
వివాదాలకు కేరాఫ్ గా నిలిచే నిత్యానంద స్వామి పెను సంచలనం సృష్టించబోతున్నాడు. ఇప్పటికే నిత్యానంద కైలాసం పేరుతో సొంత దేశం ఏర్పాటు చేసుకున్న సంగతి తెల్సిందే. అందరు హిందువులే ఉండే తొలి దేశంగా కైలాసం నిలిచింది. తాజాగా నిత్యానంద స్వామి తన దేశంలో సొంతంగా రిజర్వ్ బ్యాంకు ఏర్పాటు చేయడంతోపాటు తన బొమ్మతో కరెన్సీని తీసుకురాబోతున్నాడు. వినాయక చవితి నుంచి తన బొమ్మతో ఉన్న కరెన్సీ అందుబాటులోకి రాబోతుందని ప్రకటించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
Also Read: కరోనా ఎఫెక్ట్.. ఇంటికే గణేశుడు పరిమితం..!
నిత్యానంద ఇప్పటికే తన బొమ్మతో కూడిన కరెన్సీ అన్ని దేశాల్లో చెలమణి అయ్యేలా ఆయా దేశాల బ్యాంకులతో చట్టబద్ధంగా ఎంఓయూ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఈనెల 22న కైలాసంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ కైలాస్ ను ప్రారంభించేందుకు సన్నహాలు చేస్తున్నాడు. ఈ బ్యాంకు నుంచి ముద్రణ అయ్యే కరెన్సీ కైలాస దేశంలోపాటు ఆయా దేశాల్లో చెలమణి అవుతుందని నిత్యానంద చెబుతున్నాడు. ఇక కరెన్సీ రూపు రేఖలు, విధి విధానాలను 22న ప్రకటిస్తానని నిత్యానంద పేర్కొన్నాడు.
కాగా నిత్యానందపై భారతదేశంలో అనేక కేసులు ఉన్నాయి. బెంగూళూరు కేంద్రంగా నిత్యానంద ప్రధానంగా ఆశ్రమం కార్యకలాపాలను కొనసాగించాడు. అయితే నిత్యానందపై వ్యభిచారం.. పిల్లల అక్రమ నిర్బంధం.. మహిళల అదృశ్యం.. అపహరణ వంటి ఆరోపణలు ఉన్నాయి. ఆయనపై పలు కేసులు నమోదుకాగా కొంతకాలం కర్ణాటకలోని రామనగర జైల్లో నిత్యానంద జైలు శిక్ష అనుభవించాడు. అనంతరం బెయిల్ మీద బైటకొట్టాడు. ఇక గుజరాత్ లోని తన ఆశ్రమంలో తమ పిల్లలను అక్రమంగా నిర్బంధించినట్టు పలువురు ఫిర్యాదు చేశారు.
Also Read: జగన్ ది బుర్రా.. లేక ఖర్ఖానాన?
ఈ సమయంలోనే నిత్యానంద దేశం విడిచి ఈక్వాడార్ కు పరారయ్యారు. ఆ దేశానికి సంబంధించిన ఓ దీవీని కొనుగోలు చేసి కైలాస దేశంగా మార్చాడు. ఇక తాజాగా సొంత కరెన్సీ.. సొంత బ్యాంకు ఏర్పాటు చేసి వార్తల్లో నిలిచాడు. అయితే గతంలో నిత్యానందతో నటి రంజని రసలీలల వీడియో అప్పట్లో బయటికి వచ్చి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అప్పటి నుంచి ఆయనను రాసలీలలా నిత్యానంద స్వామిగా గుర్తింపు పొందాడు. ప్రస్తుతం నిత్యానంద బొమ్మతో కూడిన కరెన్సీ నెట్టింట్లో వైరల్ అవుతుండటం నెటిజన్లు సైటర్లు వేస్తూ కామెంట్లు చేస్తున్నారు.