Target Asim Munir: పాకిస్తాన్ ఉగ్రవాద దేశం.. ఇదేదో భారత్ చేస్తున్న ఆరోపణ కాదు. అప్పుడప్పుడు లాడెన్ ను లేపడానికి అమెరికా ఆపరేషన్ మొదలుపెట్టింది.. అమెరికా చేసిన ఆపరేషన్ వల్ల లాడెన్ పాకిస్తాన్లో అంతమయ్యాడు.. దీనిని బట్టి పాకిస్థాన్లో ఎలాంటి వ్యక్తులు ఉంటున్నారు.. వారి వల్ల ప్రపంచం ఏ స్థాయిలో ఇబ్బంది పడుతోంది.. ఇటువంటి వ్యక్తులకు ఆశ్రయం ఇచ్చి ఎటువంటి లాభం పొందుతోంది.. అనే విషయాలు ప్రపంచానికి దశాబ్దాల క్రితమే తెలిశాయి. ఇప్పుడు కొత్తగా పాకిస్తాన్ గురించి ప్రపంచానికి తెలియాల్సిన అవసరం లేదు. పైగా ప్రపంచమే పాకిస్తాన్ దేశానికి దూరంగా ఉండాలని అనుకుంటుంది. అంతటి మైక్రోసాఫ్ట్ సంస్థ కూడా పాకిస్తాన్ దేశానికి గుడ్ బై చెప్పింది అంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
పాకిస్తాన్ దేశంలో పేరుకు ప్రధానమంత్రి ఉంటాడు. అధ్యక్షుడు కూడా ఉంటాడు. కానీ వారు ప్రభుత్వ విధానాలలో జోక్యం చేసుకోలేరు.. వారు చేసేది మొత్తం కేవలం డబ్బులు దాచుకోవడం.. పన్నులు విపరీతంగా వేసి ప్రజలను ఇబ్బంది పెట్టడం.. తమ పదవి పోయే పరిస్థితి వస్తే దోచుకున్న డబ్బులతో అరబ్ లేదా ఇతర దేశాలకు వెళ్లిపోవడం.. పాకిస్తాన్ దేశంలో ఇంతవరకు పని చేసిన అధ్యక్షులు.. ప్రధాన మంత్రులు అలానే వెళ్లిపోయారు. పాకిస్తాన్ దేశంలో సైనికాధిపతులకే అధికారం ఉంటుంది. ఆర్మీ మీద ఉగ్రవాద సంస్థలకు విపరీతమైన పట్టు ఉంటుంది.. అందువల్లే ఆర్మీ చీఫ్ చెప్పినట్టుగానే పాకిస్తాన్లో జరుగుతుంటుంది.. ప్రపంచ దేశాలు ఏ స్థాయిలో వ్యతిరేకించినప్పటికీ పాకిస్తాన్ మాత్రం తన ధోరణి మార్చుకోలేదు.. మార్చుకోదు కూడా.
ప్రస్తుతం పాకిస్తాన్ ఆర్మీకి అధిపతిగా అసిమ్ మునీర్ కొనసాగుతున్నాడు.. ఇతడు అత్యంత కరుడుగట్టిన వ్యక్తిత్వమున్నవాడు.. ఆపరేషన్ సిందూర్ లో భాగంగా భారత్ ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేస్తే.. వాటి పునర్నిర్మాణానికి ప్రభుత్వ ఖజానా నుంచి ఇచ్చాడు. అంతేకాదు ఉగ్రవాదుల అంత్యక్రియలలో మునీర్ పాల్గొన్నారు. అంతేకాదు ఆ మధ్య అమెరికా కంపెనీలతో ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నాడు.. వాస్తవానికి ఇలాంటి పని అధ్యక్షుడు లేదా ప్రధానమంత్రి చేయాలి. కానీ ఆర్మీ చీఫ్ చేశాడంటే పాకిస్తాన్లో అతడికి ఉన్న పరపతి ఏమిటో అర్థం చేసుకోవచ్చు.. అసిం మునీర్ భారత్ ప్రస్తావన వస్తే తోక తొక్కిన తాచులాగా లేస్తాడు.. అతని వల్లే ప్రస్తుతం భారత్ లో ఇటువంటి దారుణాలు జరుగుతున్నాయి..
మునీర్ అడ్డు తొలగితేనే భారత్ ప్రశాంతంగా ఉండగలుగుతుంది.. సరిగా ఇప్పుడు భారత్ ఎదుర్కొన్న పరిస్థితిని ఒకప్పుడు ఇజ్రాయిల్ కూడా చవిచూసింది.. దీంతో చుట్టుపక్కల ఉన్న దేశాలకు చుక్కలు చూపించింది. దాడులకు పాల్పడింది.. శత్రు శేషం లేకుండా చేసుకుంది. ఇప్పుడు భారత్ కూడా అదే విధంగా చేస్తే.. మునీర్ ను లేపేస్తే పాకిస్తాన్ చచ్చి ఊరుకుంటుంది. అంతేకాదు పాకిస్తాన్ ఆక్రమిస్తే కాశ్మీర్ కూడా భారత్ సొంతమవుతుంది.