https://oktelugu.com/

Tollywood Trends: టుడే వైరల్ అవుతున్న క్రేజీ అప్ డేట్స్

Tollywood Trends : టాలీవుడ్ ట్రెండ్స్ నుంచి ప్రజెంట్ క్రేజీ అప్ డేట్స్ విషయానికి వస్తే.. నాగచైతన్య ప్రధాన పాత్రలో నటిస్తున్న దూత అనే వెబ్ సిరీస్ చిత్రీకరణ ప్రారంభమైంది. ఈ విషయాన్ని అతను సోషల్ మీడియాలో వెల్లడించాడు. థ్రిల్లర్ నేపథ్యంలో సాగే ఈ సిరీస్‌కు విక్రమ్ కె.కుమార్ దర్శకుడు. వీరిద్దరి కాంబినేషన్‌లో మనం సినిమా రాగా, త్వరలో థ్యాంక్ యూ చిత్రం విడుదల కానుంది. ఇక మరో అప్ డేట్ విషయానికి వస్తే.. మహేశ్ బాబు […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : March 2, 2022 / 01:18 PM IST
    Follow us on

    Tollywood Trends : టాలీవుడ్ ట్రెండ్స్ నుంచి ప్రజెంట్ క్రేజీ అప్ డేట్స్ విషయానికి వస్తే.. నాగచైతన్య ప్రధాన పాత్రలో నటిస్తున్న దూత అనే వెబ్ సిరీస్ చిత్రీకరణ ప్రారంభమైంది. ఈ విషయాన్ని అతను సోషల్ మీడియాలో వెల్లడించాడు. థ్రిల్లర్ నేపథ్యంలో సాగే ఈ సిరీస్‌కు విక్రమ్ కె.కుమార్ దర్శకుడు. వీరిద్దరి కాంబినేషన్‌లో మనం సినిమా రాగా, త్వరలో థ్యాంక్ యూ చిత్రం విడుదల కానుంది.

    naga chaitanya dootha series

    ఇక మరో అప్ డేట్ విషయానికి వస్తే.. మహేశ్ బాబు నటించిన సర్కారు వారి నుంచి మరో పాట రిలీజ్ కానుంది. చంద్రబోస్ రాసిన ఈ పాటలో చాలా డెప్త్ ఉంటుందట. ఇక ఇప్పటికే ‘కళావతి’ పాట బాగా ఆకట్టుకుంది. సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు – సెన్స్ బుల్ డైరెక్టర్ పరశురామ్ కాంబినేషన్ లో రాబోతున్న ఈ ‘సర్కారు వారి పాట’ పై భారీ అంచనాలు ఉన్నాయి. అన్నట్టు కళావతి సాంగ్ లో మహేష్ సూపర్‌ స్టైలిష్‌ డ్యాన్స్‌ తో పాటు కీర్తి సురేష్‌ అభినయం కూడా బాగా ఆకట్టుకుంది.

    Also Read:  ఇప్పుడు చైతును అడక్కర్లేదుగా సామ్.. పెళ్లి చేసుకుందామా ?

    Mahesh Babu Kalavathi Song

    ఇక ఇంకో అప్ డేట్ ఏమిటంటే.. టాలీవుడ్‌లో నిరీక్షణ, లేడీస్ టైలర్ వంటి మూవీలతో మంచి పేరు తెచ్చుకున్న అలనాటి నటి అర్చన మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వనుంది. డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరీ హీరోగా నటిస్తున్న చోర్ బజార్ మూవీ ద్వారా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించనుంది.

    archana

     

    కాగా ఈ విషయాన్ని మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. జార్జ్‌రెడ్డి ఫేం జీవన్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో అర్చన కీలక పాత్రలో నటించనుందని సమాచారం. మరి ఆమె ఏ స్థాయిలో సక్సెస్ అవుతుందో చూడాలి.

    Also Read:  ప్రభాస్ ‘రాధేశ్యామ్’ పై నిక్ పౌల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

    Tags