https://oktelugu.com/

Pawan Kalyan Somu Veeraju: కలిసి సాగితే బీజేపీ-జనసేనకు కలదు విజయం

Pawan Kalyan Somu Veeraju:  పవన్ కళ్యాణ్ చిరకాల వాంఛ తీరే సమయం వచ్చింది. తోడుగా బీజేపీ కలిసి వస్తోంది. ఇక సీఎం కుర్చీపై పవన్ కూర్చోవడమే ఆలస్యం అన్నట్టుగా ఏపీ రాజకీయాల్లో పరిణామాలు వేగంగా సాగుతున్నాయి. అధికార వైసీపీపై పెరుగుతున్న వ్యతిరేకత.. అందిపుచ్చుకోలేని టీడీపీ ఆసహాయత.. మధ్యలో బలం పుంజుకుంటున్న జనసేన-బీజేపీ ల నడుమ ఏపీ రాజకీయాల్లో పొత్తు పొడుపులే కీలకంగా మారాయి.  బీజేపీ-జనసేన కలిసి సాగబోతున్నాయి. టీడీపీ కలిసి వస్తే మరింత బలం పుంజుకోవడం […]

Written By:
  • NARESH
  • , Updated On : March 22, 2022 3:37 pm
    Follow us on

    Pawan Kalyan Somu Veeraju:  పవన్ కళ్యాణ్ చిరకాల వాంఛ తీరే సమయం వచ్చింది. తోడుగా బీజేపీ కలిసి వస్తోంది. ఇక సీఎం కుర్చీపై పవన్ కూర్చోవడమే ఆలస్యం అన్నట్టుగా ఏపీ రాజకీయాల్లో పరిణామాలు వేగంగా సాగుతున్నాయి. అధికార వైసీపీపై పెరుగుతున్న వ్యతిరేకత.. అందిపుచ్చుకోలేని టీడీపీ ఆసహాయత.. మధ్యలో బలం పుంజుకుంటున్న జనసేన-బీజేపీ ల నడుమ ఏపీ రాజకీయాల్లో పొత్తు పొడుపులే కీలకంగా మారాయి.  బీజేపీ-జనసేన కలిసి సాగబోతున్నాయి. టీడీపీ కలిసి వస్తే మరింత బలం పుంజుకోవడం ఖాయం. మరి చంద్రబాబు ఏం చేస్తారన్న దానిపై స్పెషల్ ఫోకస్..

    Pawan Kalyan Somu Veeraju

    Pawan Kalyan, Chandra Babu, Somu Veeraju

    ఎన్నికలకు ఇంకా రెండేళ్ల ముందే ఏపీ రాజకీయాలు రంజుగా మారాయి.. రసకందాయంలో పడ్డాయి. జనసేన 9వ ఆవిర్భావ సభా వేదికగా పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటన ఏపీ రాజకీయాలను తీవ్రంగా ప్రభావం చేసింది. వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వనని.. అవసరమైతే ఎవరితోనైనా కలుస్తానని పవన్ చేసిన ప్రకటన టీడీపీకి ఊపిరిపోసింది.

    Also Read: Ramarao on Duty: ఫస్ట్ కాపీతో రెడీగా ఉన్న ‘రామారావు’

    దీన్ని బట్టి టీడీపీ అధినేత చంద్రబాబు  జనసేన+బీజేపీతో పొత్తు పెట్టుకొని ఏపీలో పోటీచేసి వైసీపీని ఓడించి రాజ్యాధికారం దక్కించుకోగలుగుతారు. చంద్రబాబు నిర్ణయంపైనే ఈ పొత్తు ఆధారపడి ఉంది. ఏపీలో బీజేపీ, జనసేనతో పోలిస్తే టీడీపీ పెద్ద పార్టీ. టీడీపీ పొత్తుపై డిఫెన్స్ లో పడింది. వైసీపీని ఓడించాలంటే టీడీపీకి కలిసి వస్తేనే సాధ్యం. టీడీపీ వస్తే ఈ కూటమికి విజయావకాశాలుంటాయి.  మరి చంద్రబాబు ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడన్నది ఉత్కంఠగా మారింది. టీడీపీకి వచ్చే ఎన్నికల్లో గెలిస్తేనే మనుగడ.. కానీ అధికారం మాత్రం పొత్తులతోనే సాధ్యం. ఇలాంటి సంకట స్థితిలోకి టీడీపీ ఉంది.

    టీడీపీతో బీజేపీ+జనసేన పొత్తు ఉంటుందని జోరుగా ప్రచారం సాగుతున్న సమయంలో చంద్రబాబు నిర్ణయంపై ఈ పొత్తు పొడుస్తుందా? లేదా? అన్నది ఆధారపడి ఉంది.. కానీ టీడీపీకి మాత్రం రాజకీయంగా ఇబ్బందికరంగా మారింది. మూడు పార్టీలు పోటీచేస్తే ఖచ్చితంగా గెలుపు ఖాయం. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా ఆ పార్టీ ఓడిపోతుంది. ఇప్పుడు టీడీపీ ఈ కూటమిలో చేరుతుందా? లేదా? అన్నది సందేహంగా మారింది. జగన్ కు అధికారం అప్పగించడమా? కూటమికి సపోర్టు చేయడమా? అన్నది ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు చేతిలో ఉంది. మరి ఆయన ఏం చేస్తారన్నది భవిష్యత్తులో తేలనుంది.

    Also Read: Somu Veerraju: పవన్ కళ్యాణ్ యే సీఎం.. టీడీపీని డిఫెన్స్ లో పడేసిన సోము వీర్రాజు

    Recommended Video:

    పవన్ సీఎం అభ్యర్థి...టీడీపీకి షాక్  | BJP Want to Make Pawan Kalyan as AP CM | Janasena BJP Alliance