https://oktelugu.com/

నవ్వులపాలైన పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్

కశ్మీర్ లో ఉగ్రదాడులకు తమకు సంబంధం లేదంటారు. భారత్ ప్రతిగా బాలాకోట్ పై దాడి చేసి ఉగ్రవాదులను చంపేస్తే అసలు అక్కడ ఉగ్రవాదులే లేరంటారు. తాజాగా పాకిస్తాన్ పార్లమెంట్ సాక్షిగా భారత్ పై ఉగ్రదాడిని ఓ ఎంపీ ఎలుగెత్తి చాటినప్పుడు పాకిస్తాన్ పరువు పోయింది. తాజాగా పాకిస్తాన్ ప్రధానమంత్రి కనీస అవగాహన లేకుండా వాగిన దానికి మరోసారి పాకిస్తాన్ ఇజ్జత్ ఖరాబ్ అయిపోయింది. మరిన్ని వార్తల కోసం అంతర్జాతీయ వార్తలు ఫ్రాన్స్ నుంచి తన రాయబారిని తిరిగి […]

Written By:
  • NARESH
  • , Updated On : November 1, 2020 / 08:43 AM IST
    Follow us on

    కశ్మీర్ లో ఉగ్రదాడులకు తమకు సంబంధం లేదంటారు. భారత్ ప్రతిగా బాలాకోట్ పై దాడి చేసి ఉగ్రవాదులను చంపేస్తే అసలు అక్కడ ఉగ్రవాదులే లేరంటారు. తాజాగా పాకిస్తాన్ పార్లమెంట్ సాక్షిగా భారత్ పై ఉగ్రదాడిని ఓ ఎంపీ ఎలుగెత్తి చాటినప్పుడు పాకిస్తాన్ పరువు పోయింది. తాజాగా పాకిస్తాన్ ప్రధానమంత్రి కనీస అవగాహన లేకుండా వాగిన దానికి మరోసారి పాకిస్తాన్ ఇజ్జత్ ఖరాబ్ అయిపోయింది.

    మరిన్ని వార్తల కోసం అంతర్జాతీయ వార్తలు

    ఫ్రాన్స్ నుంచి తన రాయబారిని తిరిగి పిలవాలని పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ తీర్మానం చేసింది. తమ రాయబారిని వెనక్కి పిలుస్తామంటూ పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ గారు ఫ్రెంచ్ అధ్యక్షుడిని హెచ్చరించారు కూడా. నిజానికి పాకిస్థాన్‌కు ఫ్రాన్స్‌లో రాయబారి లేనే లేడు. ఆ విషయం తెలుసుకోకుండా ప్రకటన చేసి పాక్ ప్రధాని ఇమ్రాన్ నవ్వులపాలయ్యారు.

    Also Read: సెక్యులరిజం పరిరక్షణకు ప్రపంచమంతా ఒకటి కావాలి

    తాజాగా ఫ్రాన్స్ దేశంలో ఉగ్రదాడి జరిగింది. ఓ చర్చిలో ఉగ్రవాదులు చొరబడి కత్తులతో చంపేశారు. ముగ్గురిని అత్యంత కిరాతకంగా తలలు నరికివేశారు. ఈ దారుణం పాకిస్తాన్ ప్రేరేపిత ఐఎస్ఐ అనుబంధ ఉగ్రవాదులే చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రార్థన కోసం చర్చికి వచ్చిన ఓ పెద్ద వయసు వ్యక్తిని దారుణంగా ఉగ్రవాదులు చంపేశారు. చర్చ్ వార్డెన్ తలను, మరో మహిళ తలను కూడా ఉగ్రవాది నరికివేశాడు. ఈ ఘటన జరిగిన వెంటనే నిందితుడిని అరెస్ట్ చేసినట్టు మేయర్ తెలిపారు. చర్చిలో ప్రార్థనలు జరుగుతుండగా ఓ మతం వారు ఆ మతం నినాదాలు చేసుకుంటూ ఈ మారణహోమం చేసినట్టు ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపారు. కొందరు ఎమర్జెన్సీ బటన్ నొక్కడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. పరుగులు తీస్తున్న ఉగ్రవాదిపై పోలీసులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో గాయపడిన అతడిని అరెస్ట్ చేసి ఆస్పత్రికి తరలించారు. పాకిస్తాన్ ప్రేరేపిత ఐఎస్ఐ చేసిందని తేలింది. ఇప్పటికే 15 రోజుల క్రితం పారిస్ సమీపంలో ఒక టీచర్ తలను టెర్రరిస్ట్ నరికివేశాడని.. ఇప్పుడు నోటెర్ డామ్బెసిలికాలోని అతిపెద్ద రోమన్ చర్చిలో ఉగ్రవాదులు దాడి చేసి ముగ్గురిని చంపారని నగర మేయర్ తెలిపారు.

    దీంతో ఫ్రాన్స్ అధ్యక్షుడు పాకిస్తాన్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. దుమ్మెత్తిపోశారు. పాకిస్తాన్ మతాన్ని ఉద్దేశించి దైవదూషణకు దిగారు. ఫ్రెంచ్ అధ్యక్షుడి దైవదూషణకు నిరసనగా ఫ్రాన్స్‌లోని తన రాయబారిని పాకిస్తాన్ వెనక్కి పిలిపించాలని పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం ద్వారా ప్రభుత్వాన్ని కోరింది.

    Also Read: చరిత్ర: దీపావళి.. టపాసులు.. ఎప్పుడు, ఎక్కడ పుట్టాయి?

    అయితే మూడు నెలల క్రితమే పాక్ రాయబారి ఫ్రాన్స్‌ను విడిచిపెట్టి, చైనాకు రాయబారిగా నియమించారు. అప్పటి నుంచి పాకిస్తాన్ కు ఫ్రెంచ్ రాజధానిలో రాయబారి లేరు. అతని స్థానంలో విదేశాంగ కార్యాలయం మరొకరిని నియమించలేదు. ఆ విషయం ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కి తెలియదు. కనీసం అధికారులు కూడా చెప్పలేదు. జాతీయ అసెంబ్లీ తీర్మానం కూడా చేయడంతో ప్రపంచ దేశాల ఎదుట పాకిస్తాన్ నవ్వులపాలైంది.