Pawan Kalyan Away from PM Modi : ప్రధాని మోడీ భీమవరం సభకు జనసేనాని పవన్ కళ్యాణ్ వెళ్లకపోవడంపై విస్తృతమైన చర్చ జరిగింది. అసలు పవన్ కళ్యాణ్ కు ఆహ్వానం రాలేదని కొందరు అన్నారు.బీజేపీతో పవన్ కు సంబంధాలు చెడిపోయాయని.. చిరంజీవిని పిలవడం వెనుక పవన్ ను దెబ్బతీయడానికేనని చాలా కథనాలు వెలువడ్డాయి. అయితే చిరంజీవి సహా అందరితోపాటు పవన్ కళ్యాణ్ కూడా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆహ్వానం పంపారు. దీన్ని ఆయనే బయటపెట్టారు.
పవన్ కళ్యాణ్ కు ఆహ్వానం వచ్చినా దాన్ని ప్రచారానికి ఉపయోగించుకోలేదు. ప్రధాని వస్తున్నా వెళ్లకపోవడం అన్నది పవన్ కళ్యాణ్ వ్యక్తిగత వ్యూహంగా చెప్పొచ్చు. అది సరైందని చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్ వెళ్లకపోవడానికి ప్రధాన కారణం ఇది ప్రభుత్వ కార్యక్రమం.. పక్కనే తను తీవ్రంగా ద్వేషిస్తున్న సీఎం జగన్ ఉంటారు. పైగా ప్రధాని అధికారిక పర్యటన.
ప్రధాని పర్యటనలు, సభల్లో ఆయనకు.. ఆ రాష్ట్ర సీఎంకు, కేంద్రమంత్రికి మాత్రమే అవకాశం ఉంటుంది. మరొకరు మాట్లాడడానికి అవకాశముండదు. భీమవరంలోనూ అదే జరిగింది. ప్రారంభ ఉపన్యాసాన్ని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చేయగా.. ఏపీ సీఎం జగన్ ఆ తర్వాత మాట్లాడారు. ఇక ప్రధాని మోడీ ఫైనల్ టచ్ ఇచ్చారు. చిరంజీవి వెళ్లినా ఊరికే కూర్చున్నారు తప్పితే మాట్లాడలేదు.
ఇక పీఎం, సీఎం ఉన్న సభా వేదికపై కొన్ని ప్రొటోకాల్స్ ఉంటాయి. వేరే వాళ్లకు మాట్లాడే అవకాశం ఉండదు. చిరంజీవి సైతం మాట్లాడలేదు. పవన్ కళ్యాణ్ వచ్చినా మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. అటువంటి సమావేశంలో చిరంజీవిలాగా ఊరికే పవన్ వచ్చి కూర్చోవాలి.
చిరంజీవి ఏ రాజకీయ పార్టీలో లేడు.అందుకే ఆయన మాట్లాడకపోయినా నడుస్తుంది.కానీ ఒక రాజకీయ పార్టీ అధినేతగా పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా సభల్లో మాట్లాడాలి. మాట్లాడకపోతే కిందనున్న అభిమానులు ఊరుకోరు. గలాటా చేస్తారు. ఇక జగన్, మోడీ మాట్లాడి పవన్ మాట్లాకపోవడం కరెక్ట్ కాదు. జగన్ కు ప్రత్యర్థి అయిన పవన్ ను స్టేజ్ మీదకు పిలిచి .. జగన్ మాట్లాడితే జనసేన క్యాడర్ లో నిరుత్సాహం వస్తుంది. జగన్ కు సమాన స్థాయిలో పవన్ ను చూస్తున్నారు. అందుకే పవన్ ఈ సభకు హాజరు కాకపోవడమే సరైన నిర్ణయం అని చెప్పొచ్చు.. పవన్ కళ్యాణ్ భీమవరానికి ఎందుకు వెళ్ళలేదన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను ఈ వీడియోలో చూడొచ్చు.