Homeఆంధ్రప్రదేశ్‌Pavan Kalyan: ప‌గ‌డ‌పు ఉంగ‌రం పెట్టిన ప‌వ‌న్‌.. ఇక సీఎం అవ్వ‌డం ఖాయ‌మేనా..?

Pavan Kalyan: ప‌గ‌డ‌పు ఉంగ‌రం పెట్టిన ప‌వ‌న్‌.. ఇక సీఎం అవ్వ‌డం ఖాయ‌మేనా..?

Pavan Kalyan: పవన్ కళ్యాణ్ పేరు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో మార్మోగిపోతోంది. రాబోయే కాలంలో ఆయన తిరుగులేని నేతగా ఎదుగుతారని అంతా అంటున్నారు. ఆయన రాజకీయ చరిష్మా మరింతగా పెరుగుతుందని.. అందుకే టీడీపీ, బీజేపీ పార్టీలు ఆయన వెంట పడుతున్నాయని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇదిలా ఉండగా మొన్న ఆవిర్భావ సభ జరిగినప్పటి నుంచి పవన్ సత్తా ఏంటో మరోసారి నిరూపితమైందని చెబుతున్నారు.

Pavan Kalyan
Pavan Kalyan

పవన్ మాటల్లో చాలా మార్పు కనిపిస్తోందని, ఒక నిజాయితీ గల బలమైన నేతగా మాట్లాడుతున్నారని మీడియా సైతం చెబుతోంది. ఆవేశంగా తొందరపాటుగా మాట్లాడకుండా చాలా ఓపిగ్గా చెప్పాలనుకున్నది సూటిగా చెప్పేశారని ఈ మార్పు ఆయనకు మేలు చేకూరుస్తుందని అంటున్నారు. అయితే ఈ సభలో పవన్ డ్రెస్సింగ్ స్టైల్ మీద కూడా చాలా చర్చ జరుగుతోంది. ఇలాంటి రాజకీయ సభలకు ఇంత‌కు ముందు ఆయన జుబ్బా పైజామా వేసుకొని వచ్చేవారు. కానీ ఈ సారి వెరైటీగా షర్టు ప్యాంటు వేసుకుని సాదాసీదాగా కనిపించారు. అయితే తాజాగా మరో అంశం కూడా తెర మీదికి వస్తుంది.

Also Read: Uday Kiran Death Reason: అందుకే ‘ఉదయ్ కిరణ్’ చనిపోయాడు.. నటుడు షాకింగ్ కామెంట్స్

ఆయన కుడిచేతి ఉంగరం వేలికి పగడపు ఉంగరం పెట్టుకొని కనిపించారు. పవన్ గతంలో ఎన్నడూ కూడా ఇలాంటి బంగారు ఆభరణాలను ధరించి రాజకీయ సభలకు రాలేదు. బయట కూడా ఆయన ఎలాంటి బంగారు వస్తువులు పెట్టుకోలేదు. అలాంటిది ఇప్పుడు ఈ పగడపు ఉంగరాన్ని ఎందుకు పెట్టుకున్నారు అంటే దాని వెనక ఓ పెద్ద కథ ఉన్నట్లు తెలుస్తోంది.

పవన్ జాతకరీత్యా చేతికి పగడపు ఉంగరం ఉంటే రాజకీయాల్లో మరింత ఎత్తుకు ఎదుగుతారని జ్యోతిష్యులు చెప్పడంతో ఆయన దీన్ని పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇంకా చెప్పాలంటే సీఎం అయ్యే అవకాశాలు కూడా ఉన్నట్లు స‌మాచారం. సీఎం కావాలంటే ఉంగరం చేతికి ఉండాల్సిందేనని పవన్ ఆ నమ్మకాన్ని ఫాలో అవుతున్నట్లు చెబుతున్నారు.

రాజకీయాల్లో ఇలాంటి నమ్మకాలు చాలా కామన్. చాలామంది ఇలాంటి నమ్మకాలతోనే పెద్దపెద్ద పదవులను అధిరోహించారు. కాబట్టి ఇప్పుడు పవన్ కూడా చాలా పెద్ద పదవి స్వీకరిస్తారని జనసేన కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. మరి పగడపు ఉంగరం పవన్ ను సీఎం చేస్తుందా లేదా అన్నది తెలియాలంటే కొంత కాలం వేచి చూడాల్సిందే.

Also Read: AP Politics: ప‌వ‌న్‌కు టీడీపీ బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చిందా.. బీజేపీ రూట్ మ్యాప్ ఏంటి..?

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.
RELATED ARTICLES

Most Popular