Patiala House Court : ఇతర దేశాలలో వివాహేతర సంబంధాలు సర్వసాధారణం. నచ్చినంతసేపు ఉండడం.. నచ్చకుంటే వదిలేయడం అక్కడ కామన్. రాను రాను అటువంటి కల్చర్ మనదేశంలోనూ పెరుగుతున్నది. ముఖ్యంగా ఇటీవల కాలంలో యువత ఎక్కువగా విడాకులు తీసుకుంటుండడం సంచలనం కలిగిస్తోంది. సెలబ్రిటీలలో విడాకులు అనేవి ఇప్పుడు కామన్ అయిపోయాయి. అదే సమయంలో ఇతర సంబంధాలు పెట్టుకోవడం కూడా సర్వసాధారణమైపోయాయి. అయితే సెలబ్రిటీలకు మనదేశంలో విపరీతమైన పాపులారిటీ ఉంటుంది కాబట్టి ఆ విషయాలను పెద్దగా ఎవరూ పట్టించుకోరు. కానీ సామాన్యుల విషయానికి వచ్చేసరికి చర్చ మొదలవుతుంది. కొన్ని సందర్భాల్లో ఆ వివాదాలు కోర్టుల దాకా వెళ్తాయి. అవి కాస్త సంచలన తీర్పు వెళ్లడయ్యే దాకా సాగుతాయి.. అలాంటి తీర్పు ఒకటి పాటియాలా హౌస్ కోర్టు ఇచ్చింది. ఇంతకీ ఏ విషయంలో అంటే..
Also Read : కవిత మరో షర్మిల.. కాకపోతే ప్రాంతీయ పార్టీ కుటుంబాల్లో పవర్ పంచాయితీలు ఎప్పటినుంచో కామనే!
ఇప్పటికీ మన న్యాయస్థానాలు వివాహ బంధాల గురించి ఒక స్పష్టమైన నిర్వచనం ఇవ్వలేకపోయాయి. వివాహం బంధంలో ఉంటూనే ఇతర సంబంధాలు ఏర్పరచుకునే వారి విషయంలోనూ ఒక స్పష్టమైన తీర్పు అంటూ ఇవ్వలేకపోయాయి. ఒక కోర్టు ఒక విధంగా.. ఇంకో కోర్టు ఇంకో విధంగా తీర్పులు ఇవ్వడం వల్ల వీటికి సంబంధించి స్పష్టమైన నిర్వచనాల విషయంలో ఇప్పటికి గందరగోళం కొనసాగుతూనే ఉంది. ఇక తాజాగా ఓ ఆర్మీ మేజర్ తన భార్యతో విడాకుల కోసం కోర్టును ఆశ్రయిస్తే.. దానికి సంబంధించి విభిన్నమైన తీర్పును న్యాయస్థానం వెల్లడించింది.
ఓ ఆర్మీ మేజర్ కు గతంలో వివాహం జరిగింది. మొదట్లో వారి సంసారం సజావుగానే సాగింది. ఆ తర్వాత అతడి భార్య ప్రవర్తనలో మార్పు వచ్చింది. మొదట్లో ఆ ఆర్మీ మేజర్ దీనిని అంతగా పట్టించుకోలేదు. ఆ తర్వాత ఆయన ఆమె విషయంలో లోతుగా వెళ్తే అసలు సంగతి తెలిసింది..ఆమె వేరే వ్యక్తి తో చనువు పెంచుకున్నదని.. క్రమేపి అతడి ప్రేమలో మునిగిపోయిందని తెలిసింది. పైగా అతనితో కలిసి ఓ హోటల్ రూమ్ వెళ్లిందని ఆ ఆర్మీ మేజర్ అభియోగం. దానిని కీలకమైన ఆధారంగా చూపిస్తూ అతడు కోర్టు దాకా వెళ్ళాడు. తనకు ఆమె నుంచి విడాకులు మంజూరు చేయాలని కోరాడు.. అయితే దీనిపై పాటియాలా హౌస్ కోర్టు భిన్నంగా స్పందించింది..” భార్యకి ప్రియుడితో ఉండే హక్కు ఉంది. ఒక వ్యక్తి మరొక వ్యక్తి భార్యను తీసుకెళ్లడనేది పాత విషయం. హోటల్ సిసి టీవీ ఫుటేజ్ కోరడమంటే ఇతరుల గోప్యతకు భంగం కలిగించడమేనని” పాటియాలా హౌస్ కోర్టు వ్యాఖ్యానించింది. అంతేకాదు ఆర్మీ అధికారి ఇచ్చిన ఆధారాలతో ఏకీభవించి విడాకులు మంజూరు చేయలేమని పేర్కొంది. దీంతో ఆర్మీ అధికారికి కోర్టు ఇచ్చిన తీర్పు షాకింగ్ పరిణామం లాగా మారింది. దీంతో అతడు తనకు విడాకుల కోసం పైకోర్టును ఆశ్రయించే యోచనలో ఉన్నాడు.