Pawan Clarity On Alliance With TDP and BJP: శత్రువుకు శత్రువు మిత్రుడు అన్న నానుడి రాజకీయాల్లో చాలా చక్కగా సరిపోతుంది. తమ కంటే చాలా బలంగా ఉన్న ప్రత్యర్థిని దెబ్బకొట్టాలంటే జట్టు కట్టడం అనివార్యం. ఈ ఫార్మూలాను రాజకీయాలు పార్టీలు అనేకసార్లు ఎన్నికల్లో ప్రయోగించి సక్సస్ అయ్యాయి. అదే ఫార్మూలా మరోసారి జనసేనాని ఏపీలో తెరపైకి తీసుకొస్తున్నారు. ఇది పాత ఫార్మూలానే అయినప్పటికీ కూడా సక్సస్ ఫార్మూలా కావడంతో గతంలో దూరంగా జరిగిన పార్టీలన్నీ కూడా వైసీపీని గద్దె దించడానికి ఏకతాటిపైకి వచ్చేందుకు రెడీ అవుతున్నాయి.
2024 సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా పవన్ కల్యాణ్ అడుగులు వేస్తున్నారు. నిన్న జరిగిన జనసేన ఆవిర్భావ సభలో జనసేనాని అన్ని అంశాలపై కూలంకశంగా మాట్లాడారు. రెండేళ్ల ముందుగానే జనసేనాని తమ పార్టీ మ్యానిఫెస్టోను ప్రకటించడం చూస్తుంటే రాబోయే ఎన్నికల కోసం పవన్ కల్యాణ్ ఎలాంటి వ్యూహాలతో సిద్ధంగా ఉన్నారో అర్థమవుతోంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీపై ప్రజల్లో పెద్దఎత్తున వ్యతిరేకత వస్తోంది.
Also Read: పవన్ టార్గెట్ ఫిక్స్.. ఇక తేల్చుకోవాల్సింది చంద్రబాబే..!
దీనిని ముందుగానే గుర్తించిన ప్రభుత్వం వైసీపీ వ్యతిరేక ఓటును చీల్చే ప్రయత్నాలను ఒక్కొక్కటిగా చేస్తోంది. వైసీపీ ఓటు చీలడం ద్వారా మరోసారి అధికారంలోకి రావాలని వైసీపీ ఎత్తుగడలు వేస్తోంది. ఇప్పటికే కొన్ని వర్గాలను వైసీపీ టార్గెట్ చేస్తోంది. ఈ విషయంపై లోతుగా అధ్యయనం చేసిన జనసేనాని నిన్నటి సభ ద్వారా ప్రజలకు క్లియర్ కట్ సందేశాన్ని పంపించారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీల్చడంలో తాము భాగస్వామ్యం కాదలుచుకోలేదని తేల్చిచెప్పారు.
2024లో ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు వైసీపీ వ్యతిరేక శక్తులు కలిసి రావాలని పవన్ కల్యాణ్ పిలుపు నిచ్చారు. మరోవైపు బీజేపీతో తమ ప్రయాణం ఇకపై కూడా కొనసాగుతుందని స్పష్టం చేశారు. పనిలో పనిగా టీడీపీకి ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. 2014లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి కలిసి పోటీ చేసి ఏపీలో అధికారంలోకి వచ్చాయి. ఈ కూటమిది విన్నింగ్ ఫార్మూలా కావడంతో ఇదే ఫార్మూలాను మరోసారి ఏపీలో వర్కౌట్ చేయాలని భావిస్తోంది. ఇప్పటికే వైసీపీపై వచ్చిన వ్యతిరేకత కూడా తమకు కలిసి వస్తుందని జనసేనాని భావిస్తున్నారు.
అందుకగుణంగానే ఇతర పార్టీలను సైతం తాము కలుపుకుపోయేందుకు సిద్ధమని క్లారిటీ ఇచ్చారు. కాగా 2014 ఎన్నికల ముందు జనసేన పార్టీ అప్పుడు ఆవిర్భవించిన పార్టీ. ఆ సమయంలో జనసేన సీట్లను పెద్దగా డిమాండ్ చేయలేదు. కానీ ఇప్పుడు ఏపీలో జనసేన కీ రోల్ పోషిస్తోంది. దీంతో ఈసారి జనసేన భారీగా సీట్లను డిమాండ్ చేసే అవకాశం ఉంది. అలాగే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండటంతో రాష్ట్రంలో బీజేపీ బలపడాలంటే ఆపార్టీ కూడా గొంతెమ్మ కోరికలు కోరే అవకాశం ఉంది.
దీంతో ఈసారి సీట్ల విషయంలో టీడీపీ చాలా స్థానాల్లో కాంప్రమైజ్ కాక తప్పని పరిస్థితి నెలకొంది. టీడీపీ చంద్రబాబు నాయుడు గత ఎన్నికల ముందు నుంచే జనసేనతో పొత్తుకు ప్రయత్నించారు కానీ వర్కౌట్ కాలేదు. దీంతో ఆ గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన రెండు కూడా దారుణంగా ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత నుంచి చంద్రబాబు నాయుడు జనసేనతో పొత్తు ప్రయత్నిస్తున్నారు.
జనసేన సైతం టీడీపీతో పొత్తుకు సై అనే సంకేతాలను పంపుతోంది. అయితే జనసేనతో బీజేపీ ఉండటం చంద్రబాబుకు ఇబ్బందికరంగా మారింది. అయితే ఈ కూటమి గతంలో విన్నింగ్ కాంబినేషన్ కావడంతో చంద్రబాబు సైతం బీజేపీతో తప్పక నడుస్తారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో పాత కూటమి మరోసారి తెరపైకి రావడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరికొద్దిరోజుల్లోనే దీనిపై మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉండటంతో అంతా ఆసక్తి ఎదురుచూస్తున్నారు.
Also Read: ప్రతిపక్షాల సమాఖ్య కూటమి ఉమ్మడి సీఎం అభ్యర్థి పవన్ కళ్యాణ్?