
తెలుగురాష్ట్రాల్లో పాదయాత్రల సీజన్ మళ్లీ ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజకీయ నేతలు తమపార్టీని ప్రజల్లోకి తీసుకుపోవడానికి ఇదే సందర్భంగా కనిపిస్తోంది. రాజశేఖరరెడ్డి, చంద్రబాబు, జగన్ ఇదే మార్గంలో తమ అధికారానికి బాటలు వేసుకున్నారు. ఇటీవల తీన్మార్ మల్లన్న లాంటి సామాన్యుడు కూడా పాదయాత్రతో ఎమ్మ్లెల్సీ ఎన్నికల్లో తన ఇమేజ్ ను అమాంతం పెంచుకున్నాడు. గెలిచేంతపనిచేసి అధికార పార్టీకి చుక్కలు చూపించాడు. వీటన్నింటిని పరిగణంలోకి తీసుకుంటే.. వచ్చే ఐదారు మాసాల్లో ఇద్దరు ప్రముఖ నేతలు అటు తెలంగాణ, ఇటు ఏపీలో పాదయాత్రలు ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రాజన్న రాజ్యం పేరిట కొత్తపార్టీకి శ్రీకారం చుట్టాలని అనుకుంటున్న షర్మిల తెలంగాణ కేంద్రంగా పాదయాత్ర చేపట్టాలని అనుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీకి పునరుజ్జీవం కల్పించేందుకు ఏపీలో లోకేశ్ పాదయాత్ర చేయాలనే డిమాండ్ పార్టీ నుంచి వినిపిస్తోంది.
Also Read: సీఎం జగన్ కు థ్యాంక్స్ చెప్పిన చిరంజీవి
అయితే షర్మిల పార్టీ వ్యవహారం ఇప్పటికీ అంతుచిక్కని వ్యవహారం. ఎవరో వెనకుండి నడిపిస్తున్నారనే అనుమానం వెంటాడుతోంది. ఆమె తన పార్టీ ద్వారా ఏం సాధించాలని అనుకుంటున్నారో.. రెండు రాష్ట్రాల నాయకులకు సందేహమే. నిజంగానే తెలంగాణ ఫోకస్ గా పార్టీ నడుపుతారా..? లేక అవకాశాన్ని బట్టి ఆంధ్రాకు విస్తరిస్తారా..? అనే అనుమానాలు ఉన్నాయి. ముందుగా ప్రజల్లో కలిసిపోయేందుకు తెలంగాణను వాడుకుంటున్నారనే భావన వ్యక్తం అవుతోంది. ఏప్రిల్ లో తొలి బహిరంగసభ నిర్వహించనున్న ఖమ్మం జిల్లాతో పాటు నల్లగొండ, హైదరాబాద్, రంగారెడ్డి ప్రాంతాల్లో మాత్రమే పార్టీకి కొంత కదలిక వస్తుందని అంచనా. ముఖ్యంగా ఈ నాలుగు జిల్లాల్లోని 13 నియోజకవర్గాల్లో కొంత ప్రభావం ఉంటుందని పరిశీలకులు చెబుతున్నారు.
పక్క రాష్ట్రంలో అధికారం ఉన్నా.. తెలంగాణలో మంచి గుర్తింపు ఉన్న జగన్ మోహన్ రెడ్డిని కాదని ఏపీని వదిలేస్తున్నారు. రాజకీయంగా ఏపీలో పెద్దగా సాధించేది ఏం లేదనే నమ్మకంతో తెలంగాణలో రాజన్న రాజ్యం స్థాపన దిశగా ముందుకు సాగుతున్నట్లు సమాచారం. గతంలో 3112 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన ఘనత షర్మిలది. ప్రపంచ చరిత్రలోనే ఒక మహిళ ఇంత సుదీర్ఘ పాదయాత్ర చేసిన సంఘటనలు లేవు. అప్పటి షర్మిల కష్టమే.. ఇప్పుడు వైసీపీకి ఉపయోగపడింది. ఇక ఇప్పుడు తన సొంత రాజకీయ భవిష్యత్ కోసం షర్మిల పావులు కదుపుతోంది.
Also Read: కరోనా ఎఫెక్ట్.. బెంగళూరు వెళ్లేవాళ్లకు షాకింగ్ న్యూస్.. ?
తెలుగుదేశంలో చంద్రబాబు నాయుడు తరువాత ఎవరన్న ప్రశ్న తెలత్తదు. కానీ రాజకీయ సామర్థ్యం విషయంలో సవాలక్ష సందేశాలు వినిపిస్తున్నాయి. లోకేశ్ ఇంతవరకు తనను తాను నిరూపించుకోలేకపోయారు. 2014 ఎన్నికలకు ముందు 2800 పాదయాత్ర చేసి చంద్రబాబు రికార్డు సృష్టించారు. పార్టీకి సానుభూతి రావడానికి కారణం అయ్యారు. ప్రస్తుతం పార్టీ నిస్తేజంలో ఉండిపోయింది. నాయకుడిగా ప్రజల్లో ఉండిపోవడానికి, పార్టీని నిలబెట్టుకోవడానికి తండ్రి తరహాలో పాదయాత్ర చేపట్టాలని కొందరు నాయకులు లోకేశ్ ను కోరుతున్నట్లు సమాచారం.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్