Ambati Rambabu vs Police: సరిగ్గా రెండు రోజుల క్రితం వైసిపి కీలక నాయకుడు, మాజీమంత్రి అంబటి రాంబాబు తన యూట్యూబ్ చానల్లో ఒక వీడియోని విడుదల చేశారు.. ఆ వీడియోలో ఉన్న దృశ్యాల ప్రకారం ఆయన తిరుమల తిరుపతి వెళ్లారు.. స్వామివారి దర్శనం తర్వాత వెంగమాంబ అన్నదాన సత్రంలో భోజనం చేశారు.. ఆ భోజనం చాలా బాగుందని.. నాణ్యత అద్భుతంగా ఉందని.. ప్రతిరోజు 90000 మంది భోజనం చేస్తున్న ఈ క్షేత్రంలో.. పరిశుభ్రత సూపర్ అని వ్యాఖ్యానించారు.
అంబటి రాంబాబు నుంచి ఆతరహా వ్యాఖ్యలను ఎవరూ ఊహించలేదు. ఎందుకంటే అంబటి రాంబాబు వైసీపీలో సీనియర్ నాయకుడు.. పైగా కూటమి ప్రభుత్వంపై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.. ఏమాత్రం అవకాశం దొరికిన సరే ఆరోపణలు చేస్తున్నారు.. అటువంటి అంబటి రాంబాబు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండి.. కూటమి ప్రభుత్వం పర్యవేక్షిస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానం గురించి సానుకూలంగా మాటలు మాట్లాడడం ఒకరకంగా ఆశ్చర్యం అనిపించింది.. దీనిని కూటమి ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంది. కూటమి ప్రభుత్వానికి సంబంధించిన అనుకూల మీడియా కూడా గొప్పగా రాసింది..
ఈ వీడియో విడుదల చేసిన ఒకరోజు వ్యవధిలోనే అంబటి రాంబాబు మారిపోయారు.. తన ఒరిజినల్ మొత్తాన్ని బయటపెట్టారు.. కూటమి ప్రభుత్వం మీద తనకు ఏమాత్రం సింపతి లేదని.. తాను ప్యూర్ వైసిపి నాయకుడిని నిరూపించారు రాంబాబు. మెడికల్ కాలేజీలలో పీపీపీ విధానానికి వ్యతిరేకంగా కొంతకాలంగా వైసిపి ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే.. పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు గుంటూరులో అంబటి రాంబాబు ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు నిరసన చేపట్టారు. ఈ క్రమంలో అంబటి రాంబాబును, వైసిపి నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరు పట్ల అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబటి రాంబాబు ఏమాత్రం తగ్గకపోవడంతో పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో అంబటి రాంబాబుకు, పట్టాభిపురం సిఐ వెంకటేశ్వర్లు కు తీవ్రస్థాయిలో గొడవ జరిగింది. ఒక దశలో వెంకటేశ్వర్లు అంబటి రాంబాబుపై తీవ్రస్థాయిలో అగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా సర్కులేట్లో ఉంది.
రాంబాబు పోలీసుల మీద ఆగ్రహం వ్యక్తం చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా ఒక సీఐ స్థాయి అధికారితో ఆయన ఇదేవిధంగా దురుసుగా ప్రవర్తించారు. చివరికి పోలీసు కేసు నమోదు చేయడంతో సైలెంట్ అయిపోయారు. మళ్లీ ఇన్ని రోజులకు ఒక సీఐ స్థాయి అధికారిపై అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే స్థాయిలో సిఐ కూడా రెస్పాండ్ కావడంతో అంబటి వెనక్కి తగ్గారు. కాకపోతే ఈ ఘటనకు సంబంధించిన వీడియోను కూటమి మీడియాలో విపరీతంగా సర్కులేట్ చేస్తున్నారు. అధికారం కోల్పోవడంతో అంబటి రాంబాబు విపరీతమైన ఫ్రస్టేషన్ లో ఉన్నారని.. దానిని పోలీసుల మీద చూపిస్తున్నారని విమర్శిస్తున్నారు.
గుంటూరులో అంబటి vs పోలీసులు
గుంటూరు నగరంలో మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్న వైసీపీ నేతలను అడ్డుకున్న పోలీసులు.
ఈ క్రమంలో పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన అంబటి… అంబటి రాంబాబు పై ఫైర్ అయిన పట్టాభిపురం సీఐ వెంకటేశ్వర్లు. pic.twitter.com/oLHkWcPe9c
— greatandhra (@greatandhranews) November 12, 2025