Pawan Kalyan: ఓపిక ఉన్నన్నీ నాళ్లు సహిస్తాం.. భరిస్తాం.. కానీ బరెస్ట్ అయితే మాత్రం ఇక వదిలేది లేదని పవన్ కళ్యాణ్ డిసైడ్ అయ్యాడు. అందుకే తాజాగా రూటు మార్చారు. ప్రతిసారి ఎంతో గౌరవంగా పలికే ఆయన సంభాషణల పరంపరను వైసీపీ నేతలే చెడగొడుతున్నారు. ఇన్నాళ్లు ‘శ్రీ జగన్ రెడ్డి’ గారు అంటూ జనసేన నుంచి ప్రకటనలు వచ్చేవి. ఇప్పుడు ఆ రాచమర్యాదలన్నింటిని పవన్ కళ్యాణ్ పక్కనపడేశారు. తన ప్రకటనల్లో ‘సీబీఐ దత్తపుత్రుడు’ అంటూ జగన్ కు కొత్త పేరు పెట్టేశారు. అదే ఇప్పుడు వైరల్ అయ్యింది. ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.
పవన్ కళ్యాణ్ ను వ్యక్తిగతంగా విమర్శిస్తూ ఆయనపై దాడి చేస్తున్నారు వైసీపీ నేతలు. ఏపీలో పాత బూతు మంత్రులు అయిన కొడాలి నాని, అనిల్ కుమార్ సహా అందరూ పోయి కొత్త మంత్రులు వచ్చారు. వీళ్లు కూడా పవన్ వ్యక్తిగత జీవితంపైనే పడుతున్నారు. అసలు పని వదిలేసి జగన్ మెప్పు కోసం పవన్ ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. ముఖ్యంగా మంత్రులు అంబటి రాంబాబు, గుడివాడ అమర్ నాథ్ లు పవన్ పై వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు.
Also Read: Teenmar Mallanna: బీజేపీకి తీన్మార్ మల్లన్న రాం రాం..! షాకింగ్ కారణం ఇదేనా..?
ఈ క్రమంలోనే జనసేన కూడా స్టాండ్ మార్చేసింది. అంతే వ్యక్తిగతంగా.. మంత్రులను బట్టలిప్పి నడిబజారులో నిలిపేలా కౌంటర్లు ఇవ్వాలని డిసైడ్ అయ్యింది. గుడివాడ, అంబటి పాత సంగతులన్నీ బయటకు తీసి మరీ జనసైనికులు కౌంటర్లు ఇస్తున్నారు. ఇక పవన్ సైతం ‘సీబీఐ దత్తపుత్రుడు ’ టాపిక్ లో జగన్ పై విరుచుకుపడ్డ తీరు చూశాక ఆయన కూడా ట్రాక్ చేంజ్ చేశాడని అర్థమవుతోంది. ‘చంచల్ గూడ’ షటిల్ టీం అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు కూడా ఇక వైసీపీతో తగ్గేదేలే అన్నట్టుగా ఉంది.
విధానపరమైన, రాజకీయ పరమైన అంశాల్లోనే కాదు.. వ్యక్తిగత విషయాలు లేవనెత్తి వైసీపీని టార్గెట్ చేయాలని జనసేన డిసైడ్ అయ్యింది. ఇన్నాళ్లు ఈ విమర్శలను సహిస్తూ వచ్చిన జనసేనాని పవన్ ఇక గేర్ మార్చడానికి రెడీ అయిపోయారు. వైసీపీకి దీటుగా మీదపడిపోయేలా దూకుడు మంత్రాన్ని జంపించాలని ప్లాన్ చేసినట్లు తెలిసింది.
జనసేనానిపై వ్యక్తిగత దాడి చేస్తూ ఆయనను మానసికంగా హింసించాలని.. ఆయన స్థైర్యాన్ని దెబ్బతీయాలనే వ్యూహాన్ని మొదటినుంచి వైసీపీ నేతలు పాటిస్తున్నారు. ఈ విషయంలో పవన్ ను టార్గెట్ చేస్తున్నారు. పవన్ కుటుంబాన్ని తెరపైకి తెస్తున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ మంత్రులు, నేతలపై కూడా వ్యక్తిగతంగానే దాడి చేయాలని జనసేన డిసైడ్ అయ్యింది.
ఈ క్రమంలోనే జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ జారీ చేసే ప్రకటనల్లో నేరుగా సీఎం జగన్ ను ఉద్దేశించి ‘సీబీఐ దత్తపుత్రుడు’ అంటూ పేర్కొనడం హాట్ టాపిక్ గా మారింది. ఈ తీరు చూస్తుంటే ఇక వైసీపీతో కొట్లాటకే పవన్ రెడీ అయినట్లు కనిపిస్తోంది.
Also Read:AP Employees: సీపీఎస్ ఉద్యోగుల దగ్గర కుప్పిగంతులు కష్టమే?
మంత్రులు తమ శాఖలపై పట్టు తెచ్చుకోవడం మాని శ్రీ పవన్ కళ్యాణ్ గారిపై విమర్శలు చేసి సీబీఐ దత్తపుత్రుడి దగ్గర మార్కులు కొట్టే పనిలో ఉన్నారని విమర్శించారు.
— JanaSena Party (@JanaSenaParty) April 29, 2022