Pawan Lokesh Yatra : త్వరలో రెండు యాత్రలు ఆంధ్రాలో జరగబోతున్నాయి. ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసినా అవి నిలబడవని తేలిపోయింది. పవన్ బస్సు యాత్ర.. నారా లోకేష్ పాదయాత్ర.. ఈ యాత్రలు ఎన్నికల ముందర సర్వసాధారణం. 1983లో ఎన్టీఆర్ చేసిన చైతన్యరథ యాత్ర ఇప్పటివరకూ జరిగిన వాటిల్లో అతి ముఖ్యమైన యాత్ర. ఆ తర్వాత వైఎస్ఆర్ నుంచి చంద్రబాబు, జగన్ వరకూ అందరూ చేశారు.
ఇప్పుడు పవన్ కళ్యాణ్ ‘వారాహి’ బస్సు యాత్ర చేపట్టబోతున్నారు. జనవరి 12 తర్వాత యువశక్తి కార్యక్రమం ముగిశాక పవన్ యాత్ర ప్రారంభం అవుతుందని అనిపిస్తోంది.
పవన్ యాత్ర సామాజిక మార్పుకోసం జరిగే యాత్ర. బడుగు బలహీన వర్గాల కోసం జరిగే యాత్ర. ఇప్పటివరకు అధికారంలోకి రాని వర్గాలు.. వచ్చేలా చేసే యాత్ర. అయితే నారాలోకేష్ యువగళం యాత్ర ఎందుకోసమే చెప్పడం లేదు. ఇప్పటివరకు అధికారం అనుభవించినటువంటి వర్గాలకు మాది వారసత్వ హక్కు .. మాకు అధికారం కావాలి.. రావాలి అని జరిపే యాత్ర లోకేష్ ది.
ఏ యాత్రకు అయినా సరే రాజ్యాధికారమే లక్ష్యంగా సాగుతుంది. మరి పవన్ కళ్యాణ్ ది మాత్రం ప్రజల సమస్యలే ఎజెండా ముందుకెళుతున్నారు. ప్రజలు అవకాశం ఇస్తేనే సీఎం అవుతానని అంటున్నారు. చంద్రబాబును తప్పించి తనే సీఎం కావాలని లోకేష్ ఈ యాత్ర చేపట్టినట్టు తెలుస్తోంది.
మరి పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర Vs నారా లోకేష్ పాదయాత్రపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను పైన వీడియోలో చూడొచ్చు