Homeఆంధ్రప్రదేశ్‌Pawan Kalyan: గోదావరి జిల్లాల్లో ఒక్క సీటు కూడా వైసీపీకి దక్కకుండా పవన్ స్కెచ్

Pawan Kalyan: గోదావరి జిల్లాల్లో ఒక్క సీటు కూడా వైసీపీకి దక్కకుండా పవన్ స్కెచ్

Pawan Kalyan: ఉభయగోదావరి జిల్లాల విషయంలో పవన్ స్పష్టమైన వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. వైసీపీకి ఒక్క సీటు కూడా రాకూడదని భావిస్తున్నారు. టిడిపి, జనసేన మధ్య ఓట్ల బదలాయింపు సక్రమంగా జరగాలని ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఒక్క సీటు కూడా జార విడవకూడదు అని పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీతో సమన్వయం ముఖ్యమని సూచిస్తుండడం విశేషం. కాకినాడలో పార్టీ శ్రేణులతో గత మూడు రోజులుగా సమావేశం అయ్యారు. జనవరి 3 తరువాత మళ్లీ ఈ సమీక్షలను కొనసాగించాలని నిర్ణయించారు.

రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే ఉభయగోదావరి జిల్లాలో కీలకం. అందుకే ఈ జిల్లాల్లో వైసీపీకి కనీస ప్రాతినిధ్యం బ కాకపోవడం దక్కకూడదని పవన్ భావిస్తున్నారు. టిడిపితో కలిసి పకడ్బందీగా అడుగులు వేస్తే ఇది సాధ్యమని పవన్ అంచనా వేస్తున్నారు. రెండు వరాల కిందట మంగళగిరిలో ఉభయగోదావరి జిల్లాల నేతలతో పవన్ సమావేశమయ్యారు. ఇప్పుడు కాకినాడ వేదికగా నియోజకవర్గాల రివ్యూకు శ్రీకారం చుట్టారు. కేవలం జనసేన పరిస్థితిని తెలుసుకోవడమే కాదు.. టిడిపి తో ఎలా కలిసి ముందుకు వెళ్లాలి అన్నదానిపై పార్టీ శ్రేణులతో చర్చించారు. కాకినాడ లోక్సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్చార్జిలతో విడివిడిగా మాట్లాడారు. పార్టీ బలాబలాలతో పాటు టిడిపి నేతలతో ఉన్న సాన్నిహిత్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేశారు. న్యాయవాదులు, వైద్యులు, నియోజకవర్గ ప్రముఖులతో పవన్ సమావేశమయ్యారు.వారి సలహాలు, సూచనలను తీసుకున్నారు.

ఉభయగోదావరి జిల్లాల్లో జనసేన బలంగా ఉంది. ఇది అధికార పార్టీకి సైతం కలవరపాటుకు గురి చేసే అంశం. అందుకే తెలుగుదేశం పార్టీతో పొత్తు విచ్చిన్నానికి ఎంతలా ప్రయత్నాలు చేయాలో.. ఆ పార్టీ అంతగా చేస్తుంది కూడా. సీట్ల సర్దుబాటు, ఓట్ల బదలాయింపు సమయంలో రెండు పార్టీల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తుంది. అందుకే పవన్ ఈ విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రెండు పార్టీల మధ్య పొత్తు ఎందుకు? సీట్ల సర్దుబాటు వద్ద తలెత్తే అంశాలు ఏమిటి? ఓట్ల బదలాయింపు ఎలా జరగాలి? అనే అంశాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. అందుకే కాకినాడలో మూడు రోజుల పాటు బస చేసి నియోజకవర్గాల రివ్యూలు జరిపారు. జనవరి 3 తర్వాత మరో మూడు రోజులు పాటు ఈ సమీక్షలను కొనసాగించనున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఉభయగోదావరి జిల్లాలో ఒక్క సీటు కూడా వైసిపి గెలవకుండా చేయాలన్నదే పవన్ నిర్ణయం.పవన్ దూకుడు చూస్తుంటే అధికార పార్టీలో ఒక రకమైన కలవరం ప్రారంభమైంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular