Pakistan : ప్రపంచ దేశాల్లారా ఇదిగో సాక్ష్యం.. పాకిస్తాన్‌లో సైన్యానికి, టెర్రరిస్టులకు మధ్య ఎలాంటి తేడా లేదనడానికి ఇదో ప్రత్యక్ష నిదర్శనం. ఇటీవల వెలుగులోకి వచ్చిన ఒక వీడియోలో పాకిస్తాన్ ఆర్మీకి చెందిన ఉన్నతాధికారులు బహిరంగంగా టెర్రరిస్టుల అంత్యక్రియల్లో పాల్గొనడం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ దృశ్యం పాకిస్తాన్ నిజ స్వరూపాన్ని ప్రపంచానికి చాటి చెబుతోంది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ అసలు ముఖం మరోసారి బయటపడింది.
Also Read : యుద్ధ భయంలో పాకిస్తాన్..ఏటీఎంలు ఖాళీ.. స్టాక్ మార్కెట్ పతనం
ఈ వీడియోలో కనిపిస్తున్న దృశ్యాలు అత్యంత ఆందోళనకరమైనవి. పాకిస్తాన్ ఆర్మీకి చెందిన యూనిఫామ్ ధరించిన అధికారులు, టెర్రరిస్టుల అంతిమ యాత్రలో గౌరవంగా నిలబడి ఉండడం, వారి అంత్యక్రియల కార్యక్రమాలలో పాల్గొనడం స్పష్టంగా కనిపిస్తోంది. ఇది కేవలం సాధారణ సైనికులు పాల్గొనడం కాదు, ఉన్నత స్థాయి అధికారులు కూడా ఉగ్రవాదులకు సెల్యూట్ చేస్తూ వారి మృతికి సంతాపం తెలుపుతున్నట్లు కనిపిస్తోంది.
టెర్రరిస్టులకు పాకిస్తాన్ ఆర్మీ బహిరంగంగా మద్దతు తెలుపుతున్న ఈ దృశ్యం, అంతర్జాతీయ సమాజానికి ఒక హెచ్చరిక లాంటింది. ఉగ్రవాదంపై పోరాడుతున్నామని ప్రపంచానికి చెబుతున్న పాకిస్తాన్, వాస్తవానికి ఉగ్రవాదులను ప్రోత్సహిస్తోందని ఈ వీడియో స్పష్టం చేస్తోంది. ఇలాంటి ఘటనలు ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా పాకిస్తాన్ ఆర్మీ టెర్రరిస్టులకు ఆశ్రయం కల్పిస్తున్నట్లు, వారికి ట్రైనింగ్ ఇస్తున్నట్లు అనేక నివేదికలు వెలువడ్డాయి. అంతర్జాతీయ వేదికలపై ఉగ్రవాదంపై పోరాటం గురించి మాట్లాడే పాకిస్తాన్, తెర వెనుక ఉగ్రవాదులకు అన్ని విధాలా సహాయం చేస్తూ వస్తోంది. ఈ వీడియోతో ఆ వాదనలకు మరింత బలం చేకూరినట్లయింది.
Also Read : కుక్కలు అరిచినట్టు సోషల్ మీడియాలో ఎవరు అరవొద్దు : పవన్ వార్నింగ్
భారత్ ఎప్పటినుంచో పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని ఆరోపిస్తోంది. సరిహద్దుల్లో చొరబాట్లు, దాడులు చేయిస్తుంది పాకిస్తాన్ ఆర్మీ శిక్షణ పొందిన టెర్రరిస్టులే అని అనేక సార్లు ప్రూఫ్ లతో సహా తెలిపింది. ఇప్పుడు ఈ వీడియో భారత వాదనలకు మరింత బలం చేకూరుస్తోంది. పాకిస్తాన్ ఆర్మీ, టెర్రరిస్టులకు మధ్య ఉన్న అవినాభావ సంబంధాన్ని ఈ వీడియో కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది.
Dear world, this video is from Pakistan. Pakistani Army officers are openly participating in the funeral of terrorists…
Do you need more proof that in Pakistan, there’s no difference between the Army and terrorists? pic.twitter.com/RxVajNhfJt
— Mr Sinha (@MrSinha_) May 7, 2025