పలుకుబడి ఉంటే పద్మ పురస్కారమా..?

దేశంలో పద్మ పురస్కారాలే అత్యున్నత పురస్కారాలు. ఏదైనా రంగంలో విశిష్టత చాటిన వారికి కేంద్రం పద్మ పురస్కారాలైన పద్మశ్రీ, పద్మభూషణ్‌, పద్మవిభూషణ్‌ లాంటి పురస్కారాలు ఇస్తుంటుంది. పర్టిక్యులర్ రంగంలో విశేషంగా సేవలు చేసిన వారికి ఈ పురస్కారాలు దక్కుతుంటాయి. అయితే.. రానురాను పద్మ పురస్కారాల ప్రభ మసకబారుతున్నట్లుగా విమర్శలు వస్తున్నాయి. పద్మ పురస్కారాలకు విలువ తగ్గిపోతోందా..? అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. Also Read: కేంద్రంపై దండెత్తుకొస్తున్న రైతులు.. తీవ్ర ఉద్రిక్తత నిజానికి ఈ పురస్కారాలను ప్రారంభించింది కూడా […]

Written By: Srinivas, Updated On : January 26, 2021 3:54 pm
Follow us on


దేశంలో పద్మ పురస్కారాలే అత్యున్నత పురస్కారాలు. ఏదైనా రంగంలో విశిష్టత చాటిన వారికి కేంద్రం పద్మ పురస్కారాలైన పద్మశ్రీ, పద్మభూషణ్‌, పద్మవిభూషణ్‌ లాంటి పురస్కారాలు ఇస్తుంటుంది. పర్టిక్యులర్ రంగంలో విశేషంగా సేవలు చేసిన వారికి ఈ పురస్కారాలు దక్కుతుంటాయి. అయితే.. రానురాను పద్మ పురస్కారాల ప్రభ మసకబారుతున్నట్లుగా విమర్శలు వస్తున్నాయి. పద్మ పురస్కారాలకు విలువ తగ్గిపోతోందా..? అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Also Read: కేంద్రంపై దండెత్తుకొస్తున్న రైతులు.. తీవ్ర ఉద్రిక్తత

నిజానికి ఈ పురస్కారాలను ప్రారంభించింది కూడా ఇదే స్పూర్తితో. కానీ.. ప్రభుత్వ పెద్దల అండ ఉంటే చాలు పురస్కారం దక్కించుకోవచ్చనే ఆరోపణలు పెరిగిపోతున్నాయి. గతంలో ఇటువంటి పురస్కారాలను అందుకున్న వారిపై ఎంతటి నిరసనలు వచ్చాయో అందరికీ తెలిసిందే. కేంద్రం తాజాగా ప్రకటించిన పద్మవిభూషణ్ పురస్కారాలపైనా ఇలాంటి ఆరోపణలే మొదలయ్యాయి. పద్మవిభూషణ్ అందుకున్న చాలా మందిలో రాజకీయనేతలు ఉండటమే ఇందుకు కారణం.

కేంద్ర మాజీ మంత్రి రాం విలాస్ పాశ్వాన్, సుమిత్రా మహాజన్, కేశూభాయ్ పటేల్, తరుణ్ గొగోయ్, జపాన్ మాజీ ప్రధానమంత్రి షింజో అబే లాంటి వారికి పురస్కారాలు అందుకనే జాబితాలో ఉన్నారు. రామ్ విలాస్ పాశ్వాన్, తరుణ్ గొగోయ్, సుమిత్రా మహాజన్ లాంటి వాళ్ళ అచ్చమైన రాజకీయ నేతలు. రాజకీయాల్లో వీళ్లు చేసిన విశేషమైన సేవలంటూ పెద్దగా ఏమీ లేవు. రాం విలాస్ చనిపోయేనాటికి ఎన్డీయేలో భాగస్వామి అయిన ఎల్జేపీ వ్యవస్థాపక అధ్యక్షుడు. ఇక కేశూభాయ్ పటేల్ గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి. తరుణ్ గొగోయ్ అస్సాం ముఖ్యమంత్రిగా పనిచేశారు. అలాగే ప్రధానమంత్రి కార్యాలయంలో ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన నృపేంద్ర మిశ్రా కూడా కేవలం తన ఉద్యోగ నిర్వహణ మాత్రమే చేశారంతే.

Also Read: తప్పులో కాలేసిన ‘నిమ్మగడ్డ’

మరి జపాన్‌ మాజీ ప్రధానమంత్రి షింజో అబేకి పద్మవిభూషణ్‌ పురస్కారం ఎందుకిచ్చారో ఎవరికీ తెలియదు. సుమిత్రా మహాజన్ లోక్ సభ స్పీకర్ గా పనిచేశారు. బీజేపీ నుంచి పలుమార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. బతికున్నంత కాలం గొగోయ్, పాశ్వాన్, కేశూభాయ్ లాంటివాళ్ళు అచ్చంగా రాజకీయాల్లో మాత్రమే ఉన్నారు. రాజకీయ రంగానికి వీరు చేసిన ప్రత్యేక సేవలంటూ ఏమీ లేవు. సుమిత్రకు పద్మ పురస్కారం ఎందుకిచ్చారో కేంద్రప్రభుత్వమైనా అర్థమైందో లేదో. ఇలాంటి వారిని ఎంపిక చేయడం వల్లనే అలాంటి మహోన్నత పురస్కారాలపై ప్రజల్లో నమ్మకం పోతోంది.

మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్