Paritala Shriram: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అనంతపురం జిల్లాలో రాజకీయ సమీకరణలు మారనున్నాయి. ఇప్పటికే టీడీపీ తన స్థానాలు ఖరారు చేసుకుంటోంది. ఎవరెవరు ఏ నియోజకవర్గాల్లో నుంచి పోటీ చేయాలనేదానిపై ఓ అంచనాకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో పరిటాల కుటుంబం తన నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. అధినేత చంద్రబాబుతో చర్చించకుండానే మంతనాలు సాగిస్తోంది. ఇప్పటి నుంచే వ్యూహాలు ఖరారు చేసుకుంటున్నారు.
పెనుకొండ నియోజకవర్గం మీద మంచి పట్టుంది. ఇక్కడ నుంి 1983 నుంచి ఇప్పటి దాకా టీడీపీ రెండు సార్లు మాత్రమే ఓటమి పాలైంది. మిగతాసార్లు విజయం సాధించిందంటే టీడీపీ స్థానమేంటో అర్థమవుతోంది. 2009లో ఇది ఎస్సీ రిజర్వ్ కావడంతో వైసీపీ జెండా ఎగరేసింది. మంత్రి శంకరనారాయణ ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
Also Read: ప్చ్.. ఇన్నాళ్లు పద్ధతిగా ఉండి.. ఇప్పుడు రెచ్చిపోతుంది !
దీంతో పరిటాల కుటుంబం రాప్తాడు నియోజకవర్గానికి వలస వెళ్లింది. ఇక్కడి నుంచి పరిటాల సునీత రెండు సార్లు విజయం సాధించి తన పట్టు నిరూపించుకున్నారు. 2019లో శ్రీరామ్ ను ఇక్కడి నుంచి పోటీ చేయించినా పరాజయం పాలయ్యారు. 25 వేల ఓట్ల తేడాతో వైసీపీ అభ్యర్థి ప్రకాశ్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు.దీంతో రాప్తాడులో కూడా సమీకరణలు మారుతున్నాయి.
అందుకే పరిటాల కుటుంబం తన వ్యూహాన్ని మార్చుకుంది. ఈసారి ధర్మవరం నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తోంది. దీంతో కొద్ది రోజులుగా శ్రీరామ్ ఇక్కడ ప్రచారం నిర్వహిస్తున్నారు. నియోజకవర్గంల పర్యటిస్తూ తాను ఇక్కడ నుంచే బరిలో దిగుతున్నట్లు సంకేతాలు ఇస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో ధర్మవరం అయితేనే గెలుపు సాధ్యమవుతుందని పక్కా ప్రణాళిక రచిస్తున్నారు.
Also Read: ఛార్మిని ఆటపట్టించిన బాలయ్య.. చూసి తీరాల్సిందే..!