Delhi Car Blast 2025: నవంబర్ 10, 2025న దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట వద్ద కారుబాబు పేలింది. ఈ ఘటనలో 12 మంది మరణించారు. 20 మంది వరకు గాయపడ్డారు. విచారణ తర్వాత ఇది సాధారణ పేలుడు కాదని, ఆత్మాహుతి దాడి అని నిర్ధారణ అయింది. దీంతో భారత్ ఈ కుట్ర వెనుక ఎవరు ఉన్నారనే కూపీ లాగుతోంది. ఈ క్రమంలో పాకిస్తాన్ హస్తం బయటపడింది. జైస్ ఎ మహ్మద్ సంస్థతో పేలుడు కుట్రదారులకు లింకులు ఉన్నట్లు గుర్తించింది. 2021–22 సంవత్సరాల్లో షాహిన్ షాహిద్ టర్కీకి వెళ్లి జైష్ ఎ మహ్మద్ నాయకులతో సంబంధాలు పెంచుకొని ఆఫ్గానిస్తాన్, పాకిస్తాన్ మార్గాలుగా భారత్‌కు దాడులు సిధ్దం చేసుకున్నారు. ఇది టర్కీ సాయంతో పాకిస్తాన్ కుట్రగా తెలుస్తోంది.
తాజాగా పీవోకే ప్రధాని ప్రకటన..
ఒకవైపు దర్యాప్తు కొనసాగుతోంది. ఈ క్రమంలో సంబురాల్లో ఉన్న పాకిస్తాన్.. తన కుట్రను బయటపెడుతోంది. తాజాగా పాక్ ఆక్రమిత కశ్మీర్ పీపుల్സ് డెమోక్రాటిక్ పార్టీ (పీవోకే) ప్రధానులు చౌరదీ అన్వర్ ఉల్ హఖ్ దాడులు తమ పనే అని ప్రకటించాడు. ‘మేము కశ్మీర్ లో ఎక్కడైనా దాడులు చేస్తూనే ఉంటాం‘ అని ప్రకటించాడు. గతంలోనే 2025 ఏప్రిల్ 22న పహల్గాం ప్రాంతంలో 26 యాత్రికులు చనిపోవటంతో ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. భారత ప్రభుత్వం ఈ దాడులకు సంబంధించి కఠిన చర్యలు తీసుకునే స్పష్టమైన సంకల్పంతో ఉంది. ఉగ్రవాదులకు మద్దతు ఇచ్చే దేశాలపై కూడా కఠిన పాలన చేపడతామని ప్రకటించింది. తద్వారా ఆపరేషన్ సిందూర్ 2.0 ప్రారంభం అయే అవకాశం ఉన్న ప్రచారాలు జోరుగా ఉన్నాయి.
పాకిస్తాన్ సన్నద్ధం..
పాక్ రక్షణ మంత్రి క్వాజా ఆసిఫ్ యుద్ధానికి సిద్ధంగా ఉండాలంటూ పిలుపునిస్తూ వర్ధిల్లుతున్న ఉద్రిక్తతల మధ్య, దేశ భద్రతా శాఖలు అప్రమత్తంగా వ్యవహరించుకుంటున్నాయి. ఆపరేషన్ సిందూర్ 2.0 ఎప్పుడైనా ప్రారంభం కావచ్చని పాకిస్తాన్‌కు అర్థమైంది. ప్రస్తుతం ఆపరేషన్ సిందూర్ హోల్డ్‌లో మాత్రమే ఉంది. 2.0 ప్రారంభిస్తే పాకిస్తాన్ భూమిపై లేకుండా పోతుంది.