https://oktelugu.com/

మంత్రి రాసలీలలు లీక్: అందుకే ఆ మంత్రిని టార్గెట్‌ చేశారా.?

తెలంగాణలో ఓ మంత్రిపై రాసలీలల వార్తలు ప్రస్తుతం జోరుగా నడుస్తున్నాయి. తెలంగాణ కేబినెట్ లోని ఓ బీసీ మంత్రి ఓ సినీ నటిపై మోజుపడ్డాడని.. ఓ యువతి ద్వారా సదరు సినీ నటితో చాటింగ్‌ చేయించాడని, అయితే ఆ సినీ నటి ఛాటింగ్‌ మెసేజ్‌తో సహా మొత్తం వివరాలన్నీ గుట్టు రట్టు చేయడం కలకలం రేపింది. దీన్ని దొరికిందే తడువుగా టీవీ ఛానెళ్లు, సోషల్‌ మీడియా హోరెత్తిస్తోంది. అయితే ఈ వార్తలపై టీఆర్‌ఎస్‌ నాయకులు ఏవిధంగా స్పందించడం […]

Written By: , Updated On : November 1, 2020 / 09:03 AM IST
Follow us on

 Is that why the minister was targeted

తెలంగాణలో ఓ మంత్రిపై రాసలీలల వార్తలు ప్రస్తుతం జోరుగా నడుస్తున్నాయి. తెలంగాణ కేబినెట్ లోని ఓ బీసీ మంత్రి ఓ సినీ నటిపై మోజుపడ్డాడని.. ఓ యువతి ద్వారా సదరు సినీ నటితో చాటింగ్‌ చేయించాడని, అయితే ఆ సినీ నటి ఛాటింగ్‌ మెసేజ్‌తో సహా మొత్తం వివరాలన్నీ గుట్టు రట్టు చేయడం కలకలం రేపింది. దీన్ని దొరికిందే తడువుగా టీవీ ఛానెళ్లు, సోషల్‌ మీడియా హోరెత్తిస్తోంది. అయితే ఈ వార్తలపై టీఆర్‌ఎస్‌ నాయకులు ఏవిధంగా స్పందించడం లేదు. ఆరోపణలు ఖండించడమో లేదా చర్యలు తీసుకుంటామనో ఏదో ఒకటి ప్రకటన చేయకపోవడం పలు అనుమానాలకు దారి తీస్తోంది. అంతేకాకుండా ఈ వార్తలపై ఇంటలిజెన్స్‌ రంగాలు స్వయంగా రంగంలోకి దిగినట్లు కూడా తెలుస్తోంది.

ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఆ మంత్రి రాసలీలలపై టీఆర్ఎస్ అధిష్టానం స్పందించకపోవడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది.. ఇటీవల ఎన్నికల్లో గెలిచిన టీఆర్ఎస్ లోని ప్రముఖ వ్యక్తికి మంత్రి పదవి ఇప్పించడానికే ఈ బీసీ మంత్రిని టార్గెట్‌ చేశారంటూ పలు మీడియాల్లో కథనాలు వెలువడుతున్నాయి. ఆ ప్రముఖ వ్యక్తికి మంత్రి పదవి ఇవ్వాలంటే ఏ మంత్రిని తప్పించే అవకాశం లేదు. ఇందుకోసం వేచి చూస్తున్న వారికి ఇదే అవకాశంగా చూసుకొని ఆ మంత్రిని రాసలీలల ఉదంతంలో పదవి నుంచి తప్పించి ఎన్నికైన వ్యక్తికి మంత్రి పదవి కట్టబెట్టే అవకాశాలున్నాయని ప్రచారం సాగుతోంది.

అయితే ఇప్పటికే  అధికార టీఆర్ఎస్ లో అగ్ర సామాజికవర్గం నుంచి ఎందరో మంత్రి పదవుల్లో ఉన్నారు.  ఇప్పుడు ఎన్నికైన వ్యక్తి కూడా అదే సామాజికవర్గం. ఆ వ్యక్తి కోసం బీసీ మంత్రిని టార్గెట్ చేశారనే ప్రచారం సాగుతోంది. ఇక బీసీ మంత్రి చేసిందేం తక్కువ కాదు. సినీ నటితో రాసలీలలు చేసి తన గోతిని తనే తవ్వుకున్నాడు.

సో ఈ వ్యవహారం టీఆర్ఎస్ కలిసి వచ్చిందని అంటున్నారు. కీలక వ్యక్తికి మంత్రి పదవి కట్టబెట్టడం కోసం సదరు ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రిని తప్పిస్తే విమర్శల పాలు కాక తప్పదని కొందరు అభిప్రాయపడుతున్నారు. బీసీలకు మంత్రి పదవులు ఇచ్చామని చెప్పుకున్న వారిలో ఆ మంత్రిని ఉదాహరణగా టీఆర్ఎస్ చెప్పేది. కానీ ఇప్పుడు తప్పు చేసిన  ఆ మంత్రి పదవి పోతుందా..? పోదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఇదిలా ఉండగా మహిళా కోటలో తెలంగాణ కేబినెట్ లో మంత్రి పదవులు తక్కువగా ఉన్నాయి. తాము మహిళలకు కూడా మంత్రి పదవులు ఇచ్చామని చెప్పుకోవడానికి  కూడా ఈ ప్రముఖ వ్యక్తికి ఈ శాఖను అప్పచెబుతారని అంటున్నారు.