Pattabhi Arrest: వైసీపీ ప్రతీకార రాజకీయమే డిఫెరెంట్.. స్వతహాగా రాయలసీమ నుంచి వచ్చిన సీఎం జగన్ లో ఆ పంతం, పౌరుషం కనిపిస్తుంటుంది. ఇక ఆయనతో పెట్టుకుంటే మొదటి సహిస్తాడు.. భరిస్తాడు. అనక వేటాడేస్తాడు. టీడీపీ ప్రోద్బలంతో నానా యాగీ చేసి మీడియాలో రచ్చ చేసిన ఎంపీ రఘురామకు జగన్ మార్క్ థర్డ్ డిగ్రీ పోలీసులతో ఎలా ఇప్పించారో అందరికీ తెలిసిందే.
ఇప్పుడు జగన్ ను బండ బూతులు తిట్టిన టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభికి కూడా అలాంటి ట్రీట్ మెంట్ దక్కుతుందా? అన్న చర్చ మొదలైంది. ఈ విషయం తెలుసు కాబట్టే పట్టాభి తనను అరెస్ట్ చేయడానికి పోలీసులు నిన్న రాత్రి మోహరించిన వేళ బట్టలన్నీ విప్పి చూపి తనకు ఎలాంటి గాయాలు లేవని.. తన కాళ్లకు రఘురామ లాగా ఎలాంటి వ్యాధులు లేవని సెలవిచ్చి ముందు జాగ్రత్త పడ్డాడు.
ఎంపీ రఘురామను సీఎం జగన్ మంచిగానే అరుసుకున్నాడన్న చర్చ రాజకీయవర్గాల్లో ఉంది. ఇప్పుడు ‘ఓరేయ్ బోసిడీకే’ అన్న పట్టాభికి కూడా అదే ట్రీట్ మెంట్ ఇస్తారా? లేదా అన్నది తెలియాల్సి ఉంది. అయితే పట్టాభిపై పలు సెక్షన్ల కింద బెయిల్ దొరకకుండా గట్టిగానే పోలీసులు కేసులు నమోదు చేశారు.
విజయవాడ గవర్నర్ పేట పోలీసులు తాజాగా పట్టాభిని కోర్టులో హాజరుపరిచారు. జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను పట్టాభిపై పోలీసులు సెక్షన్ 153(ఏ), 505(2), 353, 504 రెడ్ విత్ 120(బి) కింద కేసులు నమోదు చేశారు. ఇక విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం విజయవాడలోని మూడో అదనపు చీఫ్ మెట్రో పాలిటిన్ కోర్టులో ప్రవేశపెట్టారు. తాను మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలపై న్యాయమూర్తికి పట్టాభి వివరణ ఇచ్చారు.
ఎంపీ రఘురామపై పోలీసులు చేయి చేసుకున్నారని ఎంత రచ్చ జరిగిందో చూశాం. ఇప్పుడు పట్టాభికి ఎలాంటి గౌరవం ఇచ్చారన్నది ముందుముందు చూడాలి.