Pawan Kalyan Chandrababu Alliance- YCP: ఏపీలో ఇంకా పొత్తుల ప్రకటనే రాలేదు. ఏదో అధికార పార్టీ నుంచి ఇబ్బందులు ఎదురయ్యాయని పవన్ పరామర్శకు చంద్రబాబు వస్తే వైసీపీ నేతలు గింజుకుంటుండడం ఇప్పడు వారి పార్టీలోనే ఒకరకమైన అభద్రతా భావం ప్రారంభమైంది. పవన్ ను చంద్రబాబు కలిస్తే మనకు వచ్చేది ఏంటి? మన నాయకులెందుకు ఇంతలా హడావుడి చేస్తున్నారంటూ వైసీపీ శ్రేణులకు బోధపడడం లేదు. పాపం వారికి గ్రౌండ్ రియాలిటీ తెలియడం లేదు. సంక్షేమ పథకాలు అందిస్తున్నాం,. మనకు తిరుగులేదన్నట్టు ఉన్నారు. వారి విషయాన్ని పక్కనపెడితే అధికార పార్టీ నాయకుల్లో కలవరం ఎందుకో అంతుపట్టడం లేదు. ‘పవన్ కు దమ్ములేదు. అందుకే పొత్తు పెట్టుకున్నారని ఒకరంటారు. మీరు ముందుగా 175 నియోజకవర్గాల్లో క్యాండెట్లను పెడితే ప్యాకేజీ స్టార్ అనడం మానేస్తామని మరొకరంటారు. ఎవరితోనైనా పొత్తు పెట్టుకున్న పర్వాలేదు..కానీ టీడీపీ పొత్తు పెట్టుకోవడం తప్పని విశ్లేషిస్తున్నారు. రాజకీయ పార్టీ అన్నాక పొత్తులు సహజం. బయటకు భావసారుప్యత, సిద్ధాంతాల సారుప్యత అని చెబుతారు కానీ.. ఏ పార్టీ ప్రయోజనాలకు అనుగుణంగా ఆ పార్టీ ముందుకెళుతోంది. అయితే ఎవరెవరు ఎవరితో వెళితే మనకెందుకు? అని మాత్రం వైసీపీ శ్రేణులు ఢిపెన్స్ లో పడుతున్నాయి.

వైసీపీ ఓటమికి, గెలుపునకు మధ్య ఉన్నది జనసేనయే. అందుకే ఆ పార్టీ నేతలు కలవరపాటుకు గురవుతున్నారు. 2014 ఎన్నికల్లో పవన్ టీడీపీకి సపోర్టు చేశారు. తెలుగుదేశం పార్టీ గెలిచింది. 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేశారు. దీంతో టీడీపీకి డ్యామేజ్ అయ్యింది. వైసీపీ సునాయాసంగా అధికారంలోకి రాగలిగింది. అయితే భారీగా ఓట్లు చీల్చిన జనసేన టీడీపీ ఓటమికి కారణమైంది. ఉభయగోదావరి, ఉత్తరాంధ్రతో పాటు కొన్ని కీలక నియోజకవర్గాల్లో అత్యధికంగా ఓట్లు సొంతం చేసుకుంది. అదే సమయంలో పవన్ పై అభిమానమున్న వారు సైతం జనసేన గెలవదు కాబట్టి.. వైసీపీకి ఒక చాన్సిద్దామని చూసి ఓటు వేశారు. ఇదే విషయాన్ని పవన్ కూడా చాలా సందర్భాల్లో గట్టిగానే చెబుతున్నారు. నా వెంట వస్తున్నారు. వైసీపీకి ఓటు వేస్తున్నారు అని షటైర్లు వేసిన సందర్భాలున్నాయి. అందుకే ఈసారి ఆ పరిస్థితి ఉండదు. మరోవైపు వైసీపీతో యుద్ధ వాతావరణం నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో పవన్ చంద్రబాబుకు దగ్గరయ్యే సూచనలు కనిపిస్తుండడంతో అల్టిమేట్ గా వైసీపీ నేతల్లో కంగారు ప్రారంభమైంది.

సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీలు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోవాలని భావిస్తాయి. అందుకు అనుగుణంగా వ్యూహాలు రూపొందిస్తాయి. అవసరమైతే చిన్న చితకా పార్టీలతో లోపయికారీ సంబంధాలు పెట్టుకుంటాయి. ఏపీలో కూడా అధికార వైసీపీ ఇదే వ్యూహం అమలుచేయాలని ఉన్నా.. పవన్ విషయంలో పప్పులుడికే పరిస్థితులు లేవు. ఆయన రాష్ట్ర ప్రయోజనాలకు పెద్దపీట వేసే నిర్ణయాలు తీసుకుంటారు. ఎట్టి పరిస్థితుల్లో వైసీపీని అధికారంలో రానివ్వనని కూడా శపథం చేశారు. అలాగని పలానా పార్టీతో కలిసి వెళతానిని స్ట్రయిట్ గా చెప్పలేదు. కానీ తమకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటారని మాత్రం వైసీపీ నేతలు భావిస్తున్నారు. అందుకే ఎదురుదాడికి దిగుతున్నారు తప్పించి.. ఇప్పటికిప్పుడు వారు చేసిందేమీ లేదు.