పాకిస్తాన్ లో కరోనా

ప్రపంచం అంతా కరోనా వైరస్ దాటికి విలవిల్లాడి పోతోంది. చైనాలో మొదలైన ఈ మహమ్మారి అమెరికా , ఇటలీ , స్పెయిన్ , ఇరాన్ , దక్షిణ కొరియా, జర్మనీ వంటి దేశాలను వణికిస్తోంది ఇక ఇండియా లో కూడా కరోనా ప్రభావం బాగానే ఉంది అని చెప్పాలి. ఇంతవరకు సుమారు 1100 మందికి పైగా కరోనా బాధితులు లెక్క తేలగా 31 మంది దాకా మరణించారు .ఇదిలా ఉండగా మన దాయాది దేశమైన పాకిస్తాన్ లో […]

Written By: admin, Updated On : March 31, 2020 12:32 pm
Follow us on

ప్రపంచం అంతా కరోనా వైరస్ దాటికి విలవిల్లాడి పోతోంది. చైనాలో మొదలైన ఈ మహమ్మారి అమెరికా , ఇటలీ , స్పెయిన్ , ఇరాన్ , దక్షిణ కొరియా, జర్మనీ వంటి దేశాలను వణికిస్తోంది ఇక ఇండియా లో కూడా కరోనా ప్రభావం బాగానే ఉంది అని చెప్పాలి. ఇంతవరకు సుమారు 1100 మందికి పైగా కరోనా బాధితులు లెక్క తేలగా 31 మంది దాకా మరణించారు .ఇదిలా ఉండగా మన దాయాది దేశమైన పాకిస్తాన్ లో కూడా కరోనా వైరస్ ప్రభావం బాగానే ఉంది.

కరోనా దెబ్బకు మన పొరుగున ఉన్న పాకిస్తాన్ లో ఇప్పటివరకు 1603 మంది పాజిటివ్ గా తేలగా 17 మంది మరణించి నట్టు తెలుస్తోంది. మరోవైపు దక్షిణ ఆసియా దేశాల్లో ఒక్క పాకిస్తాన్ లోనే కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్నట్టు కూడా తెలుస్తోంది. కాగా పాకిస్తాన్ దేశం లో విపత్కర పరిస్థితులు రోజు రోజుకి పెరుగుతున్నప్పటికీ ఆ దేశం మొత్తం లాక్ డౌన్ ప్రకటించ లేదు. దాన్ని కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితం చేశారు. నిజానికి పాకిస్తాన్ లోని వాస్తవ పరిస్థితులను అక్కడి ప్రభుత్వాలు కప్పి పుచ్చుతున్నాయి. అందులో ఎటువంటి సందేహం అక్కర లేదు .