Russia-Ukraine War: మన దేశాన్ని బానిస సంకెళ్ల నుంచి విముక్తి చేసేందుకు ఎంతోమంది ఉద్యమకారులను, పోరాట వీరులను ఒక్కతాటిపైకి తెచ్చి దేశ సమగ్రతను, సార్వభౌమత్వాన్ని ప్రపంచానికి చాటిచెప్పింది మన మువ్వెన్నైల జెండా. భారతీయ తత్త్వంలోనే కాదు, మన జాతీయపతాకంలోనూ సాయం సేవ గుణాలు ఉన్నాయని మరోసారి రుజువు అయ్యింది. ఉక్రెయిన్ ఆక్రమణలో రష్యా దూకుడు పెంచుతూ దాడుల్ని ముమ్మరం చేసింది. సాధారణ పౌరులున్నారని కూడా చూడకుండా క్షిపణి, బాంబులు, బుల్లెట్లతో విరుచుకుపడుతున్నాయి రష్యా బలగాలు.
దాంతో ఉక్రెయిన్ నుంచి క్షేమంగా బయట పడటానికి ఇతర దేశాల విద్యార్ధులు పోరాటం చేయాల్సి వస్తోంది. ఈ క్రమంలోనే పాకిస్థాన్, టర్కీ విద్యార్థుల ప్రాణాలను భారతీయ మువ్వెన్నైల జెండా కాపాడింది. భారతీయులే కాదు భారత జెండా కూడా పాకిస్తానీ టర్కీ విద్యార్థులకు గొప్ప సహాయం చేసింది. ఉక్రెయిన్ నుంచి క్షేమంగా బయట పడటానికి పాకిస్తానీ విద్యార్థులు అంతా భారతీయ జెండాను మోశారు.
Also Read: ఉక్రెయిన్ నుంచి బయటపడడానికి ‘భారత్ మాతాకి జై’ నినాదాలు చేస్తున్న పాకిస్తాన్ విద్యార్థులు
ఈ రోజు తెల్లవారుజామున దాదాపు 220 మంది భారతీయ విద్యార్థులు ఇస్తాంబుల్ మీదుగా ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరుకున్నారు. వాళ్లతో పాటు పాకిస్తానీ విద్యార్థులు కూడా మేము భారతీయులమే అంటూ విధ్వంస కాండ నుంచి బయటపడ్డారు. మా ప్రాణాలను నిలబెట్టింది భారతీయ జెండా మాత్రమే అని పాకిస్తానీ విద్యార్థులు కన్నీళ్లు పెట్టుకుని చెప్పడం పాకిస్తానీ అధికారులను ఆశ్చర్య పరిచింది.
జాతీయపతాకంలోని కాషాయం దేశంపట్ల ప్రజల త్యాగాన్ని, ఆత్మస్థైర్యాన్నీ ప్రతిబింబిస్తే.. మధ్యలోని తెలుపు స్వచ్ఛతని, శాంతిని, నిజాయతీని చాటుతుంది. కిందనే ఉన్న ఆకుపచ్చ విశ్వసనీయతని, ప్రకృతిని సూచిస్తుంది. మానవ ధర్మాన్ని ప్రబోధించడానికి అశోకుడి ధర్మచక్రం నీలిరంగులో నిజాయతీకి ప్రతీకగా కనిపిస్తోంది. అందుకే జాతీయపతాకం భారత జాతికే కాదు, మానవ జాతికీ గొప్ప సందేశం,
Also Read: ఒంటరివాడైన పుతిన్..: పరాభావం తప్పదా..?