రేపు (మార్చి27) మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే. అయితే.. బర్త్ డే సెల్రబేషన్స్ మాత్రం ఇవాళ సాయంత్రం నుంచే మొదలు కాబోతున్నాయి. RRRలో రామ్ చరణ్ రౌద్ర రూపాన్ని ఇవాళే ఆవిష్కరించబోతోంది RRR టీమ్. ఈ మేరకు అఫీషియల్ గా అనౌన్స్ చేసింది.
Also Read: అరణ్య మూవీ రివ్యూ.. హిట్టా? ఫట్టా?
అల్లూరిగా రామ్ చరణ్ యాంగ్రీ లుక్ ను రివీల్ చేసేందుకు ముహూర్తం నిర్ణయించారు జక్కన్న. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు చెర్రీ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయబోతున్నాడు. దీంతో.. అల్లూరి గర్జన ఎలా ఉండబోతోందోనని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
రామ్ చరణ్ బర్త్ డేను పురస్కరించుకొని హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో బర్త్ డే పార్టీ నిర్వహించేందుకు ఇప్పటికే ప్లాన్ చేస్తున్నారు ఫ్యాన్స్. అంతా ఒక్కచోట చేరి సంబరాలు చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇలాంటి సందర్భంలో RRRకు సంబంధించి రామ్ చరణ్‌ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తుండడంతో.. సంబరాలు అంబరాన్ని అంటనున్నాయి.
Also Read: ‘రంగ్ దే’ రివ్యూ .. హిట్టా ఫట్టా?
మరోవైపు ఆచార్య టీమ్ కూడా ‘సిద్ధ’ను జనాలకు పరిచయం చేసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలిసింది. అది, ఇవాళా? నెక్స్ట్ డేనా? అన్నది చూడాలి. సిద్ధ లుక్ కూడా వచ్చేసిందంటే.. మెగా అభిమానుల సందడికి హద్దే ఉండదు. బర్త్ డే సెలబ్రేషన్స్ పీక్ స్టేజ్ లో ఉంటాయని చెప్పాల్సిన పనిలేదు.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్