Paleru Review : కృష్ణానది పారాల్సిన చోట గోదావరి ఎదురెక్కింది.. ఆ ఎమ్మెల్యే చొరవతో రైతుల కష్టం తీరింది!

అందుకే మంచి నేత ఉంటే మంచి ఫలితాలు వస్తాయనడానికి ‘కందాల’ పట్టుదల నిదర్శనం.. కొన్నేళ్లుగా దోపిడీకి గురైన పాలేరు ఇప్పుడు పాడిపంటలతో , అభివృద్ధిలో నంబర్ 1గా దూసుకెళుతుందంటే అదంతా ఉపేందర్ రెడ్డి చలవే.

Written By: Anabothula Bhaskar, Updated On : November 8, 2023 8:42 pm
Follow us on

Paleru Constituency, Review : ఒకప్పుడు కరువు కటాకాలతో పల్లెపల్లెన పల్లేర్లు మొదలిచిన నేల.. కానీ తెలంగాణ వచ్చాక దశ మారింది. కేసీఆర్ పాలనలో తెలంగాణ నీటి కరువు తీరింది. బీఆర్ఎస్ పాలనలో ప్రతి చేను తడిసింది.. తెలంగాణ అంతా ఒక ఎత్తు అయితే కృష్ణా, గోదావరి నదుల మధ్యన ఉన్న ఖమ్మం జిల్లాది మరో పరిస్థితి.. ‘తలాపునే గోదారి.. తాగేందుకు నీరేది’ అన్నది తెలంగాణలో పాపులర్ సామెత.. ఖమ్మం పరిస్థితి కూడా అంతే.. ఎగువన గోదావరి.. దిగువన కృష్ణా నది పారుతున్న సరిగ్గా నీటి వాడుకోని నిస్సహాయత.. ప్రాజెక్టులు , కాలువలు లేని అసక్తత.. అందుకే ఒక మంచి నేత కోసం ఎదురుచూశారు. అక్కడ కేసీఆర్ వచ్చాడు. ఇక్కడ పాలేరులో కందాల ఉపేందర్ రెడ్డి వచ్చాడు. వెరసి పాలేరు సస్యశ్యామలమై పరవసించిపోయింది..

-వలస నివారించి.. సుభిక్షాన్ని తెచ్చి..
తెలంగాణ అంటేనే వలస బతుకులు.. అదీ పాలేరులోనూ ఉండేది.. కూలీ పనులు దొరక్క వలసపోయిన బతుకులు ఇక్కడివి.. తాగునీటి కోసం గంటల తరబడి మైళ్లు నడిచిన ప్రజలు ఉన్నారు.. కానీ ‘కందాల’ వచ్చాక.. కేసీఆర్ సర్కార్ తోడు దొరికాక.. బీళ్లు వడిన భూములకు నీళ్లు అందాక ఇప్పుడు వలసలు పోయిన వారంతా తిరిగివచ్చారు. రెండు పంటలు పండిస్తున్నారు. కరువును అధిగమించి ఇప్పుడు సిరులు పండిస్తున్నారు. రైతులంతా లక్షాధికారులు అయిపోయారు. భక్త రామదాసు ప్రాజెక్టుతో సాగు, తాగునీటి కష్టాలు పోయి ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కరువుతో అల్లాడిన కూసుమంచి, తిరుమలాయపాలెంలో ఇప్పుడు రెండు పంటలతో కళకళలాడుతున్న పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ, సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అందరికీ అంది ఇప్పుడు పాలేరు సుభిక్షంతో అలరారుతోంది.

-పట్టువదలని ‘కందాల’
సంకల్పం ఉంటే నెరవేరనిది ఏదీ లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి నిరూపించారు. కేసీఆర్ సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్లాడు. రెండు జీవనదులతో పాలేరు సాగునీటి కష్టాలు తీర్చాడు. ‘సీతారామ ప్రాజెక్టును’ పాలేరు నియోజకవర్గానికి అనుసంధానం చేసి సాగర్ ఆయకట్టుకు తన నియోజకవర్గంలోని రైతులకు పుష్కలంగా నీరందించాడు. దీంతో పాలేరు కథ మారింది.. అక్కడి రైతులు బంగారు పంటలు పండించడానికి కారణమైంది. ఆధునిక పాలేరుకు బాటలు పరిచింది. సొంత గడ్డ పాలేరు అభివృద్ధి కోసం శతవిధాల ప్రయత్నించిన కందాల పట్టుదలకు తెలంగాణ ప్రభుత్వం కూడా సహకరించింది. ఎన్నో ప్రభుత్వ పథకాలను పేదలకు అందించాడు. ‘కందాల ఫౌండేషన్’తో సొంత నిధులతో సేవా కార్యక్రమాలు చేసిన కందాల ప్రజల మనసులు చూరగొన్నారు. అందుకే ఇప్పుడు ఖమ్మంలోనే పాలేరు ఒక రోల్ మోడల్ గా నిలిచింది. కరువును తరిమికొట్టి సిరులు కురిపిస్తోంది. అందుకే ఈ సిరుల భూమిలో పోటీకి పొంగులేటి, తుమ్మల లాంటి బలమైన ప్రత్యర్థులు ఇక్కడ పోటీ చేయడానికి తరలి వస్తున్నారంటే అదంతా ఉపేందర్ రెడ్డి సాధించిన అభివృద్ధి ఘనతనే..

-నియోజకవర్గాన్ని రోల్ మోడల్ చేసేశారు..
భక్తరామదాసు ప్రాజెక్టుతో పాలేరు కరువు తీర్చారు కందాల ఉపేందర్ రెడ్డి. గోదావరి, కృష్ణా జలాలతో బీడు భూములను సస్యశ్యామలం చేశారు. నియోజకవర్గంలో జాతీయ రహదారి, అంతర్గత రోడ్లతో ప్రయాణ కష్టాలు దూరం చేశారు. మిషన్ భగీరథతో ఇంటింటికి మంచినీటిని అందించారు. కాలువలతో రైతులకు సాగునీరందించారు. పాఠశాల భవనాల రూపు రేఖలు మార్చారు. మిషన్ కాకతీయతో చెరువులను సాగుకు అనుకూలంగా మార్చారు. వైకుంఠధామాలు నిర్మించి ప్రజల అంతిమసంస్కారాలకు ఇబ్బందులను తొలగించారు. పల్లె ప్రకృతి వనాలతో పచ్చదనం పెంచారు. మన ఊరు మన బడి, ఆసరా పించన్లు, దళితబంధు, డబుల్ బెడ్ రూం ఇళ్లు, రైతు బంధు, రైతు బీమా, ఇలా కేసీఆర్ అమలు చేసిన పథకాలన్నింటిని నియోజకవర్గంలో ప్రతీ పేదవారికి అందించారు. ఒకప్పుడు కరువుతో అల్లాడిన పాలేరు నేడు ప్రగతి పథంలో నడిచిందంటే ఖచ్చితంగా ఇది ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి ఘనతగా చెప్పొచ్చు.

ఇక నియోజకవర్గంలోని అన్ని చెరువులను బాగు చేసి చేపలను పెంచి కేజ్ కల్చర్ తో 6 ఏళ్లుగా నీలి విప్లవం తెచ్చిన ఘనత ఎమ్మెల్యే కందాలదే.. ఇక నియోజకవర్గంలో మత్స్య పరిశోధనా కేంద్రం , మత్య్స కళాశాల మంజూరు చేయిచి దీన్ని మరింతగా ప్రోత్సాహాన్ని అందించారు.

*కరువుతో అల్లాడే పాలేరు నియోజకవర్గంలో 70వేల ఎకరాలను సాగులోకి తెచ్చిన ఘనత కందాలదే.. ఫిబ్రవరి 16 2017న కేసీఆర్ శంకుస్థాపన చేసిన భక్తరామదాసు ప్రాజెక్టు సంవత్సరంలోనే పూర్తైపోయి 2018 జనవరి 27న ప్రారంభమైంది. రూ.335.59 కోట్లతో 11 నెలల్లోనే పూర్తి చేసి దీని ద్వారా కూసుమంచి, తిరుమలాయపాలెం, ఖమ్మం రూరల్, ముదిగొండ మండలాల్లోని వ్యవసాయానికి పూర్తి స్థాయిలో సాగునీరందించారు. పాలేరులో కాలువను తవ్వించి సామర్థ్యం పెంచి ఏకంగా 90వేల ఎరాల్లో సాగునీరు అందించి రైతుల కష్టాలు తీర్చారు.

అందుకే మంచి నేత ఉంటే మంచి ఫలితాలు వస్తాయనడానికి ‘కందాల’ పట్టుదల నిదర్శనం.. కొన్నేళ్లుగా దోపిడీకి గురైన పాలేరు ఇప్పుడు పాడిపంటలతో , అభివృద్ధిలో నంబర్ 1గా దూసుకెళుతుందంటే అదంతా ఉపేందర్ రెడ్డి చలవే. అందుకే ఈసారి కూడా ఎన్నికల్లో ఆయనకు సాటి ఎవరూ లేరు.. బయట నుంచి డబ్బుల సంచులతో వచ్చే నేతలెవరు ఈయన చేసిన అభివృద్ధి, సంక్షేమానికి నిలవలేకపోతున్నారు. ఈ నియోజకవర్గ ప్రజానాడి మొత్తం కందాల గెలుపునే సూచిస్తోంది. పాలేరులో మరోసారి గెలిచేది ‘కందాల’నే అని నినదిస్తోంది.