Pawan Kalyan – BJP: నేను చెప్పినట్టు బీజేపీ చేసి ఉంటే అసలు తెలుగు దేశం పార్టీ ఈరోజు ఉండేది కాదు

Pawan Kalyan – BJP: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నిన్న మచిలీపట్టణం లో జరిగిన జనసేన ఆవిర్భావ దినోత్సవం నాడు, ఆయన ఇచ్చిన ప్రసంగం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశం గా మారింది.ఈసారి అధికార పార్టీ పై ఘాటు విమర్శలు కాకుండా,జనాల్లో పరివర్తన కలిగించే విధంగా ఆయన ఇచ్చిన ప్రసంగం, చాలా చక్కగా అనిపించింది.ముఖ్యంగా రాష్ట్రం లో ఉన్న కుల గజ్జి గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు ప్రతీ ఒక్కరినీ ఆలోచింపజేసింది. ఇక […]

Written By: Vicky, Updated On : March 15, 2023 9:01 am
Follow us on

Pawan Kalyan – BJP: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నిన్న మచిలీపట్టణం లో జరిగిన జనసేన ఆవిర్భావ దినోత్సవం నాడు, ఆయన ఇచ్చిన ప్రసంగం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశం గా మారింది.ఈసారి అధికార పార్టీ పై ఘాటు విమర్శలు కాకుండా,జనాల్లో పరివర్తన కలిగించే విధంగా ఆయన ఇచ్చిన ప్రసంగం, చాలా చక్కగా అనిపించింది.ముఖ్యంగా రాష్ట్రం లో ఉన్న కుల గజ్జి గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు ప్రతీ ఒక్కరినీ ఆలోచింపజేసింది.

ఇక ఆంధ్ర ప్రదేశ్ లో బీజేపీ నాయకుల మీద ఆయన చేసిన ఘాటు వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి.దీనిని బట్టీ అర్థం అయ్యింది ఏమిటంటే ఆయన రాబొయ్యే రోజుల్లో బీజేపీ తో కలిసి నడవదు అనేది స్పష్టం అయ్యింది.సర్వే రిపోర్ట్స్ చేయిస్తున్నామని, జనాల్లో తిరుగుతామని, మాకు బలం ఉందని తెలిస్తే మాత్రం ఏ పొత్తు ఉండదని, ఒంటరిగానే పోరాటం చేస్తాము అంటూ పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా మాట్లాడాడు.

ఇది ఇలా ఉండగా ఆంధ్ర ప్రదేశ్ బీజేపీ నాయకుల గురించి పవన్ కళ్యాణ్ ఏమి మాట్లాడాడో ఇప్పుడు చూద్దాము.ఆయన మాట్లాడుతూ ‘బిజెపి రాష్ట్ర నాయకుల వల్ల నేను బలి పశువు ను అయ్యాను. అమరావతి, విశాఖ ఉక్కు, ప్రత్యేక హోదా లాంటి వాటిల్లో నా ఆలోచన ల కు తగ్గట్టు నాడు ప్రజా పోరాటాలు చేసి ఉంటే నేడు తెలుగు దేశం పార్టీ అనో , వైసీపీ వ్యతిరేక ఓటు అనో వెళ్లాల్సిన పని ఉండేది కాదు.జనసేన – BJP పొత్తు ముందు కు వెళ్ళేది. బిజెపి వల్ల నష్ట పోయాను ‘ అంటూ పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా తెలిపాడు.అంటే బీజేపీ ప్రణాళిక ప్రకారం ముందుకు నాతో కలిసి నడిచి ఉంటే నేను చెప్పిన ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలదు అనేది కేవలం జనసేన – బీజేపీ మధ్య ఉండేది, తెలుగు దేశం పార్టీ లెక్కలోకి ఉండేది కాదని పవన్ ఉద్దేశ్యం అంటూ విశ్లేషకులు అంటున్నారు.