Homeఅంతర్జాతీయంPakistan Economic Crisis : శ్రీలంకే కాస్త నయం.. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో పాకిస్తాన్

Pakistan Economic Crisis : శ్రీలంకే కాస్త నయం.. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో పాకిస్తాన్

Pakistan Economic Crisis : తినేందుకు తిండి లేదు. చేసేందుకు పనిలేదు.. ఇతర దేశాలు నమ్మడం లేదు.. అప్పులు పుట్టే అవకాశం లేదు. ఒక్కొక కంపెనీలు దేశం విడిచిపెట్టి వెళ్లిపోతున్నాయి.. ఇది ప్రస్తుతం పాకిస్తాన్లో పరిస్థితి.. రేపటి నాడు ఎలా ఉంటుందో వాళ్లకు అంతు పట్టడం లేదు.. గ్యాస్ సిలిండర్లు సరఫరా చేసే స్తోమత లేక అక్కడి ప్రభుత్వం కవర్లలో గ్యాస్ నింపి ప్రజలకు విక్రయిస్తోంది.. అది కూడా బుక్ చేసుకున్న నెల రోజులకు. పాలక ప్రభుత్వం కేబినెట్ సమావేశాన్ని మధ్యాహ్నపు వెలుతురులో నిర్వహిస్తోంది అంటే అక్కడ విద్యుత్ కొరత ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.. మొన్నటిదాకా శ్రీలంక సంక్షోభాన్నే మనం కథలు కథలుగా చదువుకున్నాం. కానీ పాకిస్తాన్ లో పరిస్థితి ఇప్పుడు అంతకుమించి అనేలా ఉంది.

 

-తీవ్ర ఆర్థిక సంక్షోభం

పాకిస్తాన్ ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉంది.. ప్రభుత్వం దగ్గర నగదు నిల్వలు తగినంతగా అందుబాటులో లేవు.. క్రూడ్ ఆయిల్ దిగుమతి బిల్లు రోజురోజుకు పెరిగిపోతున్నది.. దేశంలో డాలర్ రిజర్వ్ తగినంతగా లేదు.. కాబట్టి ఇంధనం వాడకం మీద ప్రభుత్వం ఆంక్షలు విధిస్తోంది.. ఇటీవల అక్కడి ప్రభుత్వం క్యాబినెట్ మీటింగ్ పెట్టింది.. ఆ సమయంలో విద్యుత్ సరఫరా లేదు.. దీంతో బయట వెలుతురులో నిర్వహించాల్సి వచ్చింది. ఇక అన్ని మార్కెట్లను రాత్రి 8 ;30 నిమిషాలకు మూసివేస్తున్నారు. దీనివల్ల విద్యుత్ ఆదా అవుతుందనేది అక్కడి ప్రభుత్వ ఆలోచన. ఇటీవల ఆ నిబంధనను అమలులోకి తెచ్చారు. దీనివల్ల 60 బిలియన్ల పాకిస్తాన్ రూపాయల నగదు ఆదా అవుతుందనేది ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. వివిధ ఫంక్షన్ హాల్స్ కూడా రాత్రి 8:30కే మూసివేయాలి.. అంతేకాదు ఎక్కువ వెలుగునిచ్చే బల్బుల తయారీ ప్రక్రియను కూడా ఫిబ్రవరి 1 నుంచి నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.. అలాగే ఎక్కువ విద్యుత్ వినియోగించుకునే సీలింగ్, పెడస్టల్ ఫ్యాన్లు తయారీని ప్రభుత్వం నిషేధించింది.. ఈ ఏడాది చివరికల్లా స్టోరేజీ వాటర్ హీటర్ల తయారీని కూడా నిషేధించనుంది. గ్యాస్ ద్వారా వినియోగించే వాటర్ హీటర్ల మీద కూడా నిషేధం విధించనుంది.. ఈ చర్యల వల్ల 90 బిలియన్ల పాకిస్తాన్ రూపాయల నగదు ఆదా అవుతాయని ఆ దేశపు ప్రభుత్వం భావిస్తోంది.. వీలున్నంతవరకు ప్రభుత్వ ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం చేయాల్సి ఉంటుంది. దీనివల్ల ఉద్యోగుల పెట్రోల్, డీజిల్ వాడకం తగ్గుతుంది. ఇక గత ఏడాది నుంచి దేశంలో లోడ్ షెడ్డింగ్ అమలు చేస్తున్నారు. దీనివల్ల పారిశ్రామిక ప్రగతి దారుణంగా కుంటుపడింది. కేవలం పాకిస్తాన్ మాత్రమే కాదు పొరుగున ఉన్న శ్రీలంక, బంగ్లాదేశ్ ఈ విధానాలను అమలు చేస్తున్నాయి. ఇక ప్రస్తుతం పాకిస్తాన్ వద్ద 6.7 బిలియన్ డాలర్లు మాత్రమే ఉన్నాయి.. ఇవి ఒక నెల దిగుమతుల చెల్లింపులకు మాత్రమే సరిపోతాయి..

-గోటి చుట్టు రోకటి పోటు

ప్రస్తుతం పాకిస్తాన్ పరిస్థితి గోటి చుట్టు రోకటి పోటులా మారింది.. తన షరతులకు లోబడి పన్నులను పెంచకపోవడంతో ప్రపంచ బ్యాంకు తన తదుపరి లోన్ ఇన్స్టాల్మెంట్ ఇచ్చేందుకు వెనకాడుతోంది. ఒకవేళ ప్రభుత్వం ధరలు పెంచితే అది తీవ్ర ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది. కానీ పన్నులు పెంచకపోతే మా అప్పు తీర్చడం కష్టమవుతుందని ప్రపంచ బ్యాంకు అధికారులు హెచ్చరిస్తున్నారు.

-దారి మళ్లించింది

ఏడాది పాకిస్తాన్లో భారీగా వరదలు వచ్చాయి.. మూడో వంతు భూభాగం వరద నీటిలో చిక్కుకుని పోయింది. 37 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లింది. వరద బాధితుల కోసం ప్రపంచ బ్యాంకు ఇచ్చిన తాత్కాలిక ఆర్థిక సహాయానికి సంబంధించి ప్రభుత్వం సరైన లెక్కలు ఇవ్వలేదు.. పైగా ఈ నిధులను ప్రభుత్వం పక్కదారి పట్టించిందని ప్రపంచ బ్యాంకు అనుమానం వ్యక్తం చేస్తున్నది. దీంతో అప్పు కింద ఇవ్వాల్సిన తదుపరి వాయిదాను ఆపేసింది.. తమ దేశం కూడా ఏదో ఒక రోజు శ్రీలంకలా దివాలా తీస్తుందని పాకిస్తాన్ ఆర్థిక మంత్రి అన్నాడు అంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.. పాకిస్తాన్ లో గ్యాస్ సిలిండర్ ధర 3600 పాకిస్తాన్ రూపాయలుగా ఉంది.. అది బుక్ చేసిన వెంటనే డెలివరీ ఇవ్వడం లేదు.. 30 రోజులు పడుతున్నది. బ్లాక్ మార్కెట్లో అయితే 6000 దాకా చెల్లించాల్సి వస్తోంది. ఇదే కొనసాగితే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ మీద భారత్ దాడి చేస్తే తానంతట తానుగానే పీఓకే ను అప్పజెప్పే పరిస్థితి వస్తుంది. మరోవైపు పాకిస్తాన్ ప్రజలు ఎన్ని కష్టాలు పడుతున్నప్పటికీ ఆ దేశ సైనిక జనరల్స్ మాత్రం స్థిరాస్తి వ్యాపారం చేసుకుంటూ స్వర్గసుఖాలను అనుభవిస్తున్నారు. ఇక పాకిస్తాన్ సైన్యం బడ్జెట్లో తమకు కేటాయించిన దానికంటే ఎక్కువగానే తీసుకుంటున్నది. పాపం పాకిస్తాన్… ఇప్పుడు ఆ దేశాన్ని ఎవరూ కాపాడలేరు చివరికి ఆ అల్లా కూడా..

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular