https://oktelugu.com/

Pawan Kalyan: పవన్ స్టార్‌ గానే కాదు, వ్యక్తిగానూ ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయుడు !

Pawan Kalyan: ఒక నాయకుడికి ఏమి కావాలి. అర్థం చేసుకునే మనసు, క్షమించే గుణం, చెయ్యందించే స్నేహం, ఓదార్చే హృదయం.. నేటి రాజకీయాల్లో ఇవన్నీ పుష్కలంగా ఉన్న ఏకైక నాయకుడు ఒక్క ‘పవన్ కళ్యాణ్’ మాత్రమే అని ప్రత్యర్థి పార్టీ వాళ్లే నోరు విప్పి చెప్పిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. పవన్ దగ్గర సంతోషం రెట్టింపవుతుంది. పవన్ దగ్గర బాధలు సగమవుతాయి. పవన్ ను కలిసినప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది అని ప్రజలే చెబుతున్నారిప్పుడు. నిజానికి పవన్ […]

Written By:
  • Shiva
  • , Updated On : March 14, 2022 / 10:38 AM IST
    Follow us on

    Pawan Kalyan: ఒక నాయకుడికి ఏమి కావాలి. అర్థం చేసుకునే మనసు, క్షమించే గుణం, చెయ్యందించే స్నేహం, ఓదార్చే హృదయం.. నేటి రాజకీయాల్లో ఇవన్నీ పుష్కలంగా ఉన్న ఏకైక నాయకుడు ఒక్క ‘పవన్ కళ్యాణ్’ మాత్రమే అని ప్రత్యర్థి పార్టీ వాళ్లే నోరు విప్పి చెప్పిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. పవన్ దగ్గర సంతోషం రెట్టింపవుతుంది. పవన్ దగ్గర బాధలు సగమవుతాయి. పవన్ ను కలిసినప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది అని ప్రజలే చెబుతున్నారిప్పుడు.

    Pawan Kalyan

    నిజానికి పవన్ స్టార్ డమ్ కోసం ఎన్నడూ ప్రయత్నం చేయలేదు. పవన్ వ్యక్తిత్వమే ప్రజల హృదయాలకు దగ్గర చేసింది. మొదటి సినిమా సమయంలో పవన్ ను చూసి.. ఈ వ్యక్తి.. తెలుగు సినిమా రూపు రేఖలు మారుస్తాడని, ప్రాంతీయ సినిమా స్థాయిని వంద కోట్ల రూపాయల స్థాయికి తీసుకెళ్తాడని, ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ప్రేక్షకులకు ఆరాధ్యుడవుతాడని, అసలు స్టార్‌ డమ్ అనే పదానికి పర్యాయపదంగా నిలుస్తాడని ఎవరూ ఊహించలేదు.

    కానీ, ఇప్పుడు తెలుగు తెర పై పవన్ పేరు ఒక సమ్మోహనాస్త్రం. తెలుగు సినిమా అంటే.. ఇప్పుడు దేశం మొత్తం విడుదలవుతుంది. కలెక్షన్స్ కూడా పాన్ ఇండియా స్థాయిలో వస్తున్నాయి. కానీ పవన్ సినిమా లోకల్ స్థాయిలో రిలీజ్ అయినా.. అంతకన్నా కలెక్షన్స్ వస్తున్నాయి. అది పవన్ కి ఉన్న స్టార్ వాల్యూ. సినిమాల్లో పవన్ ఈ స్థాయికి వస్తాడని ఎవ్వరూ కలలో కూడా అనుకోనట్టే..

    ఇప్పుడు ప్రస్తుతం పవన్ రాజకీయ ప్రస్థానాన్ని.. గమ్యాన్ని కూడా ఎవ్వరూ ఊహించట్లేదు. కానీ, సినిమాలను శాసించినట్టుగానే పవన్ రాజకీయాలను కూడా తన కనుసన్నల్లో శాసించబోతున్నాడు. అసలు పవన్ వ్యక్తిత్వానికి ఎవరైనా వశం కావాల్సిందే. పాన్ ఇండియాలైనా , పాన్ వరల్డ్ లైనా సరే.. పవన్ స్టార్ డమ్ ముందు వెలవెల పోవాల్సిందే.

    Also Read: Pawan Kalyan Target: పవన్ కళ్యాణ్ టార్గెట్ అదేనా? కీలక ప్రకటనకు రంగం సిద్ధం!

    పవన్ నటనలో, నడకలో, నవ్వులో, డైలాగ్ విరుపులో… ఏదో తెలీని మేజిక్ ఉంటుంది. పవన్ ను చూస్తుంటే.. జనాలకు ఓ మెరుపును చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. అందుకే పవన్.. పవర్ స్టార్ అయ్యాడు. యువతరాన్ని ప్రభావితం చేస్తున్నా.. సూపర్‌ స్టార్లకు సైతం ఇన్‌స్పిరేషన్‌ గా నిలుస్తున్నా.. చరిత్రలో ఏ ప్రాంతీయ హీరో సాధించని రికార్డులను సాధించినా.. కేవలం ఒక్క పవన్ కి మాత్రమే సాధ్యం అయ్యింది.

    ఐతే.. పవన్, స్టార్లకే తలమానికంగా ఎదిగినా, తెరవెనుక ఇవేమీ పట్టనట్లే కనిపిస్తాడు. సగటు మనిషి ఆహార్యం, సాధారణ జీవితం, నిరంతరం సామాజిక చింతన, ధారాళమైన దానగుణం.. అన్నిటికి మించి స్వచ్చమైన మనసు ఇదీ పవన్ కళ్యాణ్ లైఫ్ స్టయిల్. పవన్ ఒక స్టార్‌గానే కాదు… ఒక వ్యక్తిగా కూడా ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయుడు.

    Also Read: Pawan Kalyan: పవన్ స్టార్‌ గానే కాదు, వ్యక్తిగానూ ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయుడు !

    Tags