Pakistani student using Indian flag : చావు భయం ఎంతటి వారినైనా మార్చివేస్తుంది. శత్రుదేశమైనా కూడా ఆ దేశపు జెండాను పట్టుకునేలా చేస్తుంది. తీవ్రంగా ద్వేషించే భారత్ ను ఇప్పుడు పాకిస్తాన్ విద్యార్థులు కీర్తించడమే ఇందుకు ఉదాహరణ.. ఉక్రెయిన్ నుంచి బయటపడడానికి ‘భారత్ మాతాకీ జై’ అంటూ పాకిస్తాన్ విద్యార్థులు నినాదాలు చేయడం పాకిస్తాన్ కు మింగుడు పడడం లేదు. పాక్ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ తల కొట్టేసినంత పని అవుతోంది.
ఉక్రెయిన్ నుంచి పలు దేశాల విద్యార్థులు బయటపడడానికి నానా కష్టాలు పడుతున్నారు. అయితే భారత ప్రభుత్వం మాత్రం తమ దేశ విద్యార్థులు, పౌరుల కోసం ‘ఆపరేషన్ గంగ’ చేపట్టింది. ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన భారతీయులను ఆరు విమానాల్లో ఢిల్లీకి తరలిస్తోంది. సోమవారం సాయంత్రం ఢిల్లీ చేరుకున్న విమానంలో 240 మంది విద్యార్థులు భారత్ కు చేరుకున్నారు. దీంతో ఇప్పటిదాకా ఉక్రెయిన్ నుంచి సురక్షితంగా భారత్ కు చేరుకున్న వారి సంఖ్య 1396కు చేరుకుంది. కేంద్రమంత్రివర్గంలోని నలుగురు మంత్రులు ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు చేరుకుంటున్నారు.
Also Read: Ukraine Crisis: కాలినడకన ఉక్రెయిన్ నుంచి పారిపోయిన స్టార్ హీరో
ఇక పాకిస్తాన్ విద్యార్థులు కూడా ఉక్రెయిన్ లో పెద్దసంఖ్యలో ఉన్నారు. కానీ ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం పాకిస్తానీ విద్యార్థులను పట్టించుకోవడం లేదంటూ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. దీంతో ఉక్రెయిన్ నుంచి బయటపడడానికి పాక్ విద్యార్థులు భారత జెండాను పట్టుకుంటున్నట్టు ఒక వీడియో వైరల్ గా మారింది.
తమ వాహనంపై భారత్ జెండాను పెట్టుకుంటే భారతీయులకు ఎలాంటి హానీ జరగదని రష్యన్ సైనికులు హామీ ఇవ్వడంతో పాక్ విద్యార్థులు ఇప్పుడు దీన్ని అవకాశంగా మలుచుకొని పాక్ విద్యార్థులు భారత జెండాలను పట్టుకొని శత్రుదేశమైనా సరే.. మనసు అంగీకరించకపోయినా సరే బతుకు భయానికి ‘భారత్ మాతాకీ జై’ అంటూ నినాదాలు చేస్తూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని భిక్కుబిక్కుంటూ గడుపుతున్నారు.
Also Read: ఉక్రెయిన్ లో భారత విద్యార్థి మరణానికి ముందు ఏం జరిగింది? చివరి మాటలు వైరల్.. షాకింగ్ నిజాలు
ప్రస్తుతం పాక్ విద్యార్థులు ఇలా నినాదాలు చేస్తున్న వీడియో ట్విట్టర్ లో ట్రెండ్ అవుతోంది. పాకిస్తానీ విద్యార్థులు భారత జెండాను ఉపయోగిస్తున్నారని స్వయంగా పాకిస్తానీ యాంకర్ చెప్పడం విశేషం.