Director Murali Kishor Abburu: రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలైన ‘లెనిన్’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. 12 ఏళ్ళ అఖిల్ సినీ ప్రస్థానం లో మొట్టమొదటి బ్లాక్ బస్టర్ గా నిల్చిన చిత్రమిది. వీకెండ్ తర్వాత వసూళ్లు డ్రాప్స్ అవ్వడం సహజమే. ఈ చిత్రానికి కూడా డ్రాప్ అయ్యింది కానీ, కలెక్షన్స్ మాత్రం చాలా స్టడీ గా ఉన్నాయి. కేవలం మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకున్న ఈ చిత్రం, ఇప్పుడు లాభాల్లో నడుస్తోంది. రాబోయే రోజుల్లో ఈ చిత్రం ఏ రేంజ్ కి వెళ్లబోతుందో చూడాలి. ఇకపోతే ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన మురళి కిషోర్ అబ్బూరు కి ఇప్పుడు టాలీవుడ్ లో మంచి డిమాండ్ ఏర్పడింది. యంగ్ హీరోల నుండి స్టార్ హీరోల వరకు ఇతనితో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
ఇతను ‘వినరో భాగ్యము విష్ణు కథ’ అనే చిత్రం తో మన టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. కిరణ్ అబ్బవరం హీరో గా నటించిన ఈ సినిమా కమర్షియల్ గా సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు ‘లెనిన్’ కూడా సూపర్ హిట్ అవ్వడం తో , ఇతనికి నేచురల్ స్టార్ నాని నుండి పిలుపు వచ్చినట్టు తెలుస్తోంది. రీసెంట్ గానే ఈయన నాని ని కలిసి ఒక స్టోరీ లైన్ ని వినిపించారట. అది నాని కి తెగ నచ్చడం తో పూర్తి స్థాయి స్క్రిప్ట్ ని రెడీ చేసుకొస్తే ఈ సినిమా చేద్దామని నాని మాట ఇచ్చారట. అయితే ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ప్రస్తుతం నాని ‘ది ప్యారడైజ్’ మూవీ షూటింగ్ లో బిజీ గా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి అయిన వెంటనే ఆయన ‘బ్లడీ రోమియో’ కి షిఫ్ట్ అవ్వనున్నారు.
ఈ రెండు సినిమాలు పూర్తి అయ్యాక మురళి కిషోర్ అబ్బూరితో నాని సినిమా చేసే అవకాశాలు ఉన్నాయి. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది. కేవలం నాని ఒక్కరే కాదు , విజయ్ దేవరకొండ కూడా ఇతనితో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తోంది. మరోపక్క అన్నపూర్ణ స్టూడియోస్ లో అఖిల్ తో మరో ప్రాజెక్ట్ కూడా ఓకే అయ్యినట్టు సమాచారం. చూస్తుంటే రాబోయే రోజుల్లో మురళి కిషోర్ పెద్ద స్టార్ డైరెక్టర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. చూడాలి మరి ఆయన కెరీర్ ఎలా ఉండబోతుంది అనేది.
