మరో కపిల్ దేవ్ దొరికినట్టేనా?
కోనసీమ వివాదంతో ఇప్పుడు అక్కడ నివురుగప్పిన నిప్పులా మారింది. స్వయంగా ఏపీ మంత్రి, ఎమ్మెల్యేల ఇళ్లు తగులబడ్డాయి. ఈ దాడుల వెనుక అధికార వైసీపీ ఉందని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. కానీ ఈ దాడులకు జనసైనికులే కారణం ఏపీ హోంమంత్రి స్వయంగా ఘటన జరిగిన రెండు గంటలకే ఆరోపించారు. దీంతో ఈ వివాదం రాజకీయ రంగు పులుముకుంది.
తాజాగా కోనసీమ అల్లర్లకు కారకులని జనసైనికులను పెద్ద ఎత్తున అరెస్ట్ చేసి కేసులు బనాయించారు. ఈ అన్యాయంపై తొలుత సామరస్యంగా ఏపీడీజీపీని కలిసి విన్నవించాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. దీనికి స్పందన రాకుండా జనంలోకి వెళ్లి పోరుబాటతోనే తేల్చుకోవడానికి రెడీ అయ్యారు. మరి పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగితే పరిస్థితి ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. దాన్ని ఆపడం చాలా కష్టం. వైసీపీ ప్రభుత్వం దీనిపై ఎలాంటి యాక్షన్ తీసుకుంటుదన్నది వేచిచూడాలి.
Also Read: Anushka Shetty: నా వల్ల కాదు అంటూ హీరో నవీన్ పోలిశెట్టి కి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన అనుష్క