KTR New Look: సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్.. నిత్యం ట్విట్టర్ వేదికగా పోస్టులు పెడుతూనే ఉంటారు. తాజాగా మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో బీజేపీ, ప్రధాని నరేంద్రమోదీ వైఫల్యాలను ఎండగడుతున్నారు. తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. తాజాగా ఆయన తన ఓ ఫొటోనే ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. ఈ ఫొటో చూసిన ఆయన ఫాలోవర్స్ షాక్ అయ్యారు. నిమిషాల వ్యవధిలో ఆ ఫొటో ట్విట్టర్‌తోపాటు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ, వాట్సాప్ గ్రూపుల్లో షేర్ అవుతోంది.

ఆసక్తికర కామెంట్..
ఎప్పుడు నవ్వు ముఖంతో.. నీట్‌షేవ్, స్మైలీ షేస్‌తో కనిపించే కేటీఆర్ తాజాగా ట్వీట్ చేసిన ఫొటోలో.. కళ్లజోడుతో కనిపించారు. దీనిని చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. ఈ ఫొటోపై కేసీఆర్ ఆసక్తికర కామెంట్ కూడా చేశారు. ‘‘ ఇన్నాళ్లూ కళ్లద్దాలు పెట్టుకోవడానికి నామోషీగా ఫీల్ ఆయ్యేవాడిని.. కానీ, ఇక ఆ తిప్పలు తప్పేలా లేవు. కళ్ల అద్దాలు పెట్టుకోకుండా నేను చదువలేకపోతున్నా.. అఫీషియల్లీ ఓల్డ్ ’’ అంటూ స్మైలీ ఈమోజీ జతచేశారు కేటీఆర్.
రామన్న సూపర్ అంటున్న ఫ్యాన్స్..
కేసీఆర్ తాజా ఫొటోపై ఆయన ట్విట్టర్ ఫాలోవర్స్ పాజిటిమ్ కామెంట్స్ చేస్తున్నారు. గతంలో స్టైలిష్ గాగుల్స్‌లో డిఫరెంట్ లుక్స్‌తో కనిపించే కేటీఆర్.. తాజా కళ్ల అద్దాలు కూడా సూపర్‌గా ఉన్నారని పేర్కొంటున్నారు. కొంతమంది.. రామన్న ఎలా ఉన్నా బాగుంటారు అని ట్వీట్ చేస్తున్నారు.. మరికొందరు.. ఐ కాంటాక్ట్ లెన్స్ పెట్టుకోవాలని సూచిస్తున్నారు.

డిఫరెంట్ పోస్టులు చాలా తక్కువ..
ట్విట్టర్‌లో నిత్యం యాక్టివ్‌గా ఉండే కేటీఆర్ తన పర్సనల్ విషయాలను చాలా తక్కువగా షేర్ చేస్తుంటారు. పొలిటికల్, సోషల్ హెల్ప్, డెవలప్‌మెంట్స్, తెలంగాణ గ్రోత్‌తోపాటు ఇటీవల బీజేపీపై విమర్శలు, ప్రధాని మోదీ వైఫల్యాలను ట్వీట్ చేస్తున్నారు. పర్సనల్ ట్వీట్ మాత్రం చాలా తక్కువగా ఉంటాయి. ఇటీవల కాలు ఫ్యాక్చర్ అయినప్పుడు ఓటీటీలో ఏ సినిమాలు చూడాలో సూచించాలని కోరారు. తాజాగా కళ్ల అద్దాలు పెట్టుకున్న ఫొటో షేర్ చేసి ‘అఫీషియల్లీ ఓల్డ్’ అంటూ కామెంట్ చేశారు.